హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

ఇరుక్కున్న పవన్ కళ్యాణ్... అసలు సిసలు పరీక్ష

ఇరుక్కున్న పవన్ కళ్యాణ్... అసలు సిసలు పరీక్ష

పవన్ కళ్యాణ్

పవన్ కళ్యాణ్

ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్‌కు ఎలాంటి షోకాజ్ నోటీసు ఇవ్వలేదని జనసేన వివరణ ఇచ్చింది. అయితే జనసేన ఈ ప్రకటన చేసేలోపుగానే రాపాక టంగ్ స్లిప్ అయ్యారు.

  ఏపీలోని అధికార వైసీపీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు రాజకీయంగా కొత్త ఇబ్బంది వచ్చిపడిందనే టాక్ వినిపిస్తోంది. జనసేన ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్... పవన్ కళ్యాణ్‌ను ఉద్దేశించి చేసిన కొన్ని వ్యాఖ్యలు ఇప్పుడు ఆయనకు కొత్త తలనొప్పిని తెచ్చిపెట్టే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్‌కు జనసేన షోకాజ్ నోటీసు ఇచ్చిందంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. అయితే తాము రాపాకకు ఎలాంటి షోకాజ్ నోటీసు ఇవ్వలేదని ఆ పార్టీ వివరణ ఇచ్చింది. కానీ జనసేన ఈ ప్రకటన చేసేలోపుగానే రాపాక టంగ్ స్లిప్ అయ్యారు.

  పవన్ కళ్యాణ్‌పై గట్టిగానే విమర్శలు చేశారు. తాను గెలిచిన ఎమ్మెల్యేనని... తనకు ఓడిపోయిన వాళ్లు షోకాజ్ నోటీసు ఇవ్వడం ఏంటని ప్రశ్నించారు. పార్టీ మీద ఏదైనా అధికారం అనేది ఉందంటే అది తనకు మాత్రమే అని ఆయన కామెంట్ చేశారు. తాను ఎవరి భిక్షతోనూ ఎమ్మెల్యే కాలేదనీ... సొంత శక్తి తో ఎమ్మెల్యేగా గెలిచానని అన్నారు. తనను గెలిపించే వాళ్లే అయితే ఆయన ఎందుకు ఓడిపోయారు రెండు చోట్లా? అని పవన్ కళ్యాణ్‌పై పరోక్షంగా సెటైర్లు వేశారు. దిశానిర్దేశం లేని పార్టీలో ఉండటం తనకు ఇష్టం లేదని... రాజీనామా చేసి మళ్ళీ గెలిచే శక్తి తనకు ఉందని ఆయన అన్నారు.

  రాపాక వరప్రసాద్ చేసిన ఈ కామెంట్స్‌ ఇప్పుడు పవన్ కళ్యాణ్‌కు ఇబ్బందిగా మారాయి. ఈ వ్యాఖ్యల కారణంగా అయినా ఇప్పుడు రాపాకకు షోకాజ్ ఇవ్వక తప్పని పరిస్థితి జనసేనకు నెలకొందని రాజకీయవర్గాల్లో ప్రచారం జరుగుతోంది. రాపాక తీరు చూస్తుంటే... పార్టీ తనపై చర్యలు తీసుకుంటే ఆయన కూడా టీడీపీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ బాటలో నడిచే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది.

  Published by:Kishore Akkaladevi
  First published:

  Tags: AP News, AP Politics, Janasena, Pawan kalyan, Rapaka varaprasad

  ఉత్తమ కథలు