Home /News /andhra-pradesh /

AP POLITICS JANASENA CHIEF PAWAN KALYAN READY TO LEAVE BJP FRIENDSHIP DATE ALSO FIX NGS

Janasena-BJP: కటీఫ్ కు వేళాయే..! బీజేపీతో జనసేన బంధం తెంచుకోనుందా..? ముహూర్తం ఫిక్స్..!

పవన్ కల్యాణ్

పవన్ కల్యాణ్

Janasena-BJP: ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి.. రోజుకో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంటోంది.. తాజాగా జనసేన అధినేత పవన్- బీజేపీకి కటీఫ్ చెప్పాలని ఫిక్స్ అయ్యారా..? ముహూర్తం కూడా ఫిక్స్ చేశారా..?

  Janasena-BJP: ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు (Andhra Pradesh Politics) రసవత్తరంగా మారుతున్నాయి. అన్ని ప్రధాన పార్టీలు ఎన్నికల మూడ్ లోనే ఉన్నాయి. అధికార వైసీపీ (YCP) అధినేత.. సీఎం జగన్ మోహన్ రెడ్డి (CM Jagan Mohan Reddy) ప్లీనరీ వేదికగా సమర శంఖం పూరించారు.. టార్గెట్ 175 లక్ష్యం మంటూ యుద్ధం ప్రకటించారు.. నవంబర్ నుంచి బస్సు యాత్రకు సిద్ధమయ్యారు. ఇటు తెలుగు దేశం (Telugu Desam) సైతం ముందస్తు తప్పదంటూ దూకుడుగా వెళ్తోంది. టీడీపీ ఆనవాయితీకి విరుద్ధంగా.. ఇప్పటి నుంచి అభ్యర్థులను కూడా అధినేత ప్రకటించేస్తున్నారు. మరోవైపు జిల్లాల బాట పడుతున్నారు. నారా లోకేష్ (Nara Lokesh) సైతం పాదయాత్రకు సిద్ధమయ్యారు. ఇటు జనసేన (Janasena) అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) .. దసరా నుంచి బస్సు యాత్ర చేపట్టనున్నారు. ఇప్పటికే రూట్ మ్యాప్ సిద్ధం చేశారు. ఇలా అన్ని పార్టీలు ఎన్నికల వ్యూహాలతో ముందుకు వెళ్తున్నాయి. ఇలాంటి సమయంలో ఓ ఆసక్తికర అంశం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది.

  త్వరలోనే బీజేపీతో ఫ్రెండ్ షిప్ కు జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ కటీఫ్ చెబుతారంటూ ప్రచారం జరుగుతోంది. పార్టీ ఆవిర్భావ దినోత్స‌వ స‌భ జ‌రిగిన‌ప్పుడు పొత్తుల‌కు సిద్ధ‌మేన‌ని, వైసీపీని గ‌ద్దె దించ‌డ‌మే ల‌క్ష్య‌మ‌ని, కేంద్రం నుంచి రోడ్‌మ్యాప్ కోసం ఎదురుచూస్తున్నామ‌ని ప్ర‌క‌టించారు. ఇంత‌వ‌ర‌కు కేంద్రం నుంచి ఎటువంటి రోడ్‌మ్యాప్ అంద‌లేదు. కేంద్ర బీజేపీ పెద్ద‌లు ప‌వ‌న్ క‌ల్యాణ్‌కు క‌నీసం అపాయింట్‌మెంట్ ఇవ్వ‌డానికి కూడా నిరాక‌రిస్తుండ‌టం ఆయ‌న్ను మ‌న‌స్తాపానికి గురిచేస్తోంద‌ని జ‌న‌సేన నేత‌ల్లో ప్రచారం జరుగుతోంది.  ముఖ్యంగా రాష్ట్రంలో బలమైన సామాజికవర్గం అండగా ఉన్నప్పటికీ.. రాజ‌కీయ పార్టీని న‌డ‌పాలంటే నిధుల కొర‌త ఎదుర‌వ‌డం స‌హ‌జం. ఈ అంశాన్ని దృష్టిలో ఉంచుకొని.. పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. 2019 ఎన్నిక‌ల త‌ర్వాత ప‌వ‌న్ బీజేపీకి షేక్ హ్యాండ్ ఇచ్చారు. ఏడాదిన్నర పాటు ఈ స్నేహబంధం బలంగానే కనిపించినా.. తరువాత రెండు పార్టీల మధ్య విబేధాలు అంటూ నిత్యం వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా ఏపీ బీజేపీ నేతలతో పవన్ సత్ససంబంధాలు కనిపించడం లేదు. కేవలం కేంద్ర పెద్దలతో టచ్ లో ఉన్నామనే చెబుతూ వచ్చారు. కానీ గత కొంతకాలంగా రెండు పార్టీల వైఖరి చూస్తుంటే.. ఇద్దరి మధ్య పొత్తు చెడిందనే భావన కలగక మానదు.

  ఇదీ చదవండి : వరద నీటినీ వదలరా..? మరీ ఇలా ఉన్నారేంట్రా.. వారు చేసిన పని చూస్తే నోరెళ్లబెట్టాల్సిందే..? వీడియో

  ముఖ్యంగా వైసీపీని గ‌ద్దె దించాల‌నే త‌న ల‌క్ష్యానికి రాష్ట్ర బీజేపీ నేత‌లు సహకరించడం లేదన్నది పవన్ అభిప్రాయం అంటున్నారు. అయితే కొంద‌రు నేత‌లు లోపాయికారీగా అధికార పార్టీకి స‌హ‌క‌రిస్తున్నారంటూ ప‌వ‌న్ బ‌హిరంగంగానే విమ‌ర్శ‌లు చేస్తున్నారు. తిరుప‌తి లోక్‌స‌భ ఉప ఎన్నిక త‌ర్వాత బీజేపీ, జ‌న‌సేన అంటీ ముట్ట‌న‌ట్లుగా వ్యవహరిస్తున్నాయి. దూరంపెరుగుతోందా? అని విలేకరులు అడిగిన ప్రశ్నకు కరోనావల్ల తమ మధ్య 'భౌతిక దూరం' పెరిగిందని, అది తగ్గగానే ఈ దూరం కూడా తగ్గిపోతుందని అన్నారు. అయితే కరోనా తగ్గేదిలేదు.. ఈ దూరం కూడా తగ్గేది లేదు అంటూ సెటైర్లు వేస్తున్నారు రాజకీయ విశ్లేషకులు సైతం.

  ఇదీ చదవండి: భక్తి మార్గం చూపించాల్సిన పూజరి అతడు.. దెయ్యం పేరు చెప్పి వేసే వేషాలు తెలిస్తే.. ఛీ అంటారు

  పేరుకే బీజేపీ, జనసేన మధ్య పొత్తు ఉంది కానీ.. రెండు పార్టీలు కలసి ఉమ్మడి పోరాటం చేయడం లేదు. ఏ కార్యక్రమంలో కలిసి కనిపించడం లేదు. ముఖ్యంగా ప్రధాన సభలకు జనసేన అధినేతకు ఆహ్వానం అందడం లేదు. రాజ‌మండ్రిలో ''గోదావ‌రి గ‌ర్జ‌న'' పేరుతో జ‌రిగిన స‌భ‌కు బీజేపీ జాతీయాధ్య‌క్షుడు జేపీ న‌డ్డా హాజ‌ర‌య్యారు. దీనికి ప‌వ‌న్‌కు ఆహ్వానం అంద‌లేదు. భీమ‌వ‌రంలో ప్ర‌ధాన‌మంత్రి స‌భ జ‌రిగింది. దీనికికూడా ఆహ్వానం అంద‌లేదు. ఫోన్ చేసి చెప్పామ‌ని బీజేపీ నేత‌లు చెబుతున్న‌ప్ప‌టికీ ఇందులో వాస్త‌వ‌మెంతో ఈ రెండు పార్టీల నేత‌ల‌కే తెలియాలి.

  ఇదీ చదవండి : బీచ్‌కి వెళ్తున్నారా.. బిగ్ అలర్ట్.. ఆ బోర్డులు ఉంటే.. అటు వెళ్లకండి..

  ప్రస్తుతం త‌న సినిమాల నుంచి అందే రెమ్యున‌రేష‌న్ నే పార్టీ ఖ‌ర్చుల‌కు ప‌వ‌న్ వినియోగిస్తున్నారు. ఇత‌ర‌త్రా ఎటువైపు నుంచి పార్టీకి నిధులు అందే అవ‌కాశం లేదు. అయినా ప‌ట్టుద‌ల‌తో పార్టీని నడిస్తున్నారు. మరోవైపు అక్టోబ‌రు 5వ తేదీన విజ‌య ద‌శ‌మి సంద‌ర్భంగా రాష్ట్ర‌వ్యాప్తంగా బ‌స్సు యాత్ర‌కు ప‌వ‌న్ క‌ల్య‌ణ్ శ్రీ‌కారం చుట్ట‌బోతున్నారు. అదేరోజు బీజేపీతో త‌మ పార్టీకున్న మిత్ర‌బంధాన్ని తెగ‌తెంపులు చేసుకుంటార‌ని వార్తలు వస్తున్నాయి. దీనిపై జనసేన వర్గాలు మౌనంగా ఉన్నాయి. బస్సు యాత్ర ద్వారా ప్రజలను చైతన్యవంతులను చేయడంతోపాటు వైసీపీవల్ల రాష్ట్రానికి ఎటువంటి నష్టం కలిగిందనే విషయాన్ని కూడా ఆయన ప్రజలకు వివరించబోతున్నారని తెలుస్తోంది.
  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Andhra Pradesh, AP News, Bjp-janasena, Pawan kalyan

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు