Minister Roja: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజకీయాల్లో నగరి (Nagari) నియోజకవర్గానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. అందుకు కారణం అక్కడ నుంచి రోజా ప్రాతినిధ్యం వహిస్తుండడమే.. ఇప్పటికే ఆమె రెండు సార్లు నెగ్గారు.. ఇప్పుడు గెలుపు ఫోకస్ చేస్తున్నారు. గతంలో ఆమె నెగ్గిన రెండు సార్లు స్వల్ప మెజార్టీనే వచ్చింది. తొలి సారి ఆమె గెలిచినా.. పార్టీ అధికారంలో లేకపోవడంతో ఆమెపై పెద్దగా వ్యతిరేకత కనిపించ లేదు. ఇక రెండు రోజు ఆమె నెగ్గడంతో పాటు వైసీపీ (YCP) అధికారంలోకి వచ్చింది. రోజాను మంత్రి పదవి కూడా వరించింది. దీంతో మంత్రి అయినా అనుకున్నంతగా ఏమీ చేయడం లేదనే విమర్శలు ఉన్నాయి.. దీనికి తోడు సొంత పార్టీలో కుమ్ములాటలు ప్రతికూలంగా మారుతున్నాయి. ఆమెకు వ్యతిరేకంగా ఇప్పటికే రెండు మూడు వర్గాలు బలంగా పని చేస్తున్నాయి. ఆమెకు పోటీగా పార్టీ కార్యక్రమాలు చేపడుతున్నాయి. అంతేకాదు.. అధినేత.. సీఎం జగన్ మోహన్ రెడ్డి (CM Jagan Mohan Reddy) వరకు కూడా ఫిర్యాదులు వెళ్లినట్టు టాక్..
ఇలా సొంత పార్టీ నుంచే ప్రత్యర్థులు ఉండడంతో ఆమెకు గెలుపు ఈ సారి అంత ఈజీ కాదు. దానికి తోడు ప్రతిపక్షాలు తెలుగు దేశం పార్టీ (Telugu Desam Party), జనసేన (Jansena) సైతం బాగానే బలం పుంజుకున్నట్టు సర్వేలు వివిధ సర్వేలు చెబుతున్నాయి. దీంతో ఆమె గెలుపు కోసం చాలా కష్టపడక తప్పదు..
నగరిలో ప్రస్తుతం జనసేన సైతం యాక్టివ్ గానే ఉంది. దీంతో నిత్యం జనసేనపై రోజా విమర్శలు చేస్తున్నారు. తాజాగా ఏపీలో జనసేనాని పర్యటన వారాహి వాహనం పై ఆర్కే రోజా సంచలన ఆరోపణలు చేస్తున్నారు. పవన్ వాహనం వారహి కాదు.. నారాహి అని పెట్టుకోవాలి అంటూ వ్యాఖ్యానించారు. అంతేకాదు పవన్ కు గెలించేంత సీన్ లేదంటూ ఆరోపణలు చేశారు. ఈ నేపథ్యంలో జనసేన నేతలు సైతం రోజాపై తీవ్రస్థాయిలో మండిపడుతున్నారు.
ఇదీ చదవండి : ఉద్యోగుల నుంచి సర్కార్‌కు సెగలు.. ఏపీ జేఏసీ కీలక నిర్ణయం
తిరుపతి జనసేన ఇంచార్జ్ కిరణ్ రాయల్ మాట్లాడుతూ.. తమ అధినేత పవన్ కళ్యాణ్ వాహనం వారాహిని అడ్డుకునే దమ్ము వైసిపి కార్యకర్తలకు ఉందా అని ప్రశ్నించారు. మంత్రులు అంబటి రాంబాబు, రోజాలు నోరు అదుపులో పెట్టుకోవాలని సూచించారు. అంతేకాదు మంత్రి రోజా గురించి ఏపీ ప్రజలు అందరికీ తెలుసని .. అసలు వైసీపీ కేబినెట్ లోనే అవినీతి మంత్రి రోజాని తీవ్ర విమర్శలు చేశారు. రానున్న ఎన్నికల్లో రోజా గెలిచే ప్రసక్తే లేదని జోస్యం చెప్పారు.
ఒకవేళ వచ్చే ఎన్నికల్లో రోజా గెలిస్తే ఆమె ఇంటి ముందు గుండు గీయించుకుంటానని.. ఒకవేళ మంత్రి రోజా ఓడిపోతే గుండు గీయించుకుంటురా అంటూ కిరణ్ రాయల్ సవాల్ విసిరారు. అంతేకాదు అసలు వచ్చే ఎన్నికల్లో వైసిపి ఘోరంగా ఓడిపోవడం ఖాయం అంటూ సంచలన కామెంట్స్ చేశారు తిరుపతి జనసేన ఇంచార్జ్ కిరణ్ రాయల్.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP News, AP Politics, Minister Roja