Home /News /andhra-pradesh /

AP POLITICS JANASENA LEADERS CHALLENGE TO YCP AND CM JAGAN ON FARMERS ISSUE NGS

Janasena: వారందరికీ క్షమాపణలు చెప్పాలి.. లేదా నిరూపించాలి.. సీఎం జగన్ కు జనసేన సవాల్..

వైఎస్ జగన్ (ఫైల్)

వైఎస్ జగన్ (ఫైల్)

Janasena: ఆంధ్రప్రదేశ్ లో రాజకీయం రచ్చ రచ్చ అవుతోంది. అధికార విపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. మొన్నటి వరకు వైసీపీ వర్సెస్ అన్పట్టు ఉన్న రాజకీయం.. ఇప్పుడు వైసీపీ వర్సెస్ జనసేనగా కూడా మారుతోంది. స్వయంగా సీఎం జగన్ సైతం పవన్ పై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. అయితే సీఎం విమర్శలపై స్పందించిన జనసేన.. ఆయనకు సవాల్ విసిరింది. మరీ వైసీపీ ఆ సవాల్ ను స్వీకరిస్తుందా లేదా..?

ఇంకా చదవండి ...
  Janasena: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజకీయం రసవత్తరంగా మారింది. ప్రస్తుతం అన్ని పార్టీలు ఎన్నికల మూడ్ లోనే ఉన్నాయి. ముందస్తు తప్పదని విపక్షాలు అంచనా వేస్తున్నాయి. ప్రస్తుతం అన్ని ప్రధాన పార్టీలో జనంలోనే ఉండాలని నిర్ణయించాయి. అది కూడా ఏడాదికిపైగా జనాల్లోనే ఉండేలా వ్యూహాలు రచిస్తున్నారు. విపక్షాలు ఇంకా వ్యూహ రచనలోనే ఉంటే.. అధికార పార్టీ ఓ అడుగు ముందుకే వేసింది.. గడప గడపకు ప్రభుత్వం (Gadapa Gadapaku Government) అంటూ జనాల్లోనే ఉంది. త్వరలోనే అధినేత జగన్ సైతం.. జిల్లాల పర్యటనకు సిద్ధం అవుతున్నారు. ఇక విపక్షాల విషయానికి వస్తే చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu), నారా లోకేష్ (Nara Lokesh) ఇద్దరు త్వరలోనే జనం బాట పట్టనున్నారు. ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)  సైతం యాత్రకు సిద్ధమయ్యారు. అందుకు సంబంధించిన కాన్వాయ్ లు కూడా రెడీగా ఉన్నాయి. యాత్రల సంగతి అలా ఉంచితే ప్రస్తుతం.. జనసేనపై అధికార పార్టీ తీవ్ర విమర్శలు చేస్తోంది. పవన్ కళ్యాణ్ ను చంద్రబాబుకు దత్త పుత్రుడు అంటూ స్వయంగా సీఎం జగన్ మోహన్ రెడ్డి (CM Jagan Mohan Reddy) ఆరోపణలు చేస్తున్నారు. అయితే ఇటీవల జగన్ చేసిన విమర్శలపై జనసేన ఘాటుగా స్పందించింది.

  ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ కు జ‌న‌సేన పార్టీ స‌వాల్ విసిరింది. ఇటీవ‌ల పుట్ట‌ప‌ర్తి జిల్లాలో జ‌రిగిన స‌భ‌లో ముఖ్య‌మంత్రి మాట్లాడుతూ జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ల్యాణ్ చేస్తున్న కౌలు రైతుల భ‌రోసాయాత్ర గురించి కొన్ని కామెంట్లు చేశారు. వారు అస‌లు కౌలు రైతులే కాద‌ని జగన్ ఆరోపించారు. కేవలం చంద్ర‌బాబునాయుడి ద‌త్త‌పుత్రుడు ఆడుతున్న డ్రామాలు అవి అంటూ జనగ్ తీవ్ర విమర్శలు చేశారు.

  ఇదీ చదవండి : ఆనందంతో పాటు ఆహ్లాదం.. వైజాగ్ లో 2వేల ఏళ్ల నాటి బౌద్ధ క్షేత్రం తొట్లకొండ.. ఇంకా ఎన్నో ప్రత్యేకతలు

  జ‌గ‌న్ వ్యాఖ్య‌ల‌కు జ‌న‌సేన రాజ‌కీయ వ్య‌వ‌హారాల క‌మిటీ చైర్మ‌న్ నాదెండ్ల మ‌నోహ‌ర్ స్పందించారు. వారు రైతులే కాదంటూ మాట్లాడి జ‌గ‌న్ కౌలు రైతుల కుటుంబాల‌ను అవ‌మానించారంటూ మండిపడ్డారు. ప్రభుత్వం నుంచి ఎవరైనా త‌మ‌తో వ‌స్తే ప‌వ‌న్ ప‌రామ‌ర్శిస్తున్న‌వారంద‌రినీ చూపిస్తామ‌ని, వారు కౌలు రైతులో కాదో మీరే చూసుకోవాలంటూ స‌వాల్ విసిరారు. అధికారంలో ఉండి కూడా నిజం తెలియ‌కుండా మాట్లాడి కౌలు రైతుల కుటుంబ‌స‌భ్యుల‌ను క్షోభ‌కు గురిచేసినందుకు వారికి క్ష‌మాప‌ణ చెప్పాలంటూ డిమాండ్ చేశారు.

  ఇదీ చదవండి : కోనసీమ అల్లర్ల కేసులో ఆగని దుమారం.. ఏ పార్టీపై ఎన్ని కేసులంటే..?

  ప్రస్తుతం జ‌న‌సేనాని ప‌వ‌న్‌క‌ల్యాణ్ రాష్ట్ర‌వ్యాప్తంగా ప‌ర్య‌టిస్తున్నారు. కౌలు రైతుల భ‌రోసా యాత్ర పేరుతో ఆత్మ‌హ‌త్య చేసుకున్న కౌలు రైతుల కుటుంబ స‌భ్యుల‌ను క‌లిసి ప‌రామ‌ర్శిస్తున్నారు. జ‌న‌సేన త‌ర‌ఫున ల‌క్ష రూపాయ‌ల‌ను ప‌రిహారంగా ఇస్తున్నారు. ఇటీవ‌లే మెగాస్టార్ చిరంజీవి, నాగ‌బాబు, చిరంజీవి సోద‌రి.. ఇలా వారి కుటుంబ స‌భ్య‌లుంతా క‌లిసి 35 ల‌క్ష‌ల‌ను జ‌న‌సేన‌కు విరాళంగా ఇచ్చారు కూడా. ఆత్మ‌హ‌త్య చేసుకున్న కౌలు రైతుల కుటుంబ స‌భ్యుల‌కు ఇవ్వాల‌ని కోరారు. చెక్కును కూడా చిరంజీవి సోద‌రి మ‌నో్హ‌ర్‌కు అంద‌జేశారు.
  కౌలు రైతుల భ‌రోసా యాత్ర‌తోపాటు దానికి స‌మాంత‌రంగా ప‌వ‌న్‌క‌ల్యాణ్ అక్టోబ‌రు 5వ తేదీ నుంచి రాష్ట్ర‌వ్యాప్తంగా ప‌ర్య‌టించ‌బోతున్నారు. 175 నియోజ‌క‌వ‌ర్గాల‌ను చుట్టివ‌చ్చేలా ప్ర‌ణాళిక ర‌చించుకున్నారు.
  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Andhra Pradesh, Ap cm jagan, AP News, Janasena, Pawan kalyan

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు