Home /News /andhra-pradesh /

AP POLITICS JANASENA CHIEF PAWAN KALYAN SLAMS YSRCP GOVERNMENT OVER FARMERS PROBLEMS IN ANDHRA PRADESH FULL DETAILS HERE PRN

Pawan Kalyan: గోదావరిలో మొదలెట్టి పులివెందులలో ముగిస్తాం.. కోనసీమలో పవన్ హాట్ కామెంట్స్..

మండపేటలో పవన్ కల్యాణ్

మండపేటలో పవన్ కల్యాణ్

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించే శక్తి గోదావరి జిల్లాలకు ఉందన్నారు జనసేన (Janasena) అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan). శనివారం ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో కౌలు రైతు భరోసా యాత్ర నిర్వహించిన ఆయన.. ఆత్మహత్య చేసుకున్న 52 మంది కౌలు రైతుల కుటుంబాలకు రూ.లక్ష చొప్పున ఆర్ధిక సాయం అందజేశారు.

ఇంకా చదవండి ...
    ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించే శక్తి గోదావరి జిల్లాలకు ఉందన్నారు జనసేన (Janasena) అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan). శనివారం ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో కౌలు రైతు భరోసా యాత్ర నిర్వహించిన ఆయన.. ఆత్మహత్య చేసుకున్న 52 మంది కౌలు రైతుల కుటుంబాలకు రూ.లక్ష చొప్పున ఆర్ధిక సాయం అందజేశారు. పవన్ కల్యాణ్ పర్యటన సందర్భంగా జనసేన కార్యకర్తలు, అభిమానులు భారీగా తరలివచ్చారు. మండపేట రోడ్లన్నీ జనసైనికులతో నిండిపోయాయి. రాజమండ్రి విమానాశ్రయం నుంచి ర్యాలీగా మండపేటకు వెళ్లిన పవన్... అక్కడ రైతుల ఇళ్లకు వెళ్లి వారిని పరామర్శించి ఆర్ధిక సాయం అందజేశారు. అనంతరం మండపేటలో ఏర్పాటు చేసిన రైతు భరోసా రచ్చబండ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలతో భేటీ అయిన ఆయన.. వారికి స్వయంగా చెక్కులు అందజేశారు.

    అనంతరం ప్రసంగించిన పవన్.. వైసీపీ ప్రభుత్వంపై మండిపడ్డారు. గోదావరి జిల్లాలు చైతన్యం కలిగినవని.. రాష్ట్రంలో మార్పు రావాలంటే ఈ రెండు జిల్లాలతోనే సాధ్యమవుతందన్నారు. 2024లో రాష్ట్రంలో జనసేన జెండా ఎగరడం ఖాయమన్న పవన్.. ఎవరివైపు నిలబడతారో నిర్ణయించుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. తాము అధికారంలో లేకపోయినా కౌలు రైతులకు సాయం చేస్తున్నామని.. ఇప్పటికే కోట్లాది రూపాయలను వారికి అందించామన్నారు. జేబులో డబ్బులు తీసివ్వడం తనకేమీ సరదాకాదన్న పవన్.. ప్రభుత్వం రైతులకు అన్యాయం చేస్తోందని విమర్శించారు. రాష్ట్రంలో కౌలు రైతులకు గుర్తింపు కార్డులివ్వడం సీఎం జగన్ కు ఇష్టం లేదని.. అలాంటప్పుడు నెరవేర్చలేని హామీని ఎందుకిచ్చారో చెప్పాలని ప్రశ్నించారు. ప్రజలు చెల్లించే పన్నులనే ప్రభుత్వం తిరిగి పథకాల రూపంలో ఇస్తందన్నారు.

    ఇది చదవండి: చంద్రబాబు మా అన్నయ్య.. బంధుత్వంపై విజయసాయి ఆసక్తికర వ్యాఖ్యలు


    జనసేన పార్టీ అధికారంలోకి వస్తే రాష్ట్రాన్ని ఆర్ధికంగా మెరుగైన స్థితిలో నిలబెడతామని పవన్ హామీ ఇచ్చారు. ఇక కోనసీమ జిల్లాకు అంబేద్కర్ పేరు పెడితే తొలుత స్వాగతించింది తానేనని పవన్ గుర్తుచేశారు. రాష్ట్రంలో యువతకు ఉఫాధి అవకాశాలు కేవలం జనసేనతోనే సాధ్యమన్న ఆయన.. యువతు కూడా ఎవరివైపు ఉంటారో తేల్చుకోవాలన్నారు. ప్రభుత్వం తప్పుచేస్తే సరిచేసే బాధ్యతను యువత తీసుకోవాలన్న పవన్.. ధైర్యం లేకుంటే అరాచకం రాజ్యమేలుతుంద్నారు. ప్రజలు కులాల స్థాయిని దాటి ఆలోచించుకోవాల్సిన అవసరముందన్నారు. వైసీపీలోనూ కొందరు మంచివారున్నారని.. తప్పులు సరిదిద్దుకోవాలని వారే ప్రభుత్వానికి చెప్పాలన్నారు. ఎన్నికల్లో అభ్యర్థులను చూడొద్దని.. తనను చూసి ఓటు వేయాలని పవన్ విజ్ఞప్తి చేశారు. గోదావరి జిల్లాల్లో మార్పు మొదలైతే అది పులివెందుల వరకు వెళ్తుందన్నారు.

    ఇది చదవండి: మాటలకే పరిమితమైన లోకేష్..? ఆ విషయంలో ముందడుగు వేయలేకపోతున్నారా..?


    ఆదివారం కూడా పవన్ గోదావరి జిల్లాల్లోనే పర్యటించనున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రమైన భీమవరంలో జనసేన జనవాణి కార్యక్రమాన్ని పవన్ నిర్వహిస్తారు. సమస్యలపై ప్రజల నుంచి అర్జీలు స్వీకరిస్తారు. ఇప్పటికే రెండు ఆదివారాలు విజయవాడలో జనవాణి కార్యక్రమాన్ని నిర్వహించిన పవన్.. మూడో ఆదివారం భీమవరాన్ని ఎంచుకున్నారు.
    Published by:Purna Chandra
    First published:

    Tags: Andhra Pradesh, Janasena party, Pawan kalyan

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు