ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో మద్యపాన నిషేధం (Liquor Ban) అంశం మరోసారి హాట్ టాపిక్ అయింది. మద్యపాన నిషేధం అమలు చేస్తామన్న ప్రభుత్వం.. ఇప్పుడు అవే మద్యం అమ్మకాలను చూపించి రుణాలు పొందడం విమర్శలకు తావిస్తోంది. దీనిపై ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి. తాజాగా ఆంశంపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) స్పందించారు. ఏపీలో మద్యపాన నిషేధాన్ని అమలు చేస్తానన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఇప్పుడు అదే మద్యంపై సంపూర్ణ ఆదాయం సంపాదిస్తున్నారంటూ జనసేన అధినేత సెటైర్లు విసిరారు. సారా బట్టీలు, బ్రాందీ డిస్టరీలు.. అదనపు వేల కోట్ల ఆదాయం కూడా వైఎస్సార్‌సీపీ ప్రభుత్వానికే అంటూ ఆరోపణలు చేశారు. మద్యం రాబడి చూపించి రాష్ట్ర ప్రభుత్వం రూ.8 వేల కోట్ల బాండ్లు అమ్ముతున్నారంటూ నాదెండ్ల మనోహర్ చేసిన ట్వీట్‌ను ట్యాగ్ చేస్తూ పవన్ కల్యాణ్ ట్విటర్‌లో పోస్ట్ చేశారు.
ఆంధ్రప్రదేశ్‌లో మద్య నిషేధం కాదని.. సంపూర్ణంగా మద్యపానం మీదే ఆదాయం సంపాదిస్తామంటూ పవన్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. అంతేగాకుండా ఒక చిన్న గమనిక అంటూ సారా బట్టీలు, బ్రాందీ డిస్టిలరీలు కూడా వారివే.. ఆ అదనపు వేల కోట్ల రూపాయల ఆదాయం కూడా వారికే అంటూ ట్వీట్‌లో జోడించారు. బైబిల్‌లోని సామెతలను ఉదహరిస్తూ.. అబద్ధాలు ఆడేవారు యెహోవాకు నచ్చరని.. మంచి ప్రవర్తనతో మెలిగే వారి ఆయనకు ఇష్టమైన వారంటూ సీఎం జగన్‌ను టార్గెట్ చేస్తూ జనసేనాని ట్వీట్ చేశారు.
అయితే, అంతకు ముందు జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ వైఎస్సార్‌సీపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ ఓ ఇంగ్లిష్ పత్రికలో ప్రచురితమైన ఏపీ లిక్కర్ బాండ్ల పేపర్ క్లిప్పింగ్‌తో విమర్శలు చేశారు. ఆంధ్రప్రదేశ్‌లో మద్య నిషేధం అంటే మద్యం ఆదాయం పెంచడమే అంటూ వ్యగ్యంగా విమర్శించారు. వైఎస్సార్‌సీపీ సంపూర్ణ మద్యపాన నిషేధం పేరుతో అధికారం చేపట్టి.. ఇప్పుడు అదే మద్యం ద్వారా ఆదాయం పెంచుకుంటుందంటూ విమర్శలు చేశారు. గత ప్రభుత్వ హయాంలో రూ.9 వేల కోట్లు ఉన్న ఆదాయాన్ని.. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రూ.22 వేల కోట్లకు పెంచిందని ఆరోపించారు. అదే రాబడిని చూపించి రూ.8 వేల కోట్ల బాండ్లను బజార్లో అమ్మకానికి పెట్టడమే వైఎస్ జగన్ సిర్పిటెడ్ విజనరీ అంటూ ట్వీట్ చేశారు. స్పిరిటెడ్ విజనరీనేనా సీఎం జగన్ మేనిఫెస్టో అంటూ నాదెండ్ల మనోహర్ ఎద్దేవా చేశారు. ఈ డీల్‌తో సీఎం జగన్ జాక్‌పాట్ కొట్టారంటూ ఆయన విమర్శించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Janasena party, Pawan kalyan