హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Pawan Tour: రేపటి నుంచి అన్నదాతలకు అండగా పవన్.. అనంతపురం జిల్లా రైతులకు ఆర్థికంగా చేయూత

Pawan Tour: రేపటి నుంచి అన్నదాతలకు అండగా పవన్.. అనంతపురం జిల్లా రైతులకు ఆర్థికంగా చేయూత

పవన్ కల్యాణ్ (ఫైర్)

పవన్ కల్యాణ్ (ఫైర్)

Pawan Tour: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మళ్లీ రాజకీయాల్లో యాక్టివ్ గా అవుతున్నారు. ఇకపై ఎదో ఒక రూపంలో జనాల్లో ఉండాలని నిర్ణయించారు. ముఖ్యంగా రైతులకు చేరువు అవ్వనున్నారు. ఇందులో భాగంగా రేపు అనంతపురం జిల్లాలో పర్యటించనున్నారు. అన్నదాతలకు ఆర్థిక సాయం చేయనున్నారు.

ఇంకా చదవండి ...

Pawan Tour: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో ఎన్నికల వాతావరణం కనిపిస్తోంది. ఇప్పటికే అన్ని పార్టీలు తమ వ్యూహాలను సిద్ధం చేస్తున్నాయి. నిత్యం ప్రజల్లో ఉండేలా ప్లాన్ లు వేస్తున్నాయి. ఓ వైపు అధికార వైసీపీ (YCP) మంత్రి వర్గ విస్తరణతో ఎన్నికల టీంను రెడీ చేసింది. ఇక తాజా మాజీలకు.. జిల్లాల బాధ్యతలను అప్పగించే ప్రయత్నం చేస్తున్నారు. దీనికి తోడు అధినేత సీఎం జగన్ (CM Jagan) సైతం ఇకపై పార్టీపై ఫోకస్ చేయనున్నారు. అటు టీడీపీ (TDP) సైతం.. పొత్తులపై వ్యూహాలు సిద్ధం చేస్తూ.. ఇకపై ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని నిర్ణయించింది. ఇటు పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu).. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (Nara Lokesh) సైతం ఇక ప్రజల్లోకి వెళ్లాలని నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) సైతం ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధమయ్యారు. రేపటి నుంచి ఆయన దీనికి శ్రీకారం చుడుతున్నారు. అనంతపురం జిల్లా (Anantapuram District)లో ఆయన పర్యటించనున్నారు. ఆ జిల్లాల్లో ఆత్మహత్యలు చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలను కలిసి.. ఆర్ధిక సాయం అందించి వారిలో ధైర్యం నింపడానికి తలపెట్టిన కౌలు రైతుల భరోసా యాత్రను ఆయన ప్రారంభించనున్నారు.

మంగళవారం ఉదయం 9 గంటలకు పుట్టపర్తి విమానాశ్రయానికి చేరుకుంటారు పవన్.. అక్కడి నుంచి మండల కేంద్రమైన కొత్తచెరువు గ్రామానికి చేరుకుంటారు. అక్కడ ఆత్మహత్య చేసుకున్నకౌలు రైతు కుటుంబాన్ని పరామర్శించి ఆర్ధిక సాయం చేస్తారు. ఉదయం 10:30 గంటలకు కొత్త చెరువు నుంచి బయలుదేరి ధర్మవరంలో మరో బాధిత రైతు కుటుంబాన్ని పరామర్శించి ఆర్ధిక సహాయం అందిస్తారు. ఉదయం 11:20 నిమిషాలకు ధర్మవరం నుంచి బయలుదేరి ధర్మవరం రూరల్ లోని గొట్లూరు గ్రామానికి చేరుకుంటారు. అక్కడ ఆత్మహత్య చేసుకున్న మరో రైతు కుటుంబాన్ని పరామర్శించి వారిలో ధైర్యాన్ని నింపి ఆర్ధిక సాయం చేస్తారు.

ఇదీ చదవండి: నిమ్మకాయ కంటే యాపిల్ బెటరా..? కన్నీరు పెడుతున్న టమాటో రైతులు.. ఎందుకో తెలుసా..?

విరామం తీసుకున్న తరువాత మధ్యాహ్నం 12: 10 నిమిషాలకు బయలుదేరి అనంతపురం రూరల్ మండలంలోని పూలకుంట గ్రామానికి చేరుకుంటారు. ఆ గ్రామంలో సుమారుగా 20 రోజుల క్రితం ఆత్మహత్యకు పాల్పడిన యువ రైతు కుటుంబాన్ని ఓదార్చి వారికి ఆర్ధిక సహాయం అందచేస్తారు. చివరిగా 3 గంటలకు అనంతపురం రూరల్ మండలంలోని మన్నీల గ్రామం చేరుకుంటారు. ఆ గ్రామంలో ఆత్మహత్యకు పాల్పడిన ఇద్దరు కౌలు రైతుల కుటుంబాలకు ఆర్ధిక సహాయం అందచేసి అక్కడ నిర్వహించే రచ్చబండ కార్యక్రమంలో పాల్గొంటారు.


ఇదీ చదవండి: ఏపీలో ఘోర రైలు ప్రమాదం.. ఐదుగురు మృతి... ఘటనకు కారణం అదే

గ్రామ సభ తరువాత హైదరాబాద్ కు తిరిగి పవన్ రిటన్ అవుతారు.  మరోవైపు  రాష్ట్రంలోని కౌలు రైతులను వైసీపీ సర్కారు పట్టించుకోవడం లేదని జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ మండిపడ్డారు. కౌలు రైతుల ఆత్మహత్యలపై మూడేళ్ల క్రితం చట్టం చేసిన ప్రభుత్వం.. అమలు చేయడంలో విఫలమైందని ఆరోపించారు.

First published:

Tags: Anantapuram, Andhra Pradesh, AP News, Pawan kalyan

ఉత్తమ కథలు