Konidela Nagababu Comments: సీఎం జగన్ ఆదేశిస్తే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై కూడా పోటీకి సిద్ధమని ఇటీవల సినీ నటుడు అలీ చేసిన వ్యాఖ్యలపై నాగబాబు (Konidela Nagababu) రియాక్ట్ అయ్యారు. మీడియా అడిగిన ఈ ప్రశ్నకు నాగబాబు నో కామెంట్స్ చెబుతూనే వైసీపీపై తీవ్ర విమర్శలు చేశారు. వైసీపీలా తాము దిగజారి మాట్లాడం. అరాచకం, దుర్మార్గం, దౌర్జన్యం కలిస్తే వైసీపీ అంటూ నాగబాబు ఫైర్ అయ్యారు. గత 4 ఏళ్లలో ఏపీలో పాలన చెత్తగా ఉంది. ఈ నాలుగేళ్లు కూడా రాష్ట్రంలో రౌడీయిజం, గంజాయి రాజ్యాంగా మారింది. రాష్ట్రంలో ముందుకెలా వెళ్లాలనే దానిపై జనసైనికులతో మాట్లాడానని నాగబాబు (Konidela Nagababu) అన్నారు. కర్నూల్ పర్యటనలో ఉన్న జనసేన PAC సభ్యుడు నాగబాబు (Konidela Nagababu) ఈ వ్యాఖ్యలు చేశారు.
పవన్ ను సీఎం చేయడమే మా లక్ష్యం..పొత్తులపై నాగబాబు సమాధానం
పవన్ కళ్యాణ్ ను సీఎం చేయడమే లక్ష్యం అని చెప్పిన నాగబాబు (Konidela Nagababu) పొత్తులపై కీలక వ్యాఖ్యలు చేశారు. పొత్తులపై పార్టీ అధినేత నిర్ణయం తీసుకుంటాడు. పొత్తులపై క్లారిటీ రాకుండా పోటీ చేయబోయే స్థానాలపై మాట్లాడడం సరికాదన్నారు. ఇక ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలి చీల్చబోనని పవన్ పదే పదే చెబుతున్నాడంటే దాని వెనక ఏదో ఒక వ్యూహం ఉంటుందని నాగబాబు (Konidela Nagababu) వ్యాఖ్యానించారు. వచ్చే ఎన్నికల్లో పొత్తు లేకుంటే జనసేన అన్ని స్థానాల్లో పోటీ చేస్తుందని అన్నారు.
నేను పోటీ చేయను..
అయితే వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయబోనని నాగబాబు షాకింగ్ కామెంట్స్ చేశారు. పార్టీ బలోపేతం కోసం కృషి చేస్తానని తెలిపారు. 2009లో జనసేనకు 7 శాతం, 2014లో 24 శాతం ఓట్లు వచ్చాయి. ఇక రాబోయే ఎన్నికల్లో 40 శాతం ఓట్లు వచ్చే అవకాశం ఉందని నాగబాబు వ్యాఖ్యానించారు.
కాగా ఇటీవల పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) పై పోటీకి సిద్ధమని నటుడు అలీ (Actor Ali) సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. పవన్ నాకు మంచి మిత్రుడు. కానీ సినిమాలు వేరు. రాజకీయాలు వేరు. రాష్ట్రానికి ఎవరు ఏం చేశారనేది అందరికీ తెలుసు. సీఎం ఆదేశిస్తే ఎవరిపైనైనా కూడా పోటీ చేస్తానన్నారు. విమర్శలకు ప్రతి విమర్శలు చేయడం సాధారణమన్నారు. 2024లో వైసీపీ 175కి 175 స్థానాల్లో విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కాగా అలీని ఇటీవల ఏపీ ప్రభుత్వం ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారునిగా నియమించిన విషయం తెలిసిందే.
ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)తో అలీ అనేక సినిమాలు చేశాడు. అయితే రాజకీయంగా చోటు చేసుకున్న పరిణామాలతో ప్రస్తుతం అలీ (Actor Ali) చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Ali, Andhrapradesh, Ap, AP News, Mega brother nagababu, Pawan kalyan