హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Pawan Kalyan: పర్యావరణంపై ప్రేమ పుట్టిందా..? మరి వాటి సంగతి ఏంటి అంటూ పవన్ ట్వీట్ల వర్షం

Pawan Kalyan: పర్యావరణంపై ప్రేమ పుట్టిందా..? మరి వాటి సంగతి ఏంటి అంటూ పవన్ ట్వీట్ల వర్షం

ఆ ఎమ్మెల్యే ఆస్తులపై పవన్ విమర్శలు

ఆ ఎమ్మెల్యే ఆస్తులపై పవన్ విమర్శలు

Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. మరోసారి వైసీపీ ప్రభుత్వంపై ట్వీట్ల వర్షం కురిపించారు.. బ్యాక్ టు బ్యాక్ ట్వీట్లతో హోరెత్తించారు.. ముఖ్యంగా పర్యావరణ పరిరక్షణపై ప్రేమ పుట్టడం మంచిదే అంటూ.. వాటి సంగతిపై ఫోకస్ చేయండి అంటూ సెటైర్లు వేశారు. ఇంతకీ ఆయన ఏమన్నారంటే..?

ఇంకా చదవండి ...
 • News18 Telugu
 • Last Updated :
 • Visakhapatnam, India

  Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) సీఎం జగన్ మోహన్ రెడ్డి (CM Jagan Mohan Reddy) శుక్రవారం సంచలన ప్రకటన చేశారు. ఇకపై ఏపీలో సంపూర్ణంగా ప్లాస్టిక్ ఫ్లెక్సీలను బ్యాన్ (Plastic flex ban) చేస్తున్నట్టు ప్రకటించారు. తన ఫ్లెక్సీలు ఉన్నా చించేయాలని ఆదేశాలు జారీ చేశారు. అయితే తాజాగా ఏపీలో ప్లాస్టిక్‌ ఫ్లెక్సీలపై రాష్ట్ర ప్రభుత్వం నిషేధం విధించడంపై జనసేన (Janasena) అధినేత పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan) తాజాగా స్పందించారు. ఈ సందర్భంగా వైసీపీ ప్రభుత్వం (YCP Government) తీరుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో పర్యావరణ విధ్వంసం జరుగుతున్నా పట్టించుకోని ప్రభుత్వానికి ఒక్కసారిగా పర్యావరణంపై ఎందుకు ప్రేమ పుట్టుకొచ్చింది అంటూ పవన్ అనుమానం వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ట్వీట్‌ చేశారు. విశాఖ (Visakha) లో పారిశ్రామిక కాలుష్య నివారణకు ప్రభుత్వం ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. విషవాయువుల లీకేజీ, మరణాలు అరికట్టేందుకు జాగ్రత్తలు తీసుకోలేదు. ప్రమాదాల కారకులకు ఇప్పటివరకు శిక్షలు పడలేదు. రుషికొండను ఆక్రమించి విధ్వంసం సృష్టించారు. రాష్ట్రంలో ఇన్ని జరుగుతున్నా పట్టించుకోని వైసీపీ ప్రభుత్వానికి ఒక్కసారిగా పర్యావరణంపై ప్రేమ పుట్టిందా? అంటూ పవన్ ప్రశ్నించారు.


  ప్రభుత్వానికి ఈ ద్వంద్వ వైఖరి ఎందుకని పవన్ నిలదీశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో పర్యావరణ కాలుష్యానికి కారణమవుతున్న పరిశ్రమలు వివరాలు సేకరించాలని పార్టీ శ్రేణులు, అభిమానులకు పిలుపునిచ్చారు. వాటిని ప్రజా క్షేత్రంలో పెడదామని పేర్కొంటూ వరుస ట్వీట్ల వర్షం కురిపించారు.  రాష్ట్ర ప్రభుత్వానికి పర్యావరణంపై ఉన్న పళంగా ప్రేమ కలిగింది. కాబట్టి కాలుష్యాన్ని వెదజల్లుతూ జల వనరులను, పంట పొలాలను, మత్స్య సంపదను నాశనం చేస్తున్న సిమెంట్ కంపెనీలు, ఫార్మా సంస్థలు, రసాయన పరిశ్రమల్లాంటి వివరాలు సేకరించాలి అంటూ తొలి ట్వీట్ చేశారు.  అడవుల్లో సైతం పచ్చదనాన్ని నాశనం చేస్తూ అక్కడి సంపదను దోచేస్తూ పర్యావరణానికి హాని చేసే మైనింగ్ సంస్థల వివరాలను, అడ్డగోలుగా కొండలను తొలిచేస్తూ పచ్చదనాన్ని హరించే ప్రభుత్వ శాఖల వ్యవహారాలను కూడా రికార్డు చేద్దాం అంటూ మరో ట్వీట్ చేశారు..  అలాగే కాలుష్యకారక ప్రాజెక్టులు, వాటి మూలంగా కలుగుతున్న హాని, మీ ఆరోగ్యాలకు ఎంత నష్టం కలుగుతుందో చెప్పండి ట్వీట్ చేశారు.. సదరు పారిశ్రామిక సంస్థలు ఏర్పాటు దశలో ప్రజాభిప్రాయ సేకరణను ఎంత ప్రహసనంగా మార్చి, ప్రభుత్వ బలగాలతో ఏ విధంగా ఆందోళనలను అణచి వేస్తున్నారో కూడా వెల్లడించే సమయం వచ్చిందన్నారు.  అకస్మాత్తుగా పర్యావరణ ప్రేమికులుగా మారిన పాలకుల దగ్గర ఈ వివరాలు ఉన్నాయో? లేదో? రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి ఏ మేరకు ఈ వివరాలను పొందుపరిచిందో? అయినా మన వంతు బాధ్యతగా అన్ని వివరాలూ బయటకు తీసుకువద్దాం. మన జనసేన పార్టీ మూల సిద్ధాంతాని కాపాడుకుందాం అంటూ పవన్ ట్వీట్లు చేశారు.

  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Andhra Pradesh, Ap government, AP News, Janasena, Pawan kalyan

  ఉత్తమ కథలు