Home /News /andhra-pradesh /

AP POLITICS JANASENA CHIEF PAWAN KALYAN WILL DECIDE WHERE HE IS CONTESTANT NGS

Pawan Kalyan: ఆ నియోజకవర్గమే పవన్ కు సేఫ్ ప్లేసా..? జనసైనికుల సర్వే ఏం చెబుతోంది?

పవన్ కల్యాణ్

పవన్ కల్యాణ్

Pawna Kalyan: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గత ఎన్నికల్లో పోటీ చేసిన రెండు చోట్లా ఓడిపోయారు.. మరి ఈ సారి పోయినచోటే వెతుక్కుంటారా..? కొత్త నియోజకవర్గంపై ఫోకస్ చేస్తారు.. దీనికి సంబంధించి ఇప్పటికే ఓ సర్వే కూడా పూర్తి చేశారంట.. పవన్ పోటీ చేయడానికి అదే సరైన ప్లేస్ అని ఫిక్స్ అయ్యారనే ప్రచారం జరుగుతోంది.

ఇంకా చదవండి ...
  Pawna Kalyan: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజకీయాల్లో రసవత్తరంగా సాగుతున్నాయి. అన్ని పార్టీలు ఎన్నికల మూడ్ లోకి వెళ్లాయి. ఎంతలా అంటే.. ప్రధాన పార్టీలు తమ అభ్యర్థులను కూడా ఫిక్స్ చేస్తున్నాయి. అంతేకాదు.. ఎవరు ఏ పోటీ నుంచి పోటీ చేయాలని.. ఎక్కడ పోటీ చేస్తే ఎలాంటి ఫలితాలు ఉంటాయి.. ఇలా అన్నిటిపైనా సొంతంగా సర్వేలు చేయించుకుంటున్నట్టు టాక్. తాజాగా జ‌న‌సేన (Janasena) అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ (Pawan Kalyan) వచ్చే ఎన్నిక‌ల్లో ఎక్కడ నుంచి పోటీ చేస్తారు.. దీనిపై ఏపీ వ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. ఎందుకంటే గతంలో పోటీ చేసిన రెండు స్థానాల్లోనూ పవన్ ఓడిపోయారు. దీంతో ఈ సారి గెలుపు ఆయనకు తప్పని సరి.. లేదంటే రాజకీయాల నుంచి తప్పుకోవలనే డిమాండ్ పెరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే ఆయన పోటీచేసే నియోజ‌క‌వ‌ర్గంపై ఎక్కువ ఫోకస్ చేసినట్టు టాక్.  ఇప్పటికే దాదాపుగా తన ప్లేస్ ఖరారైనట్టు తెలుస్తోంది. గ‌త ఎన్నిక‌ల్లో గాజువాక‌ (Gajuwaka), భీమ‌వ‌రం (Bheemavaram) నుంచి పోటీచేసి ఓట‌మిపాల‌వ‌డం ఆ పార్టీ శ్రేణ‌నుల‌ను తీవ్రంగా నిరాశ‌ప‌రిచింది. ఈసారి ఆరు నూరైనా త‌మ నేత అసెంబ్లీలో అడుగు పెట్టేలా చేయాలని జనసైనికులు ఆరాటపడుతున్నారు. ఈ సారి పక్కా గెలుపు గ్యారెంటీ అనుకున్న నియోజకవర్గం నుంచే ఆయన పోటీ ఉండే అవకాశం ఉంది.

