హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Pawan Kalyan: ఆ నాలుగు నియోజకవర్గాలపైనే పవన్ ఫోకస్.. సభలో ఉండాలి అంటే..? అక్కడ నుంచే పోటీ చేయాలా..?

Pawan Kalyan: ఆ నాలుగు నియోజకవర్గాలపైనే పవన్ ఫోకస్.. సభలో ఉండాలి అంటే..? అక్కడ నుంచే పోటీ చేయాలా..?

ఈ నాలుగు సీట్లు పవన్ కు సేఫ్

ఈ నాలుగు సీట్లు పవన్ కు సేఫ్

Pawan Kalyan: గత ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ కు ఘోర అనుభవం ఎదురైంది. పోటీ చేస్తున్న రెండు నియోజకవర్గాల్లోనూ ఓడిపోయారు. కానీ పార్టీ తరుపున పోటీ చేసిన రాపాక.. రాజోలు నుంచి గెలుపొందారు. కానీ ఆయన వైసీపీకి జై కొట్టారు. దీంతో అసెంబ్లీలో జనసేన వాయిస్ వినిపించే అవకాశం లేకుండా పోయింది. దీంతో వచ్చే ఎన్నికల్లో పవన్ ఎలాగైనా గెలుపొందాలనే కంకణం కట్టుకున్నారు. ఇందులో భాగంగా నాలుగు నియోజకవర్గాలపై ఫోకస్ చేస్తున్నట్టు సమాచారం..

ఇంకా చదవండి ...
 • News18 Telugu
 • Last Updated :
 • Visakhapatnam, India

  Pawan Kalyan: అసెంబ్లీకి దారేది.. ప్రస్తుతం పవన్ ఉన్న పెద్ద ప్రశ్న ఇదే.. ఎందుకంటే.. గత ఎన్నికల్లో రెండు చోట్ల పోటీ చేసినా.. రెండు చోట్ల ఓటమి పాలయ్యారు. గాజువాక‌ (Gajuwaka) తో పాటు ప‌శ్చిమ‌గోదావ‌రిలోని భీమ‌వ‌రం (Bheemavaram) నుంచి పోటీచేసిన‌ప్ప‌టికీ రెండుచోట్లా నిరాశే ఎదురైంది. ప‌వ‌న్ క‌ల్యాణ్ (Pawan Kalyan) పోటీప‌డ్డ ఈ రెండు నియోజ‌క‌వ‌ర్గాల్లోను తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party) మూడోస్థానానికి ప‌డిపోయింది. ఈసారి ఎట్టి ప‌రిస్థితుల్లోను అసెంబ్లీలోకి అడుగుపెట్టాల‌ని కృతనిశ్చయంతో ఉన్న పవన్ ఏ నియోజకవర్గం నుంచైతే సులవుగా గెలుపు గుర్రం ఎక్కవచ్చంటూ ఒక ప్రయివేటు సంస్థచేత సర్వే నిర్వహింప చేయించారు. అందుకే పార్టీ భారీ మెజార్టీ సంగతి ఎలా ఉన్నా.. మొదట అధినేత పవన్ గెలుపు తప్పని సరి అయ్యింది. ఈ సారి కూడా ఓడితే.. ఇక జనసేన సర్దుకోక తప్పదు.. పార్టీలో ఉన్న కొద్దిమంది కూడా చేజారిపోయే ప్రమాదం ఉంటుంది. అందుకే ఈ సారి అధినేత పవన్ ఎక్కడ నుంచి పోటీ చేయాలి అన్నదానిపై ప్రత్యేకంగా ఫోకస్ చేస్తున్నారు. ఎప్పటికప్పుడు ప్రత్యేకంగా సర్వేలు చేయించుకుంటున్నారు.

