హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Pawan Kalyan: టీడీపీతో పొత్తుపై క్లారిటీ ఇచ్చిన పవన్ కళ్యాణ్.. ఆ మాటకు అర్థం అదేనా ?

Pawan Kalyan: టీడీపీతో పొత్తుపై క్లారిటీ ఇచ్చిన పవన్ కళ్యాణ్.. ఆ మాటకు అర్థం అదేనా ?

Pawan Kalyan News: రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం వ్యతిరేక ఓటు చీలిపోకుండా చూస్తానని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.

Pawan Kalyan News: రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం వ్యతిరేక ఓటు చీలిపోకుండా చూస్తానని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.

Pawan Kalyan News: రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం వ్యతిరేక ఓటు చీలిపోకుండా చూస్తానని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు.

  జనసేన ఆవిర్భావ సభలో ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పొత్తులపై కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు ఏం చేయాలనే దానిపై బీజేపీ పెద్దలు ఓ రోడ్ మ్యాప్ ఇస్తారని తనకు చెప్పారని.. దాని కోసం ఎదురుచూస్తున్నానని పవన్ కళ్యాణ్ అన్నారు. అదే సమయంలో రాష్ట్రంలో వైసీపీ(Ysrcp) ప్రభుత్వం వ్యతిరేక ఓటు చీలిపోకుండా చూస్తానని ఆయన స్పష్టం చేశారు. పార్టీలు, వ్యక్తులు రాష్ట్ర ప్రయోజనాల కోసం ముందుకొస్తే.. పొత్తుల గురించి ఆలోచిస్తానని అన్నారు. రాష్ట్ర బాధ్యతను తీసుకునేందుకు తాను సిద్ధంగా ఉన్నానని.. జనసేన (Janasena) సిద్ధంగా ఉందని పవన్ కళ్యాణ్(Pawan Kalyan) ఉద్వేగంగా వ్యాఖ్యానించారు. ఈ సభలో పవన్ కళ్యాణ్ వైసీపీని ఎదుర్కొనే విషయంలో కీలక ప్రకటన చేస్తారని వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో జనసేన మరోసారి టీడీపీతో పొత్తుపెట్టుకుని వైసీపీతో పోరాడుతుందా ? అన్న విషయంపై పవన్ కళ్యాణ్ ప్రకటన చేయడమో లేక సంకేతాలు ఇవ్వడమో చేస్తారని అంతా ఎదురుచూశారు.

  అందరూ అనుకున్న విధంగానే పవన్ కళ్యాణ్ ఈ విషయంపై స్పందించారు. వచ్చే ఎన్నికల్లో కచ్చితంగా అధికార వైసీపీని గద్దె దించుతామని ప్రకటించిన పవన్ కళ్యాణ్.. ఇందుకోసం టీడీపీతో పొత్తు పెట్టుకునే అవకాశం ఉందని పరోక్షంగా వెల్లడించారు. ప్రస్తుతం ఏపీలో జనసేన, బీజేపీ మధ్య రాజకీయ స్నేహం ఉంది. ఈ రెండు పార్టీలు ఎన్నికల్లో కలిసి పోటీ చేస్తాయని బీజేపీ నేతలు అనేకసార్లు ప్రకటించారు.

  అయితే 2014 తరహాలో ఈ రెండు పార్టీలు మళ్లీ టీడీపీని కలుపుకుని ముందుకు సాగుతాయా ? అన్న అంశంపై మాత్రం క్లారిటీ రాలేదు. ఏపీలో ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న టీడీపీని మళ్లీ కలుపుకుని ముందుకు సాగే విషయంలో బీజేపీ సముఖంగా లేదని ప్రచారం ఉంది. కానీ టీడీపీ మాత్రం జనసేనతో కలిసి ఎన్నికలకు వెళితే.. మళ్లీ తమకు అధికారం ఖాయమనే భావనలో ఉందని చర్చ సాగుతోంది. దీనిపై టీడీపీ అధినేత చంద్రబాబు కూడా గతంలో కీలక వ్యాఖ్యలు చేశారు.

  Pawan Manifesto: జనసేన ఎన్నికల మేనిఫెస్టో ఇదే..! వారి ఖాతాల్లో రూ.10 లక్షలు.. పవన్ షణ్ముఖ వ్యూహం..

  Pawan Speech: 2024లో అదే మన టార్గెట్..! వైసీపీది వింత ప్రతిజ్ఞ.. పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు..

  తాజాగా ఏపీలో వైసీపీ వ్యతిరేక ఓటు ఎట్టి పరిస్థితుల్లోనూ చీలిపోనివ్వనని పవన్ కళ్యాణ్ గట్టిగా చెప్పడంతో... వచ్చే ఎన్నికల్లో బీజేపీ, జనసేన కూటమిలో టీడీపీ కూడా ఉంటుందనే సంకేతాలను ఆయన ఇచ్చారనే వాదన బలంగా వినిపిస్తోంది. మొత్తానికి వైసీపీని ఓడించేందుకు టీడీపీ మరోసారి 2014 తరహా కూటమితో ముందుకు సాగుతుందా ? అన్న ప్రశ్నకు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు ఓ సమాధానంగా మారుతాయా ? అన్నది చూడాలి.

  First published:

  Tags: Janasena, Pawan kalyan

  ఉత్తమ కథలు