Home /News /andhra-pradesh /

AP POLITICS JANASENA CHIEF PAWAN KALYAN WARNS YCP LEADERS FOR GRABBING PUBLIC ASSETS IN ANDHRA PRADESH FULL DETAILS HERE PRN

Pawan Kalyan: వెనక్కి తగ్గకుంటే నేనే వస్తా.. వైసీపీ నేతలకు పవన్ వార్నింగ్..

పవన్ కల్యాణ్

పవన్ కల్యాణ్

బాధ్యత అంటే ఏంటో వైసీపికి చూపిస్తున్నామన్నారు జనసేన (Janasena) అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan). ఆదివారం రెండో విడత జనవాణి కార్యక్రమాన్ని చేపట్టిన పవన్ కల్యాణ్.. ప్రజాసమస్యలపై వినతులు స్వీకరించారు.

    బాధ్యత అంటే ఏంటో వైసీపికి చూపిస్తున్నామన్నారు జనసేన (Janasena) అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan). ఆదివారం రెండో విడత జనవాణి కార్యక్రమాన్ని చేపట్టిన పవన్ కల్యాణ్.. ప్రజాసమస్యలపై వినతులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఏళ్ల తరబడి పలు సమస్యలు ఎదుర్కొంటున్న వారు పవన్ కు తమ సమస్యలు వివరించారు. ఈ సందర్భంగా మాట్లాడిన పవన్ కల్యాణ్.. వైసీపీ నేతలపై మండిపడ్డారు. వైసీపీ నేతలు సామాన్య ప్రజలను బ్రతకనివ్వడం లేదని పవన్ అన్నారు. యథా రాజా.. తథా ప్రజా.. అన్నట్లు.., నాయకుడు ఏం చేస్తాడో కింది స్థాయి వ్యక్తులు కూడా అదే చేస్తారు.. వైసీపీ నాయకులు అంతకు మించి చేస్తున్నారని ఆయన అన్నారు. అధికారం ఉంది కదా అని మదమెక్కి దౌర్జన్యాలకు పాల్పడితే తీవ్రవాద ఉద్యమాలు వస్తాయని., శ్రీలంక మాదిరి దేశాధినేతను తరిమివేసే పరిస్థితులు ఇలాంటి పరిణామాల వల్లే వస్తాయని చెప్పారు.

    వైసీపీ నేతలంటే తనకు చిరాకు అన్న పవన్ కల్యాణ్.. వారు అధికార మదంతో కొట్టుకుంటున్నారని.. ఎవరో ఒక నాయకుడు ఇలా చేస్తే భరించగలం గానీ.., నాయకుడి తాలూకు లక్షణాలు ప్రతి గ్రామానికి పాకేస్తే.. ప్రతిచోటా మినీ వైసీపీ అధినాయకుడే ఉంటాడని విమర్శించారు. వైసీపీ అధికారంలోకి వస్తే కనిపించిన కొండనల్లా మింగేస్తారని 2019లో చెప్పానని గుర్తు చేశారు. వైసీపీ నేతల నుంచి ప్రజల ఆస్తులకు రక్షణ లేకుండా పోయిందని.. అన్యాయంగా ఇళ్లు, స్థలాలు కబ్జా చేస్తున్నారని.. ప్రశ్నించిన వారి ప్రాణాలు తీసేస్తున్నారని పవన్ అరోపించారు.

    ఇది చదవండి: మరో మూడు రోజులు అలర్ట్.. ఏపీకి వాతావరణ శాఖ హెచ్చరిక.. ఈ జిల్లాలకు వానముప్పు


    వైసీపీ నేతలకు ఇకనైనా పద్ధతి మార్చుకోకుంటే ప్రజాగ్రహాన్ని తట్టుకోలేరని.., జనం మిమ్మల్ని రోడ్ల వెంట ఉరుకులు పరుగులు తీయిస్తారని ఆయన హెచ్చరించారు. వైసీపీ నేతలు మనుషుల సహనాన్ని పరీక్షిస్తున్నారని.., సరిచేసుకుంటారో.. దాని పర్యవసానాలు ఎదుర్కొంటారో మీకే వదిలేస్తున్నామని వ్యాఖ్యానిచ్చారు. మీరు రౌడీలు కావచ్చు.. ఫ్యాక్షనిస్టులు కావచ్చు.. ఎర్రచందన స్మగ్లర్లు, గూండాలు కావచ్చు. మీకు జనసేన, జనసైనికులు, వీరమహిళలు భయపడే ప్రసక్తే లేదని ఘాటుగా హెచ్చరించారు.

    ఇది చదవండి: ఏపీలో ప్రైవేట్ స్కూల్స్ స్టూడెంట్స్ కు గుడ్ న్యూస్.. బుక్స్ ధర తగ్గించిన ప్రభుత్వం.. వివరాలివే..!


    వృద్ధాప్యంలో ఉన్న ఓ తల్లి మీద దౌర్జన్యం చేస్తే ఈ ముఖ్యమంత్రికి తెలియడం లేదా? చేతులు నిమిరి ముద్దులు పెట్టింది ఇలా ఇళ్ల నుంచి గెంటివేయడానికేనా? అని పవన్ ప్రశ్నించారు. ఇలాంటి అన్యాయాల్ని పది మంది బయటకు వచ్చి చొక్కా పట్టుకుని నిలదీస్తే తప్ప పరిస్థితుల్లో మార్పు రాదన్నారు పవన్. ప్రజల మాన ప్రాణాలు, ఆస్తుల జోలికి వస్తే తోలు తీస్తామని హెచ్చరించారు. ముఖ్యంగా చిత్తూరు జిల్లా వైసీపీ నాయకులు బాధితుల జోలికి వచ్చి ఏమైనా చేయడానికి ప్రయత్నిస్తే.. నేనే స్వయంగా వస్తానని పవన్ వార్నింగ్ ఇచ్చారు.
    Published by:Purna Chandra
    First published:

    Tags: Andhra Pradesh, Janasena party, Pawan kalyan

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు