Home /News /andhra-pradesh /

AP POLITICS JANASENA CHIEF PAWAN KALYAN SLAMS AP GOVERNMENT ON POWER CRISIS IN ANDHRA PRADESH FULL DETAILS HERE PRN

Pawan Kalyan: మా సహనాన్ని పరీక్షించొద్దు.. సీఎంకు పవన్ వార్నింగ్.. ఏపీలో పిక్స్ కి చేరిన పవర్ పాలిటిక్స్..

పవన్ పై మంత్రుల ఫైర్

పవన్ పై మంత్రుల ఫైర్

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో విద్యుత్ సంక్షోభం (Power Crisis) తీవ్రమవుతున్న నేపథ్యంలో జగన్ సర్కార్ పై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. ఇప్పటికే విద్యుత్ ఛార్జీలు పెంచగా.. కరెంట్ కోతలు (Power Cuts) కూడా పెరిగిపోవడం, పరిశ్రమలకు పవర్ హాలిడే ప్రకటించడంతో ప్రభుత్వ తీరుపై టీడీపీ, జనసేన, బీజేపీలు అగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఇంకా చదవండి ...
    ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో విద్యుత్ సంక్షోభం (Power Crisis) తీవ్రమవుతున్న నేపథ్యంలో జగన్ సర్కార్ పై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. ఇప్పటికే విద్యుత్ ఛార్జీలు పెంచగా.. కరెంట్ కోతలు (Power Cuts) కూడా పెరిగిపోవడం, పరిశ్రమలకు పవర్ హాలిడే ప్రకటించడంతో ప్రభుత్వ తీరుపై టీడీపీ, జనసేన, బీజేపీలు అగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా విద్యుత్ సంక్షోభానికి వైసీపీ అనాలోచిత విధానాలే కారణమని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆరోపించారు. పల్లెల్లో 14 గంటలు, పట్టణాల్లో 8 గంటలకు తగ్గకుండా విద్యుత్ కోతలు విధిస్తుంటే.. అనధికార విద్యుత్ కోతల (AP Power Cut Timings) తో ప్రజలు అల్లాడిపోతున్నారన్నారు. మొబైల్ ఫోన్ వెలుతురులో ప్రసవాలు రాష్ట్రంలో దుస్థితిని తెలియచేస్తున్నాయని., పవర్ హాలిడే ప్రకటనతో పారిశ్రామిక అభివృద్ధికి విఘాతమని జనసేనాని అభిప్రాయపడ్డారు.

    రాష్ట్ర విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్ మిగులు విద్యుత్ రాష్ట్రంగా ఉండేదన్న పవన్.., అప్పటి ప్రభుత్వ హయాంలో విద్యుత్ కొరత లేదన్నారు. ఐతే వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వా గత ప్రభుత్వ విద్యుత్ ఒప్పందాలను రద్దు చేసి.. యూనిట్ రెండు రూపాయలకే గ్రీన్ ఎనర్జీని తీసుకొస్తామని చెప్పి.. ఇప్పుడేమో కోల్ ఎనర్జీని రూ.20 పెట్టి కొంటోందని విమర్శించారు. ఉచిత విద్యుత్ అని చెప్పి 57 శాతం ఛార్జీలు పెంచారని.., ఫ్యాను, రెండు లైట్లు, 15 గంటలు టీవీ చూసినా 150 యూనిట్లే ఖర్చు అవుతుందని, మరో 50 యూనిట్లు పెద్ద మనసుతో అదనంగా ఇస్తున్నామని ప్రకటించిన సీఎం.. ఇప్పుడు విద్యుత్ ఛార్జీలు భారీగా పెంచి ఇళ్లల్లో ఫ్యాన్లు వేసుకోకుండా చేశారని ఎద్దేవా చేశారు. పరిశ్రమలకు అదనంగా మరో రోజు పవర్ హాలిడే ప్రకటించడంతో కోట్లాది రూపాయలు పెట్టుబడి పెట్టిన పారిశ్రామికవేత్తలు విద్యుత్ కోతలతో నష్టాల పాలవుతున్నారన్నారు. ప్రభుత్వ నిర్ణయంతో 36 లక్షల మంది కార్మికుల ఉపాధిపై ప్రభావం పడే ప్రమాదం ఉందని పవన్ అభిప్రాయపడ్డారు.

    ఇది చదవండి: 'నా వెంటుక్ర కూడా పీకలేరు..' బాబు, పవన్ పై జగన్ సంచలన కామెంట్స్..


    ఇక మా సహనాన్ని పరీక్షించవద్దన్న పవన్.. వ్యక్తిగత అజెండాతో జనసేన పార్టీని స్థాపించలేదని..భవన నిర్మాణ కార్మికుల సమస్యల నుంచి పెరిగిన విద్యుత్ ఛార్జీల వరకు ప్రజల పక్షానే పోరాటం చేస్తున్నామని పవన్ స్పష్టం చేశారు. ఉద్యోగులు రోడ్డెక్కడానికి, కౌలు రైతుల ఆత్మహత్యలకు ప్రభుత్వ విధానాలే కారణమని ఆయన విమర్శించారు. తాము ప్రభుత్వ విధానాలు, పాలసీల గురించి మాట్లాడితే నన్ను వ్యక్తిగతంగా రాక్షసుడు, దుర్మార్గుడు అని దూషిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

    ఇది చదవండి: కేబినెట్ పై సీఎం జగన్ అనూహ్య నిర్ణయం.. ఆ 10 మందికి సెకండ్ ఛాన్స్..?


    మీరు వ్యక్తిగతంగా దూషణలకు దిగితే వాటిని ఎలా ఎదుర్కోవాలో నాకు బాగా తెలుసని.., నోటికి వచ్చినట్లు మాట్లాడి మా సహనాన్ని పరీక్షించ వద్దని హెచ్చరించారు. పవర్ పర్చేజ్ అగ్రిమెంట్ల రద్దు నుంచి పరిశ్రమలకు పవర్ హాలీడే ప్రకటించే వరకు వైసీపీ అనాలోచిత విధానాలతో ప్రజలను ఎలా మోసం చేస్తున్నారో ప్రతి ఒక్క జన సైనికుడు, వీరమహిళ ప్రజల్లోకి తీసుకెళ్లాలని పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు.
    Published by:Purna Chandra
    First published:

    Tags: Andhra Pradesh, Ap cm jagan, Pawan kalyan

    తదుపరి వార్తలు