AP POLITICS JANASENA LEADER NAGABABU SATIRES ON YCP LEADERS WHO SHED TEARS FOR MINISTERIAL POSTS SNR
Nagababu: మీరేడుస్తుంటే బాధేస్తోంది..వైసీపీ నేతలపై సినీ నటుడు సెటైర్లు
(అబ్బా ఏడవకండి బాబోయ్)
Nagababu:వైసీపీ నేతలపై జనసేన నేత, నటుడు నాగబాబు సెటైర్లు వేశారు. మంత్రి పదవుల కోసం కన్నీరు కార్చిన వాళ్లను చూస్తే తనకు బాధ వేసిందన్నారు నాగబాబు. ఎవరి కోసం వాళ్లు అంతలా ఫీలయ్యారో అర్ధం కాలేదని..కనీసం ప్రజల బాధలపై కన్నీరుపెట్టుకున్నా బాగుండేదని చురకలంటించారు.
ఏపీ రాజకీయాల్లో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ పరిణామాలపై జనసేన(janasena)నేత, సినీ నటుడు నాగబాబు కొణిదెల(nagababu) డిఫరెంట్గా స్పందించారు. ముఖ్యంగా మంత్రి పదవులు ఆశించి రాని వాళ్లు, మంత్రులుగా పనిచేసి ఇప్పుడు మాజీలు అయిన వాళ్లంతా ఆవేదన చెందడం, కన్నీరుపెట్టుకోవడం, ఫ్రస్టేషన్కి గురవడం చూస్తుంటే తనకు అయ్యో పాపం అనిపించిందంటూ నాగబాబు ట్వీట్(Tweet)చేశారు. అంతటితో సరిపెట్టకుండా ..వైసీపీ నేతలపై తనదైన స్టైల్లో సెటైర్లు(Satires)వేశారు. వైసీపీ మంత్రులకు నా మనవి అని మొదలుపెట్టిన నాగబాబు..వైసీపీ(Ycp)లో మంత్రి పదవులు ఆశించి భంగపడ్డవాళ్లు, నిన్నటి వరకు మంత్రులు(Ministers)గా కొనసాగి పదవులు పోగొట్టుకున్న వాళ్లంతా కన్నీరుపెట్టుకోవడం, కుమిలిపోవడం, ఫ్రస్టేషన్(Frustration)కి గురి కావడం తనను ఎంతగానో బాధించాయని చురకలంటించారు. పదవుల కోసం బాధపడిన నేతలంతా ప్రజల సమస్యలపైన పశ్చాత్తాపం చూపించి ఉంటే బాగుండేదని ట్వీట్ ద్వారా వైసీపీలో మాజీ మంత్రులను ఓదార్చుతూనే గిల్లారు నాగబాబు.
మీ ఏడుపులో ఏమైనా అర్ధం ఉందా..
నాగబాబు వైసీపీ మంత్రులపై చురకలు వేయడమే కాదు..మీరు ఫీలవడం వల్ల ఎవరికి ఉపయోగం అనే తన మనసులో మాటను ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. నిజంగా పదవుల కోసం కన్నీరు కార్చిన వాళ్లంతా కౌలు రైతుల ఆత్మహత్యలు, చేతి వృత్తుల వాళ్లు చనిపోతే..లేదంటే ఉద్యోగాలు రాని యువత కోసమే బాధపడి ఉంటే బాగుండేదన్నారు నాగబాబు. అలా కాకపోతే రాజధాని ప్రాంత ప్రజల కడుపు మంట, ఉద్యోగుల బాధలు, మౌళిక సదుపాయాల్లేక బాధపడుతున్న ఆంధ్రరాష్ట్ర ప్రజల గురించి మీరు కన్నీరు కార్చినా.. ప్రష్టేషన్కి గురైన బాగుంటుందని వైసీపీ నేతలను విమర్శించారు నాగబాబు.
అందుకు ఏడిస్తే బెటర్..
పదవుల కోసమే అంతలా ఫీలవ్వాల్సి వస్తే..మీరు ప్రజల పడుతున్న బాధలు, వాళ్లు ఎదుర్కొంటున్న సమస్యలపై చలిస్తే బాగుంటుందన్నారు నాగబాబు. తన ట్వీట్ ద్వారా ఈ విషయాన్ని చెప్పకనే చెప్పారు. మీరు కన్నీరు కార్చడం, బాధపడటంలో వృధా అని..అందులో ఎలాంటి ప్రయోజనం లేదని వైసీపీ నేతలపై తనదైన స్టైల్లో వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అయితే పదవుల కోసం కన్నీరు కార్చిన వారిపై ఇలా స్పందిస్తే...కొత్తగా మంత్రి పదవులు చేపట్టిన వాళ్లు ప్రమాణస్వీకారం సమయంలో సీఎం పట్ల చూపించిన అతి మర్యాదపై ఎలా స్పందిస్తారో చూడాలి. ఇవాళ కొత్త మంత్రివర్గం ప్రమాణం చేసిన 11 మంది పాత మంత్రులతో పాటు 25 మంది ప్రమాణ స్వీకారం చేశారు. వీళ్లపై ఎలా స్పందిస్తారో చూడాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.