Home /News /andhra-pradesh /

AP POLITICS JANASENA PARTY CHIEF PAWAN KALYAN TO HOLD PUBLIC GRIEVANCE PROGRAM ON THE NAME OF JANAVANI FROM JULY 3RD FULL DETAILS HERE PRN

Janasena Party: కొత్త వ్యూహంతో పవన్ కల్యాణ్.. ఇకపై ప్రతి ఆదివారం జనంలోనే..!

పవన్ కళ్యాణ్ (file)

పవన్ కళ్యాణ్ (file)

కౌలు రైతు భరోసా యాత్ర పేరుతో ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతులకు ఆర్ధిక సాయం చేస్తున్న పవన్ కల్యాణ్ (Pawan Kalyan).. తాజాగా ప్రజాసమస్యలను స్వీకరించేందుకు వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించనునున్నారు.

    ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజకీయాల్లో జనసేన పార్టీ (Janasena Party) స్పీడ్ పెంచింది. జనంలోకి వెళ్లేందుకు ఏ ఒక్క ఛాన్స్ ని కూడా జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) వదులుకోవడం లేదు. ఇప్పటికే కౌలు రైతు భరోసా యాత్ర పేరుతో ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతులకు ఆర్ధిక సాయం చేస్తున్న పవన్ కల్యాణ్.. తాజాగా ప్రజాసమస్యలను స్వీకరించేందుకు వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించనునున్నారు. జనవాణి పేరుతో సామాన్యుల సమస్యలు తెలుసుకోవడంతో పాటు కష్టాల్లో ఉన్న వారికి భరోసాగా నిలుస్తామని జనసేన ప్రకటించింది.ఈ కార్యక్రమంలో భాగంగా పవన్ కళ్యాణ్ వరుసగా వచ్చే ఐదు ఆదివారాలు ప్రజలకు ప్రత్యక్షంగా అందుబాటులో ఉండి... ప్రజల నుంచి స్వయంగా అర్జీలు స్వీకరించనున్నారు. ఈ కార్యక్రమాన్ని జూలై 3న విజయవాడలో పవన్ కల్యాణ్ ప్రారంభించనున్నారు.

    గతంలో ప్రభుత్వాలు ప్రజల పక్షాన నిలబడి, ప్రజా సమస్యలు పరిష్కారమయ్యే విధంగా కార్యక్రమాలు చేపట్టేవని.., ముఖ్యమంత్రులు ప్రజల బాధలు విని అర్జీలు తీసుకొనేవారని.. కానీ.. వైసీపీ అధికారంలోకి వచ్చిన ఈ మూడేళ్లలో ముఖ్యమంత్రికి అర్జీ ఇచ్చే అవకాశం సామాన్యుడికి లేకుండా పోయిందని జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ విమర్శించారు. జిల్లాల్లో కలెక్టర్లు నిర్వహిస్తున్న స్పందన కార్యక్రమం కూడా తూతూ మంత్రంగా సాగుతోందన్నారు. ప్రజాప్రతినిధులు నిర్వహిస్తున్న గడప గడపకు కార్యక్రమంలోనైనా ప్రజా సమస్యలు విని, వాటిని పరిష్కారిస్తారంటే ఆ పరిస్థితి ఎక్కడ కూడా కనిపించడం లేదన్నారు. గడప గడపకు కార్యక్రమంలో ఎవరైతే ప్రజాప్రతినిధులను సమస్యలపై నిలదీస్తున్నారో వాళ్లపై కేసులు పెట్టి వేధిస్తున్నారన్నారు.

    ఇది చదవండి: గుడివాడ మహానాడు వాయిదాతో చంద్రబాబు కీలక నిర్ణయం.. అప్పటివరకు నో ప్రోగ్రామ్స్..


    ఇటీవల ప్రకాశం జిల్లా నుంచి ఒక వికలాంగ దళిత మహిళ... తన స్థలాన్ని ఆక్రమించి వైసీపీ నాయకులు భవనం నిర్మించారని ముఖ్యమంత్రిని కలిసి వినతిపత్రం ఇద్దామని ప్రయత్నించి విఫలమయ్యిందని.., ఆమె వస్తుంటే కలవనీయకుండా ఆటంకాలు కలిగించారని గుర్తుచేశారు. ఇది తెలిసి చలించిపోయిన పవన్ కళ్యాణ్ గారు 'జనవాణి - జనసేన భరోసా' కార్యక్రమాన్ని రూపొందించారని మనోహర్ తెలిపారు.

    ఇది చదవండి: వైసీపీలో ఏం జరుగుతోంది..? సీనియర్ నేతల కామెంట్స్ దేనికి సంకేతం..?


    జులై 3న ఉదయం 10 గంటల నుంచి విజయవాడలోని మాకినేని బసవపున్నయ్య ఆడిటోరియంలో ఈ కార్యక్రమం ప్రారంభమవుతుందని.., మధ్యాహ్నం 3 గంటల వరకు ప్రజలకు పవన్ ప్రజల నుంచి అర్జీలు స్వీకరిస్తారన్నారు. సాయంత్రానికల్లా సంబంధిత అధికారులకు సమస్యలు చేరేటట్లు ప్రయత్నం చేస్తారని నాదెండ్ల మనోహర్ వివరించారు. మరుసటి రోజు నుంచి సమస్య పరిష్కారమయ్యే విధంగా పార్టీ కార్యాలయం నుంచి ఫాలో అప్ చేస్తారని.., రాజకీయాలకు అతీతంగా, సామాన్యుడికి న్యాయం జరిగే విధంగా ఈ కార్యక్రమాన్ని రూపొందించినట్లు ఆయన వివరించారు.



    పవన్ కళ్యాణ్ సమస్య విన్నవించుకుంటే న్యాయం జరుగుతుందనే నమ్మకం ప్రజల్లో ఉందని.., దాన్ని బలపరిచే విధంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు మనోహర్. తొలి రెండు ఆదివారాలు విజయవాడలో, తరువాత ఉత్తరాంధ్ర, రాయలసీమ, ఉభయగోదావరి ప్రాంతాల్లో కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు.
    Published by:Purna Chandra
    First published:

    Tags: Andhra Pradesh, Janasena party, Pawan kalyan

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు