Home /News /andhra-pradesh /

AP POLITICS JANASENA CHIEF PAWAN KALYAN WILL FIGHT FOR GLASS COMMON SYMBOL FOR NEXT ELECTIONS IS IT POSSIBLE NGS

Janasena: పొత్తుల సంగతి ఓకే.. గ్లాసు గుర్తు మాటేంటి.? కామన్ సింబల్ పోరాటం ఫలించేనా..?

పవన్ కల్యాణ్

పవన్ కల్యాణ్

Janasena: ప్రస్తుతం ఏపీలో జనసేన ఎలాంటి స్టెప్ తీసుకుటుంది అన్నదానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. టీడీపీతో పొత్తు పెట్టుకుని వచ్చే ఎన్నికలకు వెళ్తుందా..? బీజేపీతో కలిసే ఉంటుందా.. లేకా ఆ రెండు పార్టీలను కలుపుకుని.. మూడు పార్టీలు కలిసి బరిలో దిగుతాయా..? ఈ చర్చే ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. అయితే అంతకంటే ముందు జనసేన గుర్తు సంగతి ఏంటనే ప్రశ్న ఎదురవుతోంది.

ఇంకా చదవండి ...
  Janasena:   ఆంధ్రప్రదేశ్  (Andhra Pradesh)  రాజకీయాల్లో ప్రస్తుత జనసేన హాట్ టాపిక్ అయ్యింది. ఎప్పుడైతే  తెలుగు దేశం  (Telugu Desam)  పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) పొత్తుల ప్రస్తావన తెచ్చారో అప్పటి నుంచి అందరి చూపు జనసేన  (Janasena) పైనే పడింది.  అధినేత పవన్ కళ్యాణ్ (Pawa kalyan) వ్యాఖ్యలు సైతం ప్రస్తుతం బీజేపీ (BJP)-  టీడీపీ (TDP) ల ముందు మూడు ఆప్షన్లు పెట్టారు.  ఇక తేల్చుకోవాల్సింది ఆ రెండు పార్టీలు మాత్రమే..  పొత్తుల సంగతి ఎలా ఉన్నా.. ఆ లెక్కలు తరువాత తేల్చుకోవచ్చు.. ముందు జనం బాట పట్టడం మంచిదని అధినేత పవన్ నిర్ణయానికి వచ్చారు. సుమారు ఆరు నెలల పాటు ఏపీ వ్యాప్తంగా బస్సు యాత్రకు సిద్దమయ్యారు. దసరా నుంచి తన యాత్ర ప్రారంభించనున్నారు. ప్రతీ జిల్లా కవర్ అయ్యేలా షెడ్యూల్ సిద్దం చేస్తున్నారు. ఇదే సమయంలో ఈ సారి ఎన్నికల్లో కింగ్ లేదా కింగ్ మేకర్ గా జనసేన నిలుస్తుందని పార్టీ నేతలు అంచనా వేస్తున్నారు.

  భారీ అంచనాలతో వచ్చే ఎన్నిక లకు సిద్దం అవుతున్న జనసేనకు కీలక సమస్య ఎదురైంది. ఇప్పుడు దీనిని పరిష్కరించుకోవటం పార్టీకి సవాల్ గా మారుతోంది. ఎందుకంటే 2019 ఎన్నికల్లో జనసేన గాజు గ్లాసు గుర్తుతో ఎన్నికల బరిలోకి దిగింది. ఆ ఎన్నికల్లో ఒక అసెంబ్లీ సీటు గెలుచుకున్న జనసేన.. కూటమిగా 5.6 శాతం ఓట్లు సాధించింది. జనసేన సింగిల్ గా పార్లమెంట్ ఎన్నికల్లో 6.30 శాతం.. అసెంబ్లీ ఎన్నికల్లో 5.54 శాతం ఓట్ షేర్ దక్కించుకుంది. అక్కడ నుంచి పార్టీకి కామన్ సింబల్ సమస్య మొదలైంది. తిరుపతి లోకసభ ఉప ఎన్నికల్లోనూ గాజు గ్లాస్‌ గుర్తును స్వతంత్ర అభ్యర్థికి కేటాయించింది ఎన్నికల సంఘం. అలాగే బద్వేలు అసెంబ్లీ ఉపఎన్నికల్లో కూడా ఇలాగే ఇంకో అభ్యర్ధికి కేటాయించారు. ఆత్మకూరు అసెంబ్లీ ఉపఎన్నికలో పోటీచేస్తున్న నవరంగ్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి షెక్ జలీల్ కు ఎన్నికల కమీషన్ గాజుగ్లాసు చిహ్నాన్ని కేటాయించింది. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో పోటీ విషయంలోనూ జనసేన నిర్ణయం కామన్ సింబల్ పైన ఎఫెక్ట్ చూపింది. గత ఏడాది ఏపీలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లోనూ కామన్ సింబల్ దక్కలేదు.  ప్రస్తుతం జనసేనా కామన్ సింబల్ సాధించడంపై ఫోకస్ చేయాలి.. లేదంటే ఇబ్బందులు తప్పవు అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.. ప్ర్తస్తుతం అందుతున్న సమచారం ప్రకారం.. 2025 వరకు తిరిగి గాజు గ్లాసు కామన్ సింబల్ గా దక్కే అవకాశం లేదని తెలుస్తోంది. అదే జరిగితే భారీ డ్యామేజ్ తప్పకపోవచ్చు.. ఒక్కో అభ్యర్థికి ఒక్కో గుర్తు కేటాయిస్తే.. ఒక్కోచోట అభ్యర్థిని గుర్తించడం కష్టం అవుతుంది. అదే రాష్ట్ర వ్యాప్తంగా జనసేన అభ్యర్థులకు గ్లాసు గుర్తు ఉంటే.. పవన్ పై అభిమానంతో.. అభ్యర్థితో సంబంధం లేకుండా వీర అభిమానులు గాజు గ్లాసుకు గంపగుత్తుగా ఓటు వేసే అవకాశం ఉంటంది. మరోవైపు ఒకవేళ జనసేన అభ్యర్థి పోటీ ఉన్న చోట.. మరో అభ్యర్థికి గాజు గ్లాసు సింబల్ కేటాయిస్తే.. ఆ వ్యక్తి జనసేన అభ్యర్థి అనుకుని అతడికి ఓట్లు పడే అవకాశం ఉంటుంది.

  ఇదీ చదవండి : ఉపాధ్యాయుల వెన్నులో వణుకు.. జగన్ సర్కార్ సంస్కరణలతో భయం భయం

  అందుకే ఇప్పుడు ముందుగా జనసేన గాజు గ్లాసు గుర్తు కోసం ముందు పోరాడాలని జనసైనికులు అభిప్రాయపడుతున్నారు. ఈ సారి టీడీపీతో జనసేన పొత్తుపెట్టుకుంటే మంచి ఫలితాలు సాధించే అవకాశం ఉందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఇలాంటి నేపథ్యంలో.. కామన్ సింబల్ దక్కించుకోకపోతే నష్టం తప్పదనే అందోళన అభిమానుల్లో వ్యక్తం అవుతోంది. దీంతో.. ఇప్పుడు జనసేన నేతలు అటు ఎన్నికల సంఘం..ఇటు న్యాయ పరంగా తమ ముందున్న అవకాశాలను పరిశీలన చేస్తున్నారు.
  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Andhra Pradesh, AP News, Janasena, Pawan kalyan

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు