Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజకీయాల్లో ఇప్పటం హైలైట్ అవుతోంది. ఇటీవల కోర్టు తీర్పుతో వైసీపీ (YCP), జనసేన (Jansena) మధ్య వార్ మొదలైంది.. కోర్టును తప్పుదోవ పట్టించారనే అభిప్రాయంతో.. ఇప్పటం పిటిషినర్లకు చెరో లక్ష జరిమానా విధించింది కోర్టు.. ముందుగానే అధికారులు నోటీసులు ఇచ్చారని చెప్పినా.. ఇవ్వలేదు అని కోర్టు (Court) ను తప్పుదోవ పట్టించడాన్ని నేరంగా పరిగణించింది. అయితే ప్రస్తుతం వారు సుప్రీం (Supreme) ను ఆశ్రయించారు. ఆ తీర్పు ఎలా వచ్చినా.. జనసేన (Janasena) తీరుపై అధికార పార్టీ నేతలు తివ్రస్థాయిలో మండిపడుతున్నారు.. కోర్టు తీర్పుతో పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) డ్రామాలు బయటపడ్డాయి అంటున్నారు. ఇప్పటికైనా పవన్ ఇలాంటి వేషాలు మానేసి.. వాస్తవాలు మాట్లాడాలి అన్నారు. అయితే విమర్శలు ఎలా ఉన్నా.. పవన్ మాత్రం.. ముందు చెప్పినట్లుగానే నేడు ఇప్పటం పర్యటనకు వెళ్తున్నారు. ముందు హామీ ఇచ్చినట్టే బాధితులకు ఆర్థికసాయం అందించనున్నారు. కూల్చివేతలతో నష్టపోయిన ప్రతి ఇంటికి లక్ష చొప్పున ఆర్థిక సాయం అందించనున్నారు.
గుంటూరు జిల్లా (Guntur District) ఇప్పటం గ్రామస్తులకు జనసేనాని పవన్ కల్యాణ్ అండగా నిలిచారు. కూల్చివేతలతో నష్టపోయిన ప్రతి ఇంటికి లక్ష రూపాయల ఆర్థికసాయం ప్రకటించారు. ఇచ్చిన హామీలో భాగంగా.. కోర్టు తీర్పుతో సంబందం లేకుండా.. బాధితులకు అన్యాయం జరిగింది అనే ఉద్దేశంలో ఉన్నారు జనసేనాని పవన్ అందుకే.. నేడు బాధితులకు పవన్ ఆర్థికసాయం అందించనున్నారు.
ఆదివారం ఇప్పటం చేరుకుని గ్రామస్తులకు ఆర్థిక సాయం అందించనున్నారు. రోడ్డు విస్తరణలో ఇళ్లు కోల్పోయిన బాధితులకు మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో చెక్కులను అందిస్తారు. కూల్చివేతలతో నష్టపోయిన ప్రతీ ఇంటికి లక్ష రూపాయల చొప్పున బాధితులకు సాయం అందిస్తామని గతంలోనే పవన్ ప్రకటించారు. దీనికి సంబంధించి జనసేన పార్టీ ఓ ప్రకటన విడుదల చేసింది. ”జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలకు వేదికగా నిలిచిన గ్రామం ఇప్పటం. ఇప్పటం గ్రామ రైతులు జనసేన సభ ప్రాంగణం కోసం తమ పొలాలను ఇచ్చారు. అయితే, రహదారి విస్తరణ పేరుతో ఇప్పటం గ్రామంలో కొన్ని ఇళ్లను కూల్చారు. ఆ సమయంలో గ్రామస్తులను కలుసుకున్న పవన్ వారి బాధలు విని చలించిపోయారు. కూల్చివేతలతో నష్టపోయిన ప్రతి ఇంటికీ లక్ష రూపాయల ఆర్థికసాయాన్ని ప్రకటించారు.
ఇదీ చదవండి : సీఎం జగన్ కు మద్దతుగా తిరుమల టు శ్రీశైలం పాదయాత్ర.. 30 ఏళ్లు తమదే అధికారమన్న మంత్రి రోజా
అయితే ఈ పర్యటన తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసే అవకాశాలు కనిపిస్తున్నాయి. తాజా కోర్టు తీర్పు నేపథ్యంలో.. పవన్ డ్రామాలు చేస్తున్నారని.. వైసీపీ శ్రేణులు.. ఈ పర్యటనను అడ్డుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయి. వారికి ధీటుగా ఆందోళనలు చేయాలని ఇటు జనసైనికులు డిసైడ్ అయ్యారు. దీంతో నేడు ఇప్పటంలో ఏం జరుగుతుంది అనే టెన్షన్ నెలకొంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP News, Janasena, Pawan kalyan