హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Pawan Kalyan: అయిననూ పోయిరావలె హస్తినకు అంటున్న పవన్..! అమిత్ షా తో భేటీ అందుకోసమేనా..?

Pawan Kalyan: అయిననూ పోయిరావలె హస్తినకు అంటున్న పవన్..! అమిత్ షా తో భేటీ అందుకోసమేనా..?

పవన్ కల్యాణ్ (ఫైర్)

పవన్ కల్యాణ్ (ఫైర్)

జనసేన (Janasena Party)ఆవిర్భవ సభ నిర్వహించిన నాటి నుంచి ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో రాజకీయాలు హీటెక్కుతున్నాయి. అధికార వైసీపీ (YSRCP)ని ఇరుకున పెట్టేందుకు ప్రతిపక్ష పార్టీలు సన్నద్ధం అవుతున్నాయి.

M Bala Krishna, News18, Hyderabad

జనసేన (Janasena Party)ఆవిర్భవ సభ నిర్వహించిన నాటి నుంచి ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో రాజకీయాలు హీటెక్కుతున్నాయి. అధికార వైసీపీ (YSRCP)ని ఇరుకున పెట్టేందుకు ప్రతిపక్ష పార్టీలు సన్నద్ధం అవుతున్నాయి. పొత్తుల లెక్కలు., ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను చీల్చకుండా కాష్ చేసుకొనే విధంగా వ్యూహ రచనలు, అస్త్రాలు సిద్ధం చేసుకుంటున్నాయి. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఓ వైపు పార్టీ కార్యకర్తలకు స్వేచ్ఛను ఇస్తూనే.., మరోవైపు ప్రజల్లో వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. పార్టీ క్యాడర్ బలహీనంగా ఉన్న చోట బలాన్ని చేర్చుకునేలా నూతన ఉత్సాహాన్ని నింపుతున్నారు. ఇక టీడీపీ జాతీయ కార్యదర్శి లోకేష్ తనదైన చూపే ప్రయత్నం చేస్తున్నారు. వే అఫ్ టాకింగ్ స్టైల్ కూడా మార్చేశారు. ప్రజలను తండ్రి చంద్రబాబు నాయుడిలా ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడు లోకేష్.

మ‌హానాడుతో నేత‌ల్లోనే కాకుండా కేడ‌ర్లో కూడా నూత‌న ఉత్సాహాన్ని నింప‌డానికి ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. చంద్ర‌బాబు టూర్ కు సంబంధించిన షెడ్యూల్ మ‌రో వారంలో క్లారిటీ రానుంది. రాష్ట్రవ్యాప్తంగా చంద్ర‌బాబు బ‌స్సు యాత్ర చేయ‌బోతున్న‌ట్లు పార్టీ వ‌ర్గాలు చర్చించుకుంటున్నాయి. మ‌రో వైపు చంద్ర‌బాబుతో పాటు లోకేష్ కూడా ప్ర‌జ‌ల్లోనే ఉండే ప్రయత్నాలు చేస్తున్నారట. చంద్ర‌బాబు బ‌స్సు యాత్ర చేస్తే లోకేష్ పాద‌యాత్ర చేయ‌డానికి రోడ్ మ్యాప్ సిద్ధం చేస్తున్నారట. ఇప్ప‌టికే పార్టీ నేత‌లు లోకేష్ పాద‌యాత్రకు సంబంధించిన షెడ్యూల్ ను కూడా త‌యారు చేసిన‌ట్లు పార్టీ నుంచి సంకేతాలు వస్తున్నాయి.

ఇది చదవండి: మారనున్న చంద్రబాబు అడ్రస్.. ఇకపై అక్కడి నుంచే రాజకీయం.. కారణం ఇదేనా..?


ఓవైపు టీడీపీ ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నం చేస్తున్న సమయంలో జనసేన ఆవిర్భావ సభలో ప్రతిపక్షాలకు బంపర్ ఆఫర్ ఇచ్చారు జనసేనాని పవన్ కళ్యాణ్. పవర్ లేనప్పుడు పవర్ స్టార్ అని ఎందుకు పిలుస్తారన్న పవన్.., క్షేత్ర స్థాయిలో పార్టీ బలోపేతానికి పటిష్టమైన బాటలు వేస్తున్నారు. ఈ క్రమంలో అధికార పార్టీ వ్యతిరేక ఓట్లపై కన్నేశారు. వైసీపీపై తీవ్ర అసంతృప్తిగా ఉన్న ఓట్లర్లను తమవైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రతిపక్షాలు అధికార పార్టీ వ్యతిరేక ఓట్లను చీల్చడంకన్నా... కలసి పనిచేస్తే విజయం తధ్యమని లెక్కలు వేసుకుంటున్నారు.

ఇది చదవండి: రోజా ఆ పనిచేస్తే ఇక తిరుగుండదు..! చరిత్రలో నిలిచిపోవడం ఖాయం..


2014 ఎన్నికల సమయంలో బిజెపి-జనసేన-టీడీపీ పార్టీలు కలసిన పోటీ చేసినట్లు 2024 ఎన్నికల్లో కలసి పనిచేస్తే వైసీపీ ఓటమి ఖాయమని విశ్లేషకుల అంచనా. ఇప్పటికే బీజేపీతో దోస్తీ కట్టిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ త్వరలోనే ఢిల్లీ వెళ్లేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. పవన్ ఢిల్లీ టూర్ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది. వచ్చే వారం ఢిల్లీ వేదికగా అమిత్ షా తో భేటీ కానున్నారు పవన్ కల్యాణ్. అదే సంబర్భంలో పొత్తులు.... ఎన్నికల వ్యూహ రచనపై సుదీర్ఘ చర్చ సాగనుంది.

ఇది చదవండి: ఏపీలో వైసీపీతో కాంగ్రెస్ పొత్తు..? అధిష్ఠానానికి పీకే సూచన.. జగన్ ఒప్పుకుంటారా..?


అధికార పార్టీని ఇరుకున పెట్టాలంటే సైకిల్ పార్టీతో జతకట్టలా వద్ద అనే అంశంపై అమిత్ షా తో పవన్ చర్చించే అవకాశం లేకపోలేదు. ఒకవేళ అమిత్ షా చంద్రబాబుతో పొత్తుకు సై అంటే 2014 ఎన్నికల్లో ఏర్పాటు చేసిన కూటమి మల్లి రిపీట్ అయ్యే అవకాశం ఉంది. ఢిల్లీ వెళ్లి పార్టీ వ్యూహాలపై అమిత్ షా- పవన్ తీసుకొనే నిర్ణయం వైసీపీని ఎలా ఇరుకున పెడుతుందో వేచి చూడాలి.

First published:

Tags: AP Politics, Bjp-janasena, Pawan kalyan

ఉత్తమ కథలు