హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Pawan Kalyan: పవన్ యాత్రకు ప్రచార రథం సిద్ధం.. చుట్టూ నిఘా నేత్రం.. ఇంకా ఎన్నో ప్రత్యేకతలు.

Pawan Kalyan: పవన్ యాత్రకు ప్రచార రథం సిద్ధం.. చుట్టూ నిఘా నేత్రం.. ఇంకా ఎన్నో ప్రత్యేకతలు.

పవన్ యాత్రకు స్వరం సిద్ధం

పవన్ యాత్రకు స్వరం సిద్ధం

Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలకు ఏడాదిన్నరే సమయం ఉంది. అయితే అంతకన్నా ముందే ఎన్నికలు వస్తే ఆశ్చర్యపోనక్కర్లేదు. దీంతో అన్ని పార్టీలు ఎన్నికల హీట్ లోకి వెళ్లాయి. ప్రచారానికి సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే లోకేష్ తన పాద యాత్ర డేట్ ను ప్రకటిస్తే.. ఇటు జనసేన అధినేత ప్రచార రథం కూడా సిద్ధమైంది..ఈ రథం ప్రత్యేకతలు ఎన్నో తెలుసా..?

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Guntur, India

Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో ఎన్నికల సమరశంఖం మోగింది. స్వయంగా సీఎం జగన్ మోహన్ రెడ్డే (CM Jagan Mohan Reddy) ఎన్నికలకు మరో 18 నెలలే సమయం ఉందని క్లారిటీ ఇచ్చారు. ఎన్నికలు ఎప్పుడన్నదానిపై క్లారిటీ ఇచ్చేశారు. అయితే అంతకన్నా ముందే ఎన్నికలు ఉండొచ్చని విపక్షాలు అంచనా వేస్తున్నాయి.. ఎలా చూసుకున్న ఎన్నికలకు ఏడాది నుంచి ఏడాదిన్నర మాత్రమే సమయం ఉంది. దీంతో అన్ని ప్రధాన పార్టీలు ఎన్నికలకు సిద్ధమయ్యాయి. సో సమయం లేదు మిత్రమా అంటూ అన్ని పార్టీలు కథన రంగంలోకి దిగేందుకు సై అంటున్నాయి.

టీడీపీ నేత నారా లోకేష్  (Nara Lokesh) ఇప్పటికే తాను పాద యాత్ర చేస్తున్న్టట్టు ప్రకటించారు. జనవరి 27 నుంచి 400 రోజుల పాటు.. 4 వేల కిలోమీటర్ల మేర తన పాదయాత్ర ఉంటుందని ప్రకటించారు. ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) సైతం యాత్రకు సై అంటున్నారు. దీంతో ఈ యాత్రలో పవన్ కల్యాణ్ ఇదే వ్యాన్‌ను ఉపయోగించనున్నారు.

శరవేగంగా జనసేనాని పవన్ ప్రచార రథం రెడీ అయ్యింది. ఈ ప్రచార రథంలోనే జనసేన అధినేత పవన్ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించనున్నారు. ఇందులోనే ఎన్నికల ప్రచారం కూడా నిర్వహించనున్నారు. యాత్రలో పవన్ కల్యాణ్ ఇదే వ్యాన్‌ను ఉపయోగించనున్నారు. సేనాని ప్రచార యాత్ర కోసం ఈ ప్రత్యేక వాహనాన్ని సిద్ధం చేసింది జనసేన. ఈ రథం మీదుగానే జనసేనాని ఎన్నికల సమరశంఖం మోగిచనున్నారు. జనంలోకి వెళ్లేందుకు జనసేనాని పవన్ కల్యాణ్ చేపట్టబోయే.. వ్యాన్ మరికొన్నిరోజుల్లో ప్రారంభం కానుంది. ఈ యాత్రలో పవన్ కల్యాణ్ వినియోగించే వాహనాన్ని ప్రత్యేకంగా రూపొందించారు. ప్రస్తుతం ఈ వాహనం పనులు ముగిశాయి.

ఇదీ చదవండి : డ్యాన్స్ లతో దుమ్మురేపుతున్న రోజా.. జగనన్న పాటలకు మాస్ డ్యాన్స్ లు.. మీరూ చూడండి

అత్యాధినిక టెక్నాలజీతో.. మెరుగైన హంగులతో ఈ వాహనాన్ని రూపొందించారు. అయతే ఎప్పటికప్పుడు పవన్ కల్యాణ్ స్వయంగా దీనిని పరిశీలిస్తూ వచ్చారు. ముందుగా ఈ వాహనాన్ని పుణెలో రెడీ చేద్దామని అనుకున్నారు పార్టీ నేతలు. కానీ పవన్ సూచనలతో హైదరాబాద్‌లోనే సిద్ధం చేశారు. ఇక్కడే వాహనాలు రెడీ అవుతుండడంతో పవన్ ఎప్పటికప్పుడు స్వయంగా వెళ్లి వాటిని పరిశీలిస్తూ వచ్చారు. అంతేకాదు ఆయనే కొన్ని సూచనలు చేశారు. ఆ సూచనల ప్రకారమే ప్రచార రథం సంసిద్ధం చేసింది పార్టీ క్యాడెర్. సినిమా క్యారీ వ్యాన్‌లా కాకుండా.. ప్యూర్ పొలిటికల్ మోడల్‌తో ప్రచార రథం సిద్ధం చేశారు.

ఇదీ చదవండి: ఓడించడానికి జగన్ అన్ని అస్త్రాలు ఉపయోగిస్తున్నారు.. లోకేష్ సంచలన వ్యాఖ్యలు.. పాదయాత్రపై క్లారిటీ

అయితే ఇది గతంలో.. తెలుగు రాజకీయాల్లో ప్రభంజనం సృష్టించిన ఎన్టీఆర్ ఉపయోగించిన చైతన్య రథం తరహాలో ఉండటం విశేషం. ఈ వాహనానికి ఎన్నో ప్రత్యేకతలు కూడా ఉన్నాయి. ఇందులో కనీసం ఆరుగురు కూర్చుని చర్చించుకునేలా కన్వెట్టబుల్ సిట్టింగ్ రూమ్ ఒకటి ఉంది. సమావేశాలకు అభిమానులు భారీగా వచ్చే అవకాశం ఉండడంతో.. నిఘా నేత్రం మధ్య వాహనం ఉంటుంది. దానికోసం ప్రత్యేకంగా వాహనం చుట్టూ.. చాలా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఈ వాహనంను 360 డిగ్రీలతో ఎప్పటికప్పుడు పరిశీలించేలా కెమెరాలు ఉన్నాయి. అలాగే వాహనం బాడీకి రెండు వైపులా సెక్యూరిటీ గార్డులు నిలబడే విధంగా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

First published:

Tags: Andhra Pradesh, AP News, Janasena, Pawan kalyan

ఉత్తమ కథలు