ఆడబిడ్డలకు అన్యాయం జరిగితే క్రిమినల్స్ కు అండగా ఉండే ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో ఉందని జనసేన (Janasena Party) అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) అన్నారు. ఇలాంటి వైసీపీ ప్రభుత్వాన్ని గద్దెదించాలని పిలుపునిచ్చారు. రాబోయే తరాల భవిష్యత్తు కోసం పార్టీని స్థాపించినట్లు వెల్లడించారు.
ఆడబిడ్డలకు అన్యాయం జరిగితే క్రిమినల్స్ కు అండగా ఉండే ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో ఉందని జనసేన (Janasena Party) అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) అన్నారు. ఇలాంటి వైసీపీ ప్రభుత్వాన్ని గద్దెదించాలని పిలుపునిచ్చారు. రాబోయే తరాల భవిష్యత్తు కోసం పార్టీని స్థాపించినట్లు వెల్లడించారు. శనివారం జనసేన వీరమహిళలకు శిక్షణా తరగతులను ప్రారంభించిన పవన్.. వైసీపీ ప్రభుత్వంపై మండిపడ్డారు. జనసేన ఏడు సిద్దాంతాలతో పని చేస్తోందన్న పవన్.. టీఆర్ఎస్ ఒకే సిద్దాంతంతో వచ్చినా ప్రాధాన్యత మారిందన్నారు. ప్రాంతీయ అసమానతలు ఉంటే సమాజం విచ్ఛిన్నమవుతుందని పవన్ అభిప్రాయపడ్డారు. మగవాళ్లు ఎంతమంది ఉన్నా... స్త్రీ శక్తి వేరని.., మహిళా లోకం తలచుకుంటే ఏదైనా సాధించగలరన్నారు. ఒక ఆడబిడ్డ మాన మర్యాదలకు భంగం కలిగితే తల్లి పెంపకాన్ని నిందిస్తారా..? ఇదేనా ఆ పార్టీ నేతల సభ్యత, సంస్కారం అంటూ వైసీపీని విమర్శించారు పవన్. మిమ్మలను ఇలాంటి అరాచకాలకు అండగా ఉండాలని గెలిపించలేదన్నారు.
సుగాలి ప్రీతి విషయం తనను బాగా కలచివేసిందని.. 14ఏళ్ల పాప అలా చనిపోతే ఆ తల్లి ఆవేదన ఎలా ఉంటుందో ఆలోచించాలని పవన్ కల్యాణ్ అన్నారు. కేసు సీబీఐకి పంపినా న్యాయం జరగలేదన్నారు. ఆడపిల్లలు రోడ్ల మీదకు వెళ్ల కూడదని హోం మంత్రి ఎలా అంటారని ఆయన ప్రశ్నించారు. మహిళల్లో చైతన్యం తెస్తేనే .. సమాజం లో మార్పు వస్తుందిని.. ఈ ఫలితం ఇప్పుడు కనిపించకపోయినా... భవిష్యత్తు తరాలుకు మేలు జరుగుతుందని అభిప్రాయపడ్డారు. జనసేనకు జనాదరణ క్రమంగా పెరుగుతుందని చెప్పారు.
ఆశ వైసీపీకి ఉంటే.., ఆశయం జనసేనకు ఉందని ఆశయం ఉన్నవాళ్లకి భూదేవి అంత ఓర్పు ఉంటుందన్నారు. సహనాన్ని పరీక్షిస్తే... భూకంపం ఎలా ఉంటుందో చూస్తారని హెచ్చరించారు. శిక్షణ తరగతుల వల్ల ఇప్పుడు అద్భుతాలు జరగవని.. కానీ అద్భుతాలకు ఆలంబనగా, అడుగు పడేలా ఈ తరగతులు నిలుస్తాయని పవన్ చెప్పారు. నానా చెత్త మాట్లాడేకన్నా.. జ్ఞానం పెంచుకోవాలని.., మనం ప్రజల్లోకి తీసుకెళ్లే ఐడియాలజీతో పనిచేయాలని పిలుపునిచ్చారు. నేనొక్కడినే ఎదగడం కాదు.. నాతో పాటు అందరూ ఎదగాలనేది తన లక్ష్యమన్నారు.
జనసేన కు ఓటమని కూడా తీసుకునే ధైర్యం ఉందన్నారు. అపజయం ఎదురైనా పోరాటం చేసేందుకు సిద్దంగా ఉండాలని జనసేనాని పిలుపునిచ్చారు. సినిమాలో చేసే వాటిలో నిజ జీవితంలో ఎంతో కొంత చేయ కలిగితే నాకు చాలా సంతృప్తిగా ఉంటుందన్నారు. బూతులు తిట్టే మంత్రులకు భయపడొద్దని.. దోపిడీ చేసే ప్రభుత్వాన్ని నిలదీయాలన్నారు పవన్ కల్యాణ్. దొంగ లెక్కలు బయటపెడితే వారే భయపడతారన్నారు. మద్యం రద్దు చేస్తామన్న వారు ఏరులై పారిస్తున్నారని విమర్శించారు.
మద్యం నిషేధిస్తామన్న వ్యక్తి అసలు మద్యం ఎలా అమ్ముతారని ప్రశ్నించిన పవన్.. నెలకి వాళ్ల వ్యక్తిగత ఖాతాకి రూ.250 కోట్లు మద్యం ద్వారా వెళ్తున్నాయన్నారు. అడ్డగోలుగా లంచాలు తింటున్న వారికి ఉద్యోగులను శిక్షించే అర్హత ఎక్కడ ఉందని ప్రశ్నించారు. సీపీఎస్ రద్దు చేస్తామని చెప్పి మాట తప్పారని.., ఇలాంటి మోసాలపై జగన్ ప్రభుత్వాన్ని నిలదీయాలని పిలుపునిచ్చారు.
Published by:Purna Chandra
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.