  తాజాగా అందుతున్న సమచారం ప్రకారం.. ఆయన రెండు నియోజక వర్గాలను ఫైనల్ చేసినట్టు టాక్.. అయితే ఆయన గతంలో పోటీ చేసిన ఓడిపోయిన భీమవరం నుంచే పోటీ చేయాలని ఓ వర్గం గట్టిగా పట్టుపడుతోంది.. ఈ సారి అధినేతను తప్పక గెలిపించుకుంటామని హామీ ఇస్తున్నారంట.. మరో వర్గం మాత్రం.. తూర్పుగోదావ‌రి జిల్లా పిఠాపురం నుంచి ఈసారి బ‌రిలోకి దిగుతారని చెబుతోంది. గ‌త ఎన్నిక‌ల్లో ఈ రెండు జిల్లాల్లో ప్ర‌తి నియోజ‌క‌వ‌ర్గం నుంచి దాదాపు 25వేల ఓట్ల‌కు త‌క్కువ కాకుండా జ‌న‌సేన సాధించింది. తెలుగుదేశం గత ఎన్నికల్లో ఓటమికి ఇది కూడా ఒక కారణం. మరి ఈ సారి పవన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.  జనసైనికులు ఇంటర్నల్ గా చేయించుకుంటున్ సర్వేలో ప‌వ‌న్ గ‌త ఎన్నిక‌ల్లోనే ఇక్క‌డి నుంచి పోటీచేసి ఉండాల్సింద‌ని, గెలిపించుకునేవారిమ‌ని చెప్పినట్టు తెలుస్తోంది. 2019 ఎన్నిక‌ల్లో జనసేన అభ్యర్ధిగా పోటీ చేసిన మాకినీడు శేషుకుమారి భారీగా 28 వేల ఓట్లు సాధించారు. 151 సీట్లు సాధించిన జ‌గ‌న్మోహ‌న్‌రెడ్డి హ‌వాలో కూడా ఆమె అన్ని ఓట్లు సాధించ‌డం అద్భుతంగా ప‌రిగ‌ణించారు రాజ‌కీయ విశ్లేష‌కులు. ఇప్పడు పిఠాపురంలో జ‌న‌సేన మరింత బలం పుంజుకుంది అంటున్నారు. వార్డు వార్డుకు, గ్రామ గ్రామానికి కార్య‌క‌ర్త‌ల యంత్రాంగం ఉందని.. యువ‌త ఆయ‌న‌వైపే ఉంటారు కాబ‌ట్టి విజ‌యానికి ఢోకా లేద‌ని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. ఇటీవ‌ల జ‌రిగిన స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో కూడా ఇక్క‌డి ఎంపీటీసీ స్థానాన్ని ఆ పార్టీనే కైవ‌సం చేసుకుంది. అందుకే పవన్ ఇక్కడ నుంచే పోటీ చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.

  ఇదీ చదవండి : అట్టహాసంగా ఊరేగింపుతో పెళ్లికి వెళ్లాలి అనుకుంది.. కానీ వరద నీటిలో పడవలో వెళ్లిన పెళ్లికూతురు

  మరోవైపు ఇక్కడ వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే పెండెం దొర‌బాబుపై స్థానికుల్లో తీవ్ర వ్య‌తిరేక‌త వ్య‌క్త‌మ‌వుతోంద‌ని, ప్ర‌జ‌ల‌తో దూరంగా ఉండ‌ట‌మే ఇందుకు కార‌ణ‌మని జ‌న‌సేన వ‌ర్గాలు చెబుతున్నాయి. తెలుగుదేశం పార్టీ నుంచి మాజీ ఎమ్మెల్యే వ‌ర్మ‌కు గెలుపు అవ‌కాశాలున్నప్పటికీ పవన్ బరిలోకి దిగితే రాజకీయ సమీకరణాలన్నీ మారిపోతాయని భావిస్తున్నారు. పిఠాపురం నుంచి పవన్ కల్యాణ్ పోటీచేస్తే ఆ ప్ర‌భావం కాకినాడ అర్బ‌న్‌, రూర‌ల్‌, పెద్దాపురం, తుని తదిత‌ర నియోజ‌క‌వ‌ర్గాల‌పై ఉంటుంద‌ని అందుకే పవన్ పిఠాపురం నుంచి పోటీ చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Andhra Pradesh, AP News, Janasena, Pawan kalyan

  తదుపరి వార్తలు