Home /News /andhra-pradesh /

AP POLITICS JANASENA CHIEF PAWAN KALYAN ONCE AGAIN QUOTE INTERESTING TWEET WHO WILL HIS TARGET NGS GNT

Pawan Kalyan: శత్రువులు కూడా మనల్ని వాడుకోగలిగేంత మూర్ఖత్వం మనది.. పవన్ మరో ఆసక్తికర ట్వీట్..? ఎవరిని ఉద్దేశించి

పవన్ కల్యాణ్ (ఫైర్)

పవన్ కల్యాణ్ (ఫైర్)

Pawan Kalyan: శత్రువులు కూడా మనల్ని వాడుకోగలిగినంత మూర్ఖత్వం మనది అంటూ పవన్ మరో ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. అయితే ఆ ట్వీట్ పవన్ ఎవర్ని ఉద్దేశించి చేశారు అన్నది రాజకీయ పార్టీల్లో చర్చగా మారింది. అధికార పార్గీని ఉద్దేశించి ఆ ట్వీట్ ఉందా..? లేకపోతే మిత్ర పక్షం బీజేపీని కోట్ చేశారా..? లేదంటే పొత్తు కోసం పిలుపు ఇచ్చిన చంద్రబాబును ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారా అంటూ ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది.

ఇంకా చదవండి ...
    Pawan Kalyan Latest Tweet:  జనసేన (Janasean) అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan).. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు. ప్రజల పక్షాన నిలిచేందుకు ప్రభుత్వాలు చేసిన తప్పులను సోషల్ మీడియా (Social Media) ద్వారా ప్రశ్నిస్తుంటారు. అంతేకాదు తన భావాలను సూటిగా సుత్తి లేకుండా సోషల్ మీడియా ద్వారా అందరికీ తెలిసేలా చేస్తుంటారు. అంతేకాదు.. ఆయనకు పుస్తకాలు చదవడం అంటే చాలా ఇష్టం.. ఇప్పటికే ఎన్నో పుస్తకాలు చదివారు.. చదువుతూనే ఉంటారు. తెలుగు, ఇంగ్లీష్ సాహిత్యాలు, ప్రపంచ, సామాజిక జ్ఞానానికి సంబంధించిన అనేక విషయాలపై ఆయనకు గట్టి పట్టుంది. అలా ఆయన చదవిన పుస్తకాల నుంచి.. లేదా ఏదైనా గొప్ప వ్యక్తి చేసిన వ్యాఖ్యలను గుర్తు చేసుకుంటూ.. ట్వీట్ల రూపంలో పెడతారు. తాజాగా తన ట్విట్టర్ ఖాతాలో మరో ఆసక్తికరమైన కొటేషన్లను పంచుకున్నారు. ఆ కొటేషన్లు ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో (AP Politics) హాట్ టాపిక్ గా మారాయి. శత్రవు అంటూ రాసుకొచ్చారు కాబట్టి అధికార పార్టీ వైసీపీ (YCP)ని ఉద్దేశించి ట్వీట్ చేశారా..? లేద మిత్రపక్షంగా ఉంటూ ఆయన్ను వాడుకుంటున్న బీజేపీ (BJP)ని ఉద్దేశించి ఇలా ట్వీట్ చేశారా..? లేక గతంలో పొత్తు పెట్టుకొని తరువాత పక్కన పెట్టి.. ఇప్పుడు పొత్తులకు పిలుపు ఇచ్చిన చంద్రబాబు (Chandrababu) గురించి ఈ పోస్ట్ చేశారా అంటూ రాజకీయ విశ్లేషకులు చర్చలు సైతం మొదలబెట్టారు.

    ఆయన ట్వీట్ చూస్తే.. సోషలిస్టు దిగ్గజం రామ్ మనోహర్ లోహియా సిద్ధాంతాలను ప్రతిబింబించేలా ఉన్న ఓ కొటేషన్ ను పేర్కొన్నారు. శత్రువులు కూడా మనల్ని వాడుకోగలిగినంత మూర్ఖత్వం మనది. అవతలివాడు మనల్ని వాడుకోవడమే మన విజయం అని భ్రమ పడేంత అమాయకత్వం కూడా మనదే" అనే కొటేషన్ ను ట్వీట్ చేశారు. బీసీ, ఎస్సీలు అధికారంలోకి రావాల్సిన అవశ్యకతపై రామ్ మనోహర్ లోహియా ఆలోచనా విధానాన్ని ప్రతిఫలించేలా రచయిత వాకాడ శ్రీనివాస్ ఈ వ్యాఖ్యలు చేశారని పవన్ వివరించారు. అయితే ఇప్పుడు ఈ వ్యాఖ్యలు పవన్ ఎందుకు చేశారన్నదే హాట్ టాపిక్ గా మారింది. మంచి కోట్ అని పెట్టారా.. ఈ వ్యాఖ్యల వెనుక రాజకీయ కారణాలు ఏమైనా ఉన్నాయని జనసైనికులు సైతం ఆలోచిస్తున్నారు.



    గతంలోనూ ఇదే తరహా కొటేష్లను పవన్ షేర్ చేశారు.. వాకడ శ్రీనివాస్ కొటేషన్లను గుర్తుచేస్తూ ట్వీట్లు చేస్తున్నారు. తనకు ఇష్టమైన కొటేషన్లలో ఒకటిగా చెబుతూ.. "ఎర" ను ఆహారం అనుకుని ఆశపడే స్థితిలో ఉన్న ప్రతిజాతి వేటగాళ్లకు చిక్కుతూనే ఉంటుంది అంటూ పవన్ ట్వీట్ చేశారు..



    అయితే ప్రస్తుతం పవన్ వ్యాఖ్యలు చూస్తు.. అధికార పార్టీని ఉద్దేశించే చేసేవే అంటున్నారు జనసైనికులు.. వైసీపీ ప్రభుత్వం సంక్షేమ పథకాల పేరుతో ఇచ్చే నగదును ఎరగా చెప్పారని.. ఇప్పుడు తాజా ట్వీట్ కూడా వైసీని ఉద్దేశించిందే అంటున్నారు. కులాల, ఆయా సంఘాల నేతలను ప్రభుత్వం వాడుకుటుంటోందని.. అదే ఉద్దేశంలో ఆయన తాజా ట్వీట్ చేశారు అని జనసైనికులు అభిప్రాయపడుతున్నారు.
    Published by:Nagabushan Paina
    First published:

    Tags: Andhra Pradesh, AP News, Janasena, Pawan kalyan

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు