Home /News /andhra-pradesh /

AP POLITICS JANASENA LEADERS SLAMS YCP MINISTER FOR CRITICISING PAWAN KALYAN FULL DETAILS HERE PRN GNT

YCP vs Janasena: రాసలీలల స్క్రిప్ట్ రెడీ.. హీరోయిన్లు వాళ్లే.. మంత్రులకు జనసేన ఓపెన్ ఆఫర్..

పవన్ కల్యాణ్, వైఎస్ జగన్ (ఫైల్)

పవన్ కల్యాణ్, వైఎస్ జగన్ (ఫైల్)

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) పాలిటిక్స్ (AP Politics) లో అధికార వైసీపీ (YSRCP), ప్రతిపక్ష టీడీపీ (TDP) కంటే ఎక్కువగా వైసీపీ, జనసేన (Janasena Party) మధ్య మాటల యుద్ధం ఓరేంజ్ లో జరుగుతోంది. జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) రైతు భరోసా యాత్రపై మంత్రులు చేస్తున్న విమర్శలకు జనసేన నేతలు అదేస్థాయిలో కౌంటర్లు వేస్తున్నారు.

ఇంకా చదవండి ...
  ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) పాలిటిక్స్ (AP Politics) లో అధికార వైసీపీ (YSRCP), ప్రతిపక్ష టీడీపీ (TDP) కంటే ఎక్కువగా వైసీపీ, జనసేన (Janasena Party) మధ్య మాటల యుద్ధం ఓరేంజ్ లో జరుగుతోంది. జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) రైతు భరోసా యాత్రపై మంత్రులు చేస్తున్న విమర్శలకు జనసేన నేతలు అదేస్థాయిలో కౌంటర్లు వేస్తున్నారు. పవన్ పై మంత్రులు అంబటి రాంబాబు (Ambati Rambabu), గుడివాడ అమర్నాథ్ (Gudivada Amarnath) చేసిన కామెంట్స్ కు జనసేన ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూధన్ రెడ్డి ఘాటుగా స్పందించారు. రాసలీలల స్క్రిప్ట్ రెడీగా ఉందని.. మీరు ఒప్పుకుంటే హీరోయిన్లను కూడా సెలెక్ట్ చేస్తామంటూ సెటైర్లు వేశారు.

  ‘రాష్ట్ర మంత్రులు అంబటి రాంబాబు, గుడివాడ అమర్నాథ్ లకు చెబుతున్నాం - రాసలీలల స్క్రిప్ట్ రెడీ గా ఉంది.. ఇది మీరు మర్చిపోయినా రాష్ట్ర ప్రజలు మర్చిపోరు.. మీరు ఓకే అంటే మంచి రాసలీలల స్క్రిప్ట్ తో సినిమా తీద్దాం. ఐతే ఒకటే చిక్కు. పాపం నిర్మాతలకు మీ ఆడియో లీక్ లిస్ట్ లో ఉన్నవాళ్లందరిని హీరోయిన్లుగా పెడితే తడిసి మోపెడు అవుతుంది అని భయం. మంత్రులుగా ఉన్నప్పుడు సమస్యల మీద మాట్లాడండి. వ్యక్తిగత జీవితాల్లోకి వెళ్తే మేము కూడా మీ వ్యక్తిగత జీవితాల్లోకి వెళ్లేందుకు సిద్ధంగానే ఉన్నాం. మీలాంటి వారికీ మంత్రి పదవి ఇవ్వడమే ఎక్కువ. ఎన్నో లెక్కలు వేసి సిబిఐ దత్తపుత్రుడు జగన్ రెడ్డి మంత్రి పదవులు ఇచ్చారు. మీలాంటి వారిని శ్రీ పవన్ కళ్యాణ్ గారు దగ్గరకు కూడా రానివ్వరు గుర్తు పెట్టుకోండి’ అంటూ జనసేన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ చిలకం మధుసూదనరెడ్డి స్పష్టం చేశారు.

  ఇది చదవండి: టీచర్ల ఉద్యమంపై స్పందించిన ఏపీ ప్రభుత్వం.. సీపీఎస్ రద్దు దిశగా కీలక నిర్ణయం..


  రైతు సమస్యల మీద పవన్ కల్యాణ్ పోరాడుతుంటే.., సమాధానం చెప్పకుండా ఇష్టానుసారంగా మాట్లాడటం సరికాదన్నారు. రైతు భరోసా యాత్ర విజయవంతం అవుతుంటే ప్రభుత్వ పెద్దల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయన్నారు. కష్టాల్లో ఉన్న రైతులను ఆదుకోవడానికి మానవత్వం ఉండాలి. తన సొంత డబ్బు ఐదు కోట్ల రూపాయలను రైతుల కోసం వెచ్చించిన పవన్ గురించి రైతుల్లో వస్తున్న మంచి ఆలోచనను దారి మళ్లించడానికి మంత్రులు ఈ విధంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. పవన్ ప్రజలకు దత్తపుత్రుడని.., ఆయనను ఎవరో ముఖ్యమంత్రి అభ్యర్థిగా ప్రకటించాల్సిన అవసరం లేదన్నారు.

  ఇది చదవండి: మంత్రిగా తన మార్క్ చూపిస్తున్న రోజా.. ప్లేయర్ గా మారిన మినిస్టర్


  మంత్రి గుడివాడ అమర్నాథ్ కు పొత్తుకు, మద్దతుకు తేడా తెలియకపోవడం విచారకరంమని., 2014లో టీడీపీకి కేవలం జనసేన పార్టీ మద్దతు ఇచ్చింది. అనంతరం 2019లో అప్పటి ప్రభుత్వం హయాంలో జరిగిన తప్పులను బహిరంగంగా ప్రశ్నించామన్నారు. గతంలో ఏ కార్యక్రమం చేసినా బూతులతో రెచ్చిపోయే మంత్రులు ఉంటే, ఇప్పుడు అయోమయం మంత్రులు ఉన్నారు. ఇష్టానుసారం అవాకులు చవాకులు పేలితే గతంలో బూతుల మంత్రికి గొడ్ల చావడిలో పడుకునే గతి పట్టిందని.., ఆ గతే మీకు పడుతుందంటూ హెచ్చరించారు.

  ఇది చదవండి: యువతను ముంచింది ఆయనే.. హక్కుల కోసం రోడ్డెక్కడం తప్పా..


  మంత్రి అంబటి రాంబాబు కామెంట్స్ కు జనసేన నేత పోతిన మహేష్ కౌంటర్ ఇచ్చారు. అంబటికి ఇచ్చింది జలవనరుల శాఖ అని.. స్విమ్మింగ్ పూల్ శాఖ కాదని ఎద్దేవా చేశారు. తమ దగ్గరకూడా సీబీఐ దత్తపుత్రుడు, బాత్ రూమ్ లో బాబాయ్, సంజన-సుకన్య సినిమాలకు స్కిప్ట్ సిద్ధంగా ఉందని.. డబ్బులేకపోతే జనసైనికులే చందాలు వేసుకొని ఇస్తామంటూ ఎద్దేవా చేశారు.
  Published by:Purna Chandra
  First published:

  Tags: Andhra Pradesh, Janasena party, Ysrcp

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు