హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Konaseema: ఆ విషయం పోలీసులకు ముందే తెలుసు.. అమలాపురం అల్లర్లపై జనసేన నేత సంచలన వ్యాఖ్యలు

Konaseema: ఆ విషయం పోలీసులకు ముందే తెలుసు.. అమలాపురం అల్లర్లపై జనసేన నేత సంచలన వ్యాఖ్యలు

ప్రతీకాత్మకచిత్రం

ప్రతీకాత్మకచిత్రం

కోనసీమ జిల్లా (Konaseema District) పేరు విషయంలో అమలాపురం (Amalapuram) లో జరిగిన అల్లర్లు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. ఈ వ్యవహారంపై తీవ్రరాజకీయ దుమారం కూడా రేగింది. అధికార ప్రతిపక్షాల మధ్య నిత్యం మాటల తూటాలు పేలుతూనే ఉన్నాయి

ఇంకా చదవండి ...

కోనసీమ జిల్లా (Konaseema District) పేరు విషయంలో అమలాపురం (Amalapuram) లో జరిగిన అల్లర్లు రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. ఈ వ్యవహారంపై తీవ్రరాజకీయ దుమారం కూడా రేగింది. అధికార ప్రతిపక్షాల మధ్య నిత్యం మాటల తూటాలు పేలుతూనే ఉన్నాయి. అల్లర్ల వెనుక టీడీపీ (TDP), జనసేన (Janasena) ఉన్నాయని వైసీపీ (YSRCP) ఆరోపిస్తుంటే.. డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా వైసీపీనే తమ కార్యకర్తలతో ఇలా చేయించిందని ప్రతిపక్షాలు రివర్స్ కౌంటర్ ఇస్తున్నాయి. ప్రస్తుతం కోనసీమ అల్లర్లపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. ఇప్పటికే 46 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిలో జనసేన, బీజేపీ, టీడీపీ నేతలు కార్యకర్తలు కూడా ఉన్నారు. తమకు విధ్వంసం చేయాల్సిన అవససరం లేదని జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) స్పష్టం చేశారు. వైసీపీదే ఆ నైజమని ఆరోపించారు కూడా.

ఇదిలా ఉంటే కోనసీమ అమలాపురం అల్లర్లపై ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జనసేన అధ్యక్షుడు కందుల దుర్గేష్ సంచలన కామెంట్స్ చేశారు. అమలాపురం సంఘటనలకు సంబంధించి వైసీపీ దుర్బుద్ధి, నీచ రాజకీయాలు ప్రదర్శించిందని ఆయన ఆరోపించారు. మంత్రి, ఎమ్మెల్యేల ఇళ్లను వైసీపీ వర్గీయులే తగులబెట్టుకుని జనసేన పార్టీపై నెట్టేందుకు నేతలు ప్రయత్నిస్తున్నారని దుర్గేష్ విమర్శించారు.

ఇది చదవండి: బాబు రాష్ట్రానికి పట్టిన శని.. అమలాపురం అల్లర్లు వాళ్లిద్దరి పనే.. ఫుల్ స్వింగ్ లో కొడాలి నాని..


అలాగే మంత్రి, ఎమ్మెల్యే ఇళ్లను తగలబెడతారని పోలీసులకు ముందుగానే తెలుసని.. అందుకే విశ్వరూప్, పొన్నాడ సతీష్ ఇళ్లను ఖాళీ చేయించారంటూ హాట్ కామెంట్స్ చేశారు. ఆందోళనకారులు మంత్రి, ఎమ్మెల్యే ఇళ్లను తగులబెడతుంటే పోలీసులు ఎందుకు అడ్డుకోలేదని దుర్గేష్ ప్రశ్నించారు. మాజీ డ్రైవర్ ను ఎమ్మెల్సీ అనంతబాబు హత్య చేసిన ఘటన నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు వైసీపీ ఓ పథకం ప్రకారం ఈ విధ్వంసానికి పాల్పడిందని ఆయన అన్నారు.

ఇది చదవండి: నారా లోకేష్ సంచలన నిర్ణయం.. పార్టీ పదవికి రాజీనామా.? ఆ నేతలకు నో టికెట్..


అమలాపురం ఘటనపై సీబిఐ చే దర్యాప్తు చేయిస్తే నిజానిజాలు బయటపడతాయని.., ఈ సంఘటనతో సంబంధం లేని జనసేన నాయకులను ఇరికించాలని చూస్తే ఊరుకునేది లేదని దుర్గేష్ హెచ్చరించారు. బూతుల మంత్రి కొడాల నాని, మాటలు పలకలేని మంత్రి బొత్సా సత్యనారాయణ తెలుగు సరిగా మాట్లాడటం నేర్చుకోవాలంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. అమలావురంలో ఇంటర్నెట్ నిలిపేయడం వల్ల ఉద్యోగులు, వ్యాపారులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారన్నారు.

ఇది చదవండి: వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డికి గుండెపోటు.. ఆందోళనలో నేతలు..


అమలాపురం అల్లర్ల వెనుక అన్యం సాయి అనే వ్యక్తి పాత్ర ఉన్నట్లు ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. అతడు జనసేన కార్యకర్త అంటూ వైసీపీ నేతలు ఫోటోలు వైరల్ చేయగా.. కాదు అతడు వైసీపీ కార్యకర్త అని మంత్రి విశ్వరూప్ కు అనుచరుడిగా ఉన్నాడంటూ విశ్వరూప్ తో పాటు సజ్జల, మాజీ మంత్రి సుచరిత, ఎమ్మెల్యేలు చిర్ల జగ్గిరెడ్డి, జక్కంపూడి రాజా వంటివారితో ఉన్న ఫోటోలను జనసేన కార్యకర్తలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇప్పటికే అన్యం సాయిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అతడ్ని విచారిస్తున్నారు.

First published:

Tags: Andhra Pradesh, East Godavari Dist, Janasena party

ఉత్తమ కథలు