హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Janasena: జనసేన కొత్త స్ట్రాటజీ.. ముల్లును ముల్లుతోనే తీయాలంటున్న పవన్.. సైనికులదీ అదే మాట..

Janasena: జనసేన కొత్త స్ట్రాటజీ.. ముల్లును ముల్లుతోనే తీయాలంటున్న పవన్.. సైనికులదీ అదే మాట..

పవన్ కల్యాణ్, వైఎస్ జగన్ (ఫైల్)

పవన్ కల్యాణ్, వైఎస్ జగన్ (ఫైల్)

AP Politics: ముల్లును ముల్లుతోనే తీయాలి.. వజ్రాన్ని వజ్రంతోనే కోయాలి.. మాటకు మాటే సమాధానం. నువ్వెంత అంటే నువ్వెంత అనే స్థాయిలో మాటల యుద్ధం సాగితేనే రాజకీయం ధీటుగా ఉంటుంది. ఇప్పుడిదే ఫార్ములాను జనసేన వంటబట్టించుకుందా..?

  ముల్లును ముల్లుతోనే తీయాలి.. వజ్రాన్ని వజ్రంతోనే కోయాలి.. మాటకు మాటే సమాధానం. నువ్వెంత అంటే నువ్వెంత అనే స్థాయిలో మాటల యుద్ధం సాగితేనే రాజకీయం ధీటుగా ఉంటుంది. ఇప్పుడిదే ఫార్ములాను జనసేన (Janasena) వంటబట్టించుకుందా..? ఇప్పటివరకు ఒక లెక్క.. ఇకపై ఒకలెక్క అనే మాదిరిగా స్ట్రాటజీని మార్చిందా..? వైసీపీ మంత్రులు జనసేనపై, పార్టీ అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) పై చేస్తున్న వ్యక్తిగత, రాజకీయ పరమైన విమర్శలకు జనసైనికులు కూడా అదేరేంజ్ లో కౌంటర్లిస్తున్నారు. విధానపరమైన, రాజకీయ పరమైన అంశాల్లోనే కాదు.. వ్యక్తిగత విషయాలు లేవనెత్తితే వాళ్లు కూడా పర్సనల్ మేటర్స్ టచ్ చేస్తున్నారు. ఇన్నాళ్లు ఎన్ని విమర్శలొచ్చినా సైలెంట్ గానే ఉన్న జనసేన గేర్ మార్చడానికి కారణాలేంటనే దానిపై సర్వత్రా చర్చ జరుగుతోంది.

  ఇటివల ఏపీ మంత్రివర్గంలోకి వచ్చిన మంత్రులు వచ్చీరాగానే శాఖల గురించి పట్టించుకోకుండా పవ్కల్యాణ్ పై విమర్శలు చేయడం స్టార్ట్ చేశారు. అసలు పని వదిలేసి తమ నాయకుడ్ని తిట్టిపోస్తుండటంతో జనసైనికులకు కూడా చిర్రొత్తికొచ్చి కౌంటర్లివ్వడం మొదలుపెట్టారు. ముఖ్యంగా జలవనరుల శాఖ మంత్రి అబంటి రాంబాబు, పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్ నాథ్ పై జనసేన నేతల ఎటాకింగ్ మాములుగా లేదు. రెండు చోట్ల ఓడిపోయాడని ఎద్దేవా చేస్తున్న మంత్రులకు పవన్ అంటే ఎందుకంత భయమని జనసైనికులు ప్రశ్నిస్తున్నారు.\

  ఇది చదవండి: వైసీపీలో ముదిరిన స్వామి భక్తి.. కీలక నేత ఎదుట మోకరిల్లిన మంత్రి..


  గతంలో పవన్ కల్యాణ్ ఎక్కడ పర్యటించినా, ఎలాంటి కామెంట్స్ చేసినా గంటల్లోనే మంత్రులు రెడీ అయిపోయేవారు. పవన్ చేసిన విమర్శలకు కాకుండా.. ఆయన వ్యక్తిగత విషయాలను టచ్ చేసేవారు. ఇటీవల అనంతపురం జిల్లాలో పవన్ కౌలు రైతు భరోసా యాత్ర తర్వాత మంత్రులు చేసిన విమర్శలకు అదే రేంజ్ లో జనసేన నేతలు కౌంటర్లివ్వడం మొదలుపెట్టారు. ఇటు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో యాత్ర తర్వాత కూడా అదే విమర్శలు చేశారు. దీంతో జనసైనికులు కూడా పర్సనల్ మేటర్స్ టచ్ చేస్తున్నారు. తనను సీబీఎన్ దత్తపుత్రుడు అంటే సీఎంను సీబీఐ దత్తపుత్రుడు అనాల్సి వస్తుందని.. చంఛల్ గూడా షటిల్ టీమ్ అని పిలుస్తానంటూ గట్టిగానే కౌంటర్లిచ్చారు.

  ఇది చదవండి: చిరంజీవి ఇంటికెళ్లిన మంత్రి రోజా.. ఆచార్య రిలీజ్ రోజే మీటింగ్.. ఏం చర్చించారంటే..!


  ముల్లును ముల్లుతోనే తీయాలనే కాన్సెఫ్ట్ ను జనసేన నాయకులు ప్రస్తుతం బాగానే వంటపట్టించుకున్నారనే చెప్పాలి.గుడివాడ అమర్ నాథ్ చెత్త పుత్రుడు అని, వచ్చే ఎన్నికల్లో వైసీపీకి 15 సీట్లే వస్తాయిని, సజ్జలతో మాఫీయా పాలన చేస్తున్నారని ఒకటేంటి.. తిట్టిన తిట్టు తిట్ట కుండా తిడుతున్నారు జనసేన నేతలు. అంతేకాదు రాసలీలల స్క్రిప్ట్ రెడీగా ఉందని.. హీరోయిన్లు కూడా వాళ్లేనంటూ.. చందాలు వేసుకొని సినిమాలు తీస్తామంటూ జనసేన నేతలు వైసీపీకి ఆఫర్ ఇచ్చారు. తమ తిట్ల స్ట్రాటజీని జనసేన కూడా అనుసరించడంతో అధికారపక్షం శిబిరంలో చర్చ జరుగుతుంది అని గుసగుసలు వినిపిస్తున్నాయి.

  Published by:Purna Chandra
  First published:

  Tags: Andhra Pradesh, Janasena party, Ysrcp

  ఉత్తమ కథలు