Home /News /andhra-pradesh /

AP POLITICS JANASENA LEADERS FIRE ON MINSTER ROJA AND DEMAND FOR SORRY ON HER COMMENTS ON CAR ISSUE NGS

Minster Roja vs Janasena: రోజా 150 సినిమాల సంపాదన ఎంత..? వపన్ ఒక్క రోజు కలెక్షన్ ఎంత..

మంత్రి రోజా

మంత్రి రోజా

Minster Roja vs Janasena: ఆంధ్రప్రదేశ్ మంత్రి రోజా తన కొడుక్కి కారు కొని ఇచ్చిన వివాదం ఇంకా ముదురుతోంది. రోజా 150 సినిమా ఆదాయం ఎంత..? పవన్ కళ్యాణ్ ఒక్క రోజు కలెక్షన్లు ఎంత అంటూ కొత్త చర్చకు తెరలేపారు జనసైనికులు.. అంతేకాదు రోజా తమకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Tirupati, India
    Minster Roja vs Janasena: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో వైసీప్ (YCP) వర్సెస్ జనసేన (Janasena) ఫైట్ మరింత ముదిరింది. ముఖ్యంగా ఇటీవల మంత్రి రోజా (Minster Roja) తన కొడుక్కు బెంజ్ కారు గిఫ్ట్ ఇచ్చారు. అయితే మంత్రి అయ్యాక లంచాలు తీసుకుంటూ కారు గిప్ట్ గా ఇచ్చారనే విమర్శలు మొదలయ్యాయి. దానిపై ఘాటుగా స్పందించిన మంత్రి రోజా.. జనసేన కార్యకర్తలుపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. వారు పిల్ల బచ్చాలు అంటూ కామెంట్ చేశారు. సోషల్ మీడియా (Social Media) లో వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నేటి వరకూ  తమ ప్రభుత్వంపై దుష్ప్రచారం జరుగుతూనే ఉందన్నారు. వైసీపీ ప్రభుత్వం (YCP Government) అమలు చేస్తున్న నవరత్నాలు, ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలపై సోషల్ మీడియా వేదికగా విపరీతమైన ట్రోలింగ్ సాగుతుండడం దారుణమన్నారు. వైసీపీ‌ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు చూసి ఓర్వలేక ప్రతిపక్షం, జనసేన నాయకులే సోషల్‌ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగానే జనసేన కార్యకర్తలపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీంతో మంత్రి రోజాకు వ్యతిరేకంగా జనసేన నాయకులు ఆందోళనలకు దిగారు.

    మంత్రి రోజా తమకు తక్షణమే క్షమాపణ చెప్పాలని తిరుపతి జనసేన నాయకుడు కిరణ్ రాయల్ డిమాండ్ చేశారు. రోజా చెప్పినట్టు ఆమె కెరీర్ లో చేసిన 150 సినిమాల రెమ్యునరేషన్ ఎంతని..? ఆ మొత్తం పవన్ కల్యాణ్ మొదటి రోజు మొదటి షో ఆదాయంతో సమానం అంటూ గుర్తు చేశారు. మరి అలాంటి రోజా జనసేన కాన్వాయ్ లపై విమర్శించినప్పుడూ.. ఈ సినిమా సంపాదన గుర్తు రాలేదా అని ప్రశ్నిస్తున్నారు. రోజా వెంటనే జనసైనికులకు క్షమాపణ చెప్పాలని.. లేదంటే రోజా గుట్టురట్టు చేస్తామని హెచ్చరిస్తున్నారు.

    అప్పట్లో ఐరన్ లెగ్ అని భావించే రోజాను సినిమాల నుంచి పక్కన పెట్టారని.. మంత్రి కాకముందు నుంచే ఆమెకు జబర్దస్త్ నుంచి పక్కన పెడతారనే ప్రచారం ఉంది అన్నారు. అలాంటప్పుడు రోజా కొన్న బెంజ్ కారు అక్రమ ఆర్జనేనని వారు ఆరోపిస్తున్నారు. టూరిజం శాఖ మంత్రిగా తిరుమలకు మాత్రమే పరిమితం అయిన రోజాకు సక్రమార్జన ఎలా వస్తుందని నిలదీశారు. జన సైనికులను విమర్శిస్తే చిత్తూరు జిల్లాలో, తిరుపతిలో రోజాను తిరిగనివ్వమంటూ వార్నింగ్ ఇచ్చారు.



    మరి ఈ వివాదం ఎంత వరకు వెళ్తుందో చూడాలి. మొన్నటి వరకు వైసీపీ వర్సెస్ టీడీపీ గా ఉన్న వార్.. ఈ మధ్య వైసీపీ -జనసేనగా మారుతోంది. ఇప్పటికే అవకాశం ఉన్న ప్రతి సారి అధినేత జగన్ సహా మంత్రులు అంతా జనసేన అధినేత పవన్ పై ఆరోపనలు చేస్తూనే ఉన్నారు. చంద్రాబుకు దత్తపుత్రుడు అనే బిరుదుకూడా ఇచ్చారు. ఇప్పుడు ఆ వివాదం మరింత ముదురుతోంది. రోజా క్షమాపణలు చెప్పకపోతే.. రోజా బండారం బయటపెడతామని జనసేన సైనికులు హెచ్చరిస్తున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి.
    Published by:Nagabushan Paina
    First published:

    Tags: Andhra Pradesh, AP News, Janasena, Minister Roja, Pawan kalyan, Ycp

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు