హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Pawan wishes to Jagan: సీఎం జగన్ కు పవన్ కల్యాణ్ విషెస్.. పవర్ స్టార్ ఏమన్నారంటే..!

Pawan wishes to Jagan: సీఎం జగన్ కు పవన్ కల్యాణ్ విషెస్.. పవర్ స్టార్ ఏమన్నారంటే..!

CM Jagan Birthday: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) పుట్టినరోజు వేడుకలు రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. సీఎం జగన్ పుట్టిన రోజును పురస్కరించుకుని సోషల్ మీడియా సైతం మారు మోగుతోంది.

ఇంకా చదవండి ...

  AP CM Jagan Birthday: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) సీఎం జగన్ (YS Jagan Mohan Reddy) పుట్టినరోజు వేడుకలు రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. సీఎం జగన్ పుట్టిన రోజును పురస్కరించుకుని సోషల్ మీడియా సైతం మారు మోగుతోంది. అభిమానులు, కార్యకర్తలు అయితే రెండు రోజుల నుంచి టీట్లతో ట్రెండింగ్ చేస్తున్నారు. ట్విట్టర్‌లో #HBDManOfMassesYSJagan హ్యాష్ ట్యాగ్‌తో విషెస్ మోత మోగిస్తున్నారు. తమ ప్రియతమ నేత పుట్టినరోజు సందర్భంగా సేవా కార్యక్రమాలు చేపట్టారు. ఇటు పలువురు ప్రముఖులు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, వైఎస్సార్‌సీపీ నేతలు, అభిమానులు శుభాకాంక్షలు చెబుతున్నారు. ఇదిలా ఉంటే జగన్ కు జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా శుభాకాంక్షలు తెలిపారు.

  అందరికంటే ఆలస్యంగా సోషల్ మీడియా ద్వారా పవన్ కల్యాణ్ కూడా సీఎం జగన్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. మీకు సంపూర్ణ ఆయురారోగ్యాలను భగవంతుడు ప్రసాదించాలని మనసారా కోరుకుంటున్నాను.. అని పవన్ తన ఫేస్ బుక్ పేజీలో పోస్ట్ చేశారు.

  అంతకుముందు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (pm narendra modi) సైతం ట్వీట్టర్ ద్వారా సీఎం జగన్‌కు బర్త్‌డే విషెస్‌ తెలిపారు. జీవితాంతం సుఖ సంతోషాలు, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ఈ మేరకు ప్రధాని ట్వీట్‌ చేశారు.

  టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి (Megastar chiranjeevi) కూడా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు చిరంజీవి ట్విట్ చేశారు.

  సీఎం జగన్ పుట్టిన రోజు సందర్భంగా ఆయన జీవితం, రాజకీయ ప్రస్థానానికి సంబంధించిన ఫోటో ఎగ్జిబిషన్ ను సజ్జల ప్రారంభించారు. రక్తదానం, వస్త్రాల పంపిణీ వంటి పలు స్వచ్ఛంద సేవా కార్యక్రమాలు పార్టీ శ్రేణులు చేపట్టారు. అన్ని మతాల మత పెద్దలు ప్రార్ధనలు చేశారు.

  ఇదిలా ఉంటే సీఎం నివాసంలో ఘనంగా జన్మదిన వేడుకలు నిర్వహించారు మంత్రులు.. ఇతర పార్టీ కీలక నేతలు. తన పుట్టిన రోజును పురస్కరించుకొని మంత్రులు, ఎంపీలతో కలిసి ముఖ్యమంత్రి జగన్ కేక్‌ కట్‌ చేశారు. అంతకుముందు వేద పండితులు ఆయన్ను వేధమంత్రాలతో ఆశీర్వదించారు. ఈ సందర్భంగా శ్రీవారి ప్రసాదాన్ని అందిస్తూ ఆయన్ను నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో చల్లగా ఉండాలని దీవించారు. ఆ తర్వాత మంత్రులు, ఎంపీలు, సీఎస్‌, ఇతర అధికారులతో కలిసి ముఖ్యమంత్రి జగన్‌ కేక్‌ కట్‌ చేశారు. ఈ సందర్భంగా వారంతా సీఎంకు బర్త్‌ డే విషెస్‌ చెప్పారు. కేవలం తాడేపల్లిలోనూ కాదు రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ కార్యాలయాల్లో ఘనంగా వేడుకలు జరుగుతున్నాయి.. నేతలంతా సీఎం కు బర్త్ డే విసెష్ చెప్పడంలో పోటీ పడుతున్నారు. కొందరు తమ అభిమానాన్ని చాటుకుంటూ వినూత్నంగా శుభాకాంక్షలు చెప్పారు.

  First published:

  Tags: Andhra Pradesh, Ap cm ys jagan mohan reddy, Pawan kalyan

  ఉత్తమ కథలు