హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Pawan Kalyan Tour: ఇక జనంలోకి జనసేనాని.., దసరా నుంచి పవన్ యాత్ర.. వివరాలివే..!

Pawan Kalyan Tour: ఇక జనంలోకి జనసేనాని.., దసరా నుంచి పవన్ యాత్ర.. వివరాలివే..!

పవన్ కల్యాణ్

పవన్ కల్యాణ్

జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Janasena Chief Pawan Kalyan) ఇకపై జనంలోకి వెళ్లనున్నారు. దసరా పండుగ నుంచి ఆయన ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్రవ్యాప్తంగా పర్యటించనున్నారు.

  జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Janasena Chief Pawan Kalyan) ఇకపై జనంలోకి వెళ్లనున్నారు. దసరా పండుగ నుంచి ఆయన ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్రవ్యాప్తంగా పర్యటించనున్నారు. తిరుపతి నుంచి ప్రారంభం కానున్న పవన్ టూర్.. ఆరు నెలల పాటు సాగనుంది. రాష్ట్రంలోని ఎన్ని అసెంబ్లీ నియోజకవర్గాలను టచ్ చేయనున్నున్న పవన్ కల్యాణ్ ప్రతి ఉమ్మడి జిల్లాలో బహిరంగ సభ నిర్వహించనున్నట్లు జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ తెలిపారు. మార్చి, ఏప్రిల్ లోనే ఎన్నికలు ఉంటాయన్న నాదెండ్ల మనోహర్ జనసైనికులు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. అక్టోబర్ 5వ తేదీ తిరుపతి నుంచి రాష్ట్రం కోసం, రాష్ట్ర ప్రజల కోసం ఈ యాత్ర సాగుతుందని తెలిపారు.

  వచ్చే ఏడాది మార్చిలో ముందస్తు ఎన్నికలు రానున్నాయని, ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధంగా ఉండాలని పార్టీ కార్యకర్తలకు నాదెండ్ల మనోహర్ పిలుపునిచ్చారు. కేవలం ఆరు నెలల సమయం మాత్రమే ఉందని ఎన్నికలకు మన వ్యూహాలతో మనం సన్నద్ధం కావాలన్నారు. “రాష్ట్ర ప్రజలంతా జగన్ రెడ్డికి ఇంకోసారి ఓటు వేయకూడదని ఎప్పుడో నిర్ణయించుకున్నారు. జులై మాసానికల్లా గ్రామ కమిటీలు, పట్టణ, వార్డు స్థాయి కమిటీలు ఏర్పాటు ప్రక్రియ పూర్తి చేసుకోవాలి. రాబోయే రోజుల్లో పార్టీ తరఫున మరిన్ని కార్యక్రమాలు చేపట్టబోతున్నాం. కష్టకాలంలో, ఎవరూ నమ్మని సమయంలో మీరంతా పార్టీకి అండగా నిలబడ్డారు. పార్టీ నిర్మాణ సమయంలోనూ పవన్ కళ్యాణ్ మాటకు గౌరవం ఇచ్చి, ఆయన ఇచ్చిన ప్రతి పిలుపుకీ స్పందించారు. జనసేన పార్టీవి స్వార్ధంతో కూడిన రాజకీయాలు కావు. జనసేన పార్టీ అవకాశవాద రాజకీయాలు చేయదు. ఏ కార్యక్రమం చేసినా అది ఎన్నికల సమయంలో ఓట్లు సాధించేందుకు ఉపయోగపడుతుందా లేదా అని ఆలోచించలేదు. అటువంటి రాజకీయాలు ఎప్పుడూ చేయలేదు. జనసేన పార్టీకి నిజాయితీగా ఒక సమస్య పరిష్కారం కోసం పని చేయాలన్న ఆలోచన మినహా మరే ఆలోచన ఉండదు. “ అని మనోహర్ పేర్కొన్నారు.

  ఇది చదవండి: పన్నుల వసూళ్లపై సీఎం జగన్ కీలక నిర్ణయం.. మరోసారి ఓటీఎస్ సిస్టమ్.. వివరాలివే..!


  పవన్ టూర్ నేపథ్యంలో రాజకీయాలు మరింత వేడెక్కనున్నాయి. తన పర్యటనలో పవన్ ఏయే అంశాలను లేవనెత్తుతారు...? ఎలా ప్రజలను జనసేనవైపు తిప్పుకోగలుగుతారన్నది ఆసక్తికరంగా మారింది. గతంలో పవన్ పలు పర్యటనలు చేసినా.. అవి కేవలం రోజులకే పరిమితమయ్యాయి. కానీ ఇప్పుడు ఏకంగా ఆరు నెలల పాటు ప్రజల్లో నే ఉండేలా ప్లాన్ చేసుకోవడంతో ఎక్కడా తగ్గే ప్రసక్తే లేదని పవన్ డిసైడయినట్లు తెలుస్తోంది. ఈ టూర్ తర్వాత రాష్ట్రంలో తమ బలాన్ని నిరూపించుకొని ఎన్నికలకు సన్నద్ధమవ్వాలనేది పవన్ భావిస్తున్నట్లు సమాచారం.

  Published by:Purna Chandra
  First published:

  Tags: Andhra Pradesh, Janasena party, Pawan kalyan

  ఉత్తమ కథలు