  ఆ సర్వే సంస్థ.. పవన్ కోసం నాలుగు నియోజకవర్గాలను సూచించినట్లు జనసేన వర్గాలు వెల్లడించాయి. అందులో ఒకటి తూర్పుగోదావ‌రి జిల్లా పిఠాపురం.. ఇక్కడ అయితే ప‌వ‌న్ కల్యాణ్ సులువుగా గెలుపు గుర్రం ఎక్కేస్తారంటూ స్థానిక నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు కూడా గతంలో ప‌లుమార్లు ఆహ్వానం పంపించిన సందర్భాలు ఉన్నాయి. జనసేన నేతలు సైతం ఎక్కువమంది అదే అభిప్రాయంలో ఉన్నారు. కేవలం పవన్ అనే కాదు.. ఈ సారి ఎవరు అక్కడ జనసేన తరపున నిలబడిని గెలిపిస్తామంటున్నారు.

  ఇక రెండోది తిరుపతి .. గతంలో ప్రజారాజ్యం స్థాపించినప్పడు చిరంజీవి తిరుపతి నుంచి పోటీచేసి విజయం సాధించారు.. కానీ సొంత నియోజకవర్గం పాలకొల్లులో ఓటమి పాలయ్యారు. తిరుపతి పట్టణంలో సామాజికవర్గ దన్నుతోపాటు అభిమానుల బలం ఎక్కువ‌. అక్కడి స్థానిక నేతలు సైతం పదే పదే పవన్ కు ఆహ్వానాలు పంపుతున్నారు. లక్షకు పైగా భారీ మెజార్టీతో గెలిపిస్తామని.. నమ్మకంగా చెబుతున్నారు.

  ఇదీ చదవండి : సీఎం చేతికి ఐ ప్యాక్ సర్వే.. టాప్ లో ఉన్నది ఎవరు? ఈ ఐదు అంశాలపై క్లారిటీ?

  మ‌రోవైపు ఈ రెండు కాకుండా మ‌రో రెండు నియోజ‌క‌వ‌ర్గాల‌ను కూడా సంస్థ గుర్తించింది. వీటిలో కాకినాడ రూరల్ ఒకటి. ప్ర‌స్తుతం ఇక్క‌డి నుంచి కుర‌సాల క‌న్న‌బాబు ప్రాతినిధ్యం వ‌హిస్తున్నారు. అయితే ఇక్కడ నుంచి పోటీచేస్తే కాకినాడ సిటీపై కూడా ప్రభావం ఉంటుందని, ఈసారి ఎన్నికల్లో కాకినాడ టౌన్ నుంచి ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డిని ఓడిస్తామని సవాల్ చేశారు కాబట్టి రూరల్ నుంచి పోటీచేయాలంటూ అభిమానులు కూడా కోరుతున్నారు. రూరల్ లో సామాజికవర్గం బలం ప్రబలంగా ఉంది.

  ఇదీ చదవండి : కృష్ణం రాజు వ్యాక్స్ విగ్రహం సిద్ధం.. ప్రభాస్ కోరికపై తయారీ.. ప్రత్యేకత ఇదే

  ఈ మూడు నియోజకవర్గాల తరువాత.. సూచించిన మరో నియోజకవర్గం విశాఖపట్నం ఉత్తరం. గత ఎన్నికల్లో విశాఖపట్నం టౌన్ పరిధిలోని నాలుగు నియోజకవర్గాల్లోను టీడీపీ అభ్యర్థులే విజయం సాధించారు. ఇక్కడ టీడీపీ బలంగా ఉండటంతోపాటు పట్టణ ఓటర్లు ఎక్కువగా ఉంటారు కాబట్టి సునాయాసంగా విజయం సాధించవచ్చని తేలింది. ఈ నియోజకవర్గం నుంచి టీడీపీ తరఫున గంటా శ్రీనివాసరావు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. గంటా ప్రతి ఎన్నికకు నియోజకవర్గాన్ని మారుస్తారు కాబట్టి ఇబ్బంది లేకుండా ఉంటుందనే యోచన పార్టీలో వ్యక్తమవుతోంది. ప‌వ‌న్ క‌ల్యాణ్‌లాంటి నాయకుడు అసెంబ్లీలో ఉంటే బాగుంటుంద‌ని ప్ర‌జాస్వామ్య వాదులు ఆకాంక్షిస్తున్నారు.

  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Andhra Pradesh, AP News, Janasena, Pawan kalyan

  ఉత్తమ కథలు