హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Pawan Kalyan: వచ్చే ఎన్నికల్లో పవన్ పోటీ చేసేది ఇక్కడ నుంచే..? జనసేనాని ఫిక్స్ అయ్యారా..?

Pawan Kalyan: వచ్చే ఎన్నికల్లో పవన్ పోటీ చేసేది ఇక్కడ నుంచే..? జనసేనాని ఫిక్స్ అయ్యారా..?

పవన్ కళ్యాణ్

పవన్ కళ్యాణ్

Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వచ్చే ఎన్నికల్లో ఎక్కడ నుంచి పోటీ చేస్తారు..? ప్రస్తుతం ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. గత ఎన్నికల్లో పోటీ చేసిన రెండు చోట్లా ఓడిపోయారు..? మరి ఈ సారి ఎలాంటి నిర్ణయం తీసుకోనున్నారు..?

  • News18 Telugu
  • Last Updated :
  • Pithapuram, India

Pawan Kalyan: జనసేన (Janasena) అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) వచ్చే ఎన్నికల్లో ఎక్కడ నుంచి పోటీ చేస్తారు? ఇప్పటికే ఓ సేఫ్ ప్లేస్ ను చూసుకున్నారా..? అది కూడా టీడీపీ (TDP) పొత్తుతో ఈ సారి బరిలో దిగుతున్నారా..? మరి ఆయన పోటీ చేసే నియోజకవర్గం ఏది..? గత ఎన్నికల్లో పోటీ చేసిన గాజవాక (Gajuwaka), భీమవరం (Bheema Varam).. అయితే ఈ సారి ఆ రెండు నియోజకవర్గాలకు బైబై చెప్పేస్తారా..? లేక ఒక నియోజవకవర్గంలో పోటీ చేస్తారా..? జనసైనికులు కోరిక ఏంటి..? పవన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు.. ప్రస్తుతం జనసేన కార్యకర్తల్లో జరుగుతున్న చర్చ ఇదే.. ఈ సారి ఎన్నికల జనసేనకు చాలా ప్రతిష్టాత్మకంగా మారాయి. ఈ సారి కూడా ఓడితే.. పార్టీ ఉనికి ప్రశ్నార్థకం అవుతుంది. అధికారంలోకి రాకపోయినా.. కనీసం కొన్ని సీట్లు నెగ్గినా పరువు నిలుస్తుంది.  ఇతర నేతల సంగతి ఎలా.. వ్యక్తిగతంగా గెలుపు పవన్ కు చాలా అవసరం. ఈ సారి కూడా ఓడితే.. ఇక రాజకీయాలకు పనికిరారనే ముద్ర వేసే ప్రమాదం ఉంది.

అందుకే పవన్ ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఎక్కడా తొందరపడడం లేదు. గతంలో ఆయన గాజువాక, భీమవరం నుంచి భారీ అంచనాల మధ్యే పోటీ చేశారు. కానీ జగన్ ప్రంభజనం.. టీడీపీతో వైరం కారణంగా ఆశించిన ఫలితం రాలేదు. రెండు నియోజకవర్గాల్లోనూ ఓటమి పాలయ్యారు. పోటీ చేసిన రెండు చోట్ల ఓడిపోవడంతో ఇటు పవన్ కళ్యాణ్ , అటు పార్టీ నేతలు దాన్ని ఘోర అవమానంగానే భావించారు.

ఈ సారి అలాంటి పొరపాట్లు జరగకుండా పక్కా ప్లాన్ తో సీటును ఫిక్స్ చేసినట్టు తెలుస్తోంది. గెలుపు తలుపు తెరుచుకునే నియోజకవర్గంపై ఫోకస్ చేసినట్టు సమాచారం. ఇప్పటికే ఆ సీటుకు సంబంధించి., ఇటు జనసైనికులతో.. అటు ఓ ప్రైవేటు ఏజెన్సీతో నివేధికలు తెప్పించుకున్నట్టు సమాచారం.

ఇదీ చదవండి : కార్తీక మాసంలో దర్శించుకోవాల్సిన శివాలయం.. నిమ్మచెట్టునే శివలింగంగా ప్రతిష్టించిన ధర్మరాజు..! ఇంకా ఎన్నో ప్రత్యేకతలు

గతంతో పోల్చుకుంటే క్షేత్ర స్థాయిలో చాలా నియోజకవర్గాల్లో జనసేనకు బలం పెరిగింది. గత ఎన్నికల్లో జగన్ వెంట నడిచిన కాపు ఓటర్లు ఈ సారి.. అధికార పార్టీకి వ్యతిరేకంగా ఉన్నారు. ఈ రెండు అంశాలను పవన్ కు ప్లస్ అవుతాయి. వాటికి తోడు.. ఈ సారి టీడీపీతో పొత్తు ఉండే అవకాశం ఉంది. ఆ ఓట్లు పవన్ కు అదనపు బలం.. దీంతో కచ్చితంగా ఈ సారి గెలుపు అవకాశాలు పెరుగుతాయి. సరైన నియోజకవర్గం ఉంటే చాలు అని.. చాలా జాగ్రత్తలు తీసుకుని.. ప్లేస్ ను ఫిక్స్ చేసినట్టు తెలుస్తోంది.

ఇదీ చదవండి: ఈ కాశీ విశ్వేశ్వరుడ్ని ఒక్కసారి దర్శించుకుంటే సంతాన సమస్యలు తీరినట్టే..? మన రాష్ట్రంలోనే..?

ఇప్పటికే పలు రకాల సర్వేలు చేయించుకున్న పవన్.. తూర్పుగోదావరి జిల్లాలోని పిఠాపురం నుంచి పోటీ చేయాలని ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది. అంతేకాదు గతంలో పీర్పీ తరపున ఇక్కడ గెలుపు రుచి చూపించారు పవన్ అభిమానులు.. 2009లో ప్రజా రాజ్యం తరపున వంగ గీతా టీడీపీ అభ్యర్తిపై విజయం సాధించారు. అలాగే అప్పటి కాంగ్రెస్ నేత ముద్రగడ పద్మనాభం.. టీడీపీ అభ్యర్థి ఎస్విఎస్ఎన్ వర్మ లాంటి కీలక నేతలను వెనక్కు నెట్టి గీత గెలిచారు.

ఇదీ చదవండి: మళ్లీ నిరాశే.. కోడి కత్తి కుటుంబానికి దొరకని సీఎం అపాయింట్ మెంట్.. కారణం అదే..?

2019 ఎన్నికల్లో పరిస్థితి మారింది. భీమవరంలో వైసీపీ అభ్యర్థి దొరబాబుకు 83 వేల 459 ఓట్లు వస్తే.. టీడీపీ అభ్యర్థి వర్మకు 68, 470 ఓట్లు.. జనసేన అభ్యర్తి శేషు కుమారికి 28 వేల 011 ఓట్లు వచ్చాయి. పెద్దగా పేరు లేని శేషు కుమారి పోటీ చేస్తేనే.. అది కూడా వైసీపీ గాలి.. టీడీపీ కూడా బరిలో ఉన్నప్పుడు 28 వేలకు పైగా ఓట్లు వచ్చాయి.

ఇదీ చదవండి: ఏసీబీకి చిక్కిన భారీ అవినీతి తిమింగలం.. శోభన్ బాబు ఇంట్లో భారీగా అక్రమాస్తులు గుర్తింపు

ప్రస్తుత పరిస్థితి చూసుకుంటే.. జనసేన అక్క డ బాగా పుంజుకుంది. వైసీపీ ఎమ్మెల్యే దొరబాబు పై తీవ్ర వ్యతిరేకత ఉంది. దానికి తోడు ప్రభుత్వ వ్యతిరేకత.. జనసేనకు అడ్వాంటేజ్ కానుంది. ఈ సారి జనసేనకు టీడీపీ పొత్తు మరింత అడ్వాంటేజ్ అవుతుంది. ఈ రెండు పార్టీలు కలిస్తే.. ఈజీగా 90 వేలకు పైగా ఓట్ బ్యాంక్ ఉందనే చర్చ జరుగుతోంది. అందులోనూ ఇక్కడ కాపు సామాజిక వర్గం డామినేషన్ ఎక్కువగా ఉంటుంది. ఇలా అన్ని లెక్కలు వేసుకున్న తరువాత ఆయన.. పిఠాపురం నుంచి పోటీ చేసే ఉద్దేశంలో ఉన్నట్టు కనిపిస్తోంది. ఒక వేళ చివరిలో ఆయన మనసు మార్చుకుంటే.. సినిమా ఇండస్ట్రీకే చెందిన కీలక వ్యక్తిని ఇక్కడ నుంచి పోటీ చేయించే అవకాశాలు ఉన్నాయని జనసేన వర్గాల్లో చర్చ జరుగుతోంది.

First published:

Tags: Andhra Pradesh, AP News, East Godavari Dist, Janasena, Pawan kalyan

ఉత్తమ కథలు