Home /News /andhra-pradesh /

AP POLITICS JANASENA CHIEF PAWAN KALYAN ONCE AGAIN HE WILL CONTEST BHEEMAVARAM NGS

Pawan Kalyan: పవన్ పోయిన చోటే వెతుక్కుంటున్నారా..? మరోసారి అక్కడ నుంచి బరిలోకి దిగాలని ఫిక్స్ అయ్యారా..?

పవన్ కల్యాణ్

పవన్ కల్యాణ్

Pawan Kalyan: సాధారణంగా రాజకీయ నాయకులు సెంటిమెంట్లు ఎక్కువ ఫాలో అవుతారు.. ఒక్కసారి కలిసిరాలేదు అంటే.. మళ్లీ అటువైపు కన్నెత్తు కూడా చూడరు.. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం పోయినచోటే వెతుక్కోవాలి అనుకుంటున్నారా.. వచ్చే ఎన్నికల్లోనూ అక్కడి నుంచే పోటీ చేయాలని ఫిక్స్ అయ్యారా..?

ఇంకా చదవండి ...
  Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో రాజకీయం రసవత్తరంగా సాగుతోంది. అప్పుడే ఎన్నికల హీట్ కొనసాగుతోంది. అన్ని ప్రధాన పార్టీలు ఎన్నికల మూడ్ లోనే ఉన్నాయి.. ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయి అన్నదానిపై స్పష్టమైన సంకేతాలు లేకున్నా.. అంతా ముందస్తు ఉంటుందనే అంచనాలో ఉన్నారు. అందుకే అప్పుడే సీట్లపైనా కసరత్తు జరుగుతోంది. ఎవరు ఎక్కడ పోటీ చేయాలి అన్నదానిపై ఎవరి లెక్కలు వారు వేసుకుంటున్నారు. ఇక జనసేన (Janasena) అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఈ సారి ఎక్కడ పోటీ చేస్తారు అన్నది ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే గత ఎన్నికల్లో ఆయన రెండు చోట్ల పోటీ చేశారు. గాజువాక (Gajuwaka), భీమవరం (Bheemavaram) నియోజక వర్గాల నుంచి తన లక్ ను పరిశీలించుకున్నారు. కానీ ఆ రెండు చోట్లా పవన్ కు ఓటమి తప్పలేదు. తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టి అధ్యక్షా అనాలి అనుకున్న ఆయన కోరికకు బ్రేక్ లు పడ్డాయి. ఎన్నికల్లో అధినేత పోటీ చేసిన రెండు చోట్ల ఓడిపోవడం.. రాష్ట్ర వ్యప్తంగా జనసేన కేవలం ఒక్కటంటే ఒక్క సీటు నెగ్డింది.. దీంతో జనసేన పరువు పోయినట్టు అయ్యింది.. దీంతో ఈ సారి ఆ రెండు నియోజకవర్గాలకు పవన్ దూరంగా ఉంటారని.. వచ్చే ఎన్నికల్లో ఎక్కడ నుంచి పోటీ చేయాలి అన్నదానిపై ఆయన ఇప్పటికే ఆయన నిర్ణయం తీసుకున్నారని.. ఆధ్యాత్మిక సిటీ తిరుపతి నుంచి పోటీ చేస్తారంటూ ఓ ప్రచారం ఉంది.

  తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. ఆయన పోయినచోటే వెతుక్కోవాలని చూస్తున్నట్టు టాక్. అందుకే ఆ నియోజకవర్గంపై మళ్లీ ఫోకస్‌ పెడుతున్నారని ప్రచారం జరుగుతోంది. మరోసారి బరిలో దిగుతారా.. లేదంటే ఆయన అక్కడ పోటీ చేయకపోయినా పార్టీని బలోపేతం చేయాలి అనుకుంటున్నారా..? వేరే కొత్త వ్యూహం ఏదైనా ఉందా..? ఆయన భీమవరంపై ఎందుకు ఫోకస్ చేస్తున్నారు.  2019 అసెంబ్లీ ఎన్నికల్లో అందరి దృష్టినీ ఆకర్షించిన నియోజకవర్గాల్లో భీమవరం ఒకటి. ఎందుకంటే ఇక్కడ నుంచి జనసేన చీఫ్‌ పవన్‌ కల్యాణ్‌ పోటీ చేయడంతో అందరిలో ఆసక్తి పెరిగింది. అవే ఎన్నికల్లో గాజువాక నుంచి కూడా పవన్‌ కల్యాణ్‌ బరిలో ఉన్నప్పటికీ.. ఎక్కువ చర్చ జరిగింది భీమవరం పైనే. జనసేనాని భీమవరం, గాజువాక రెండు చోట్లా ఓడిపోయారు. ఓటమికి దారితీసిన పరిస్థితులు ఎలా ఉన్నా.. భీమవరంలో పవన్‌ కల్యాణ్‌ నెగ్గుకు రాలేకపోవడం ఇప్పటికీ హాట్ టాపిక్కే.

  ఇదీ చదవండి : హస్తినలో జగన్ బలం పెరుగుతోందా? తాజా పరిస్థితులతో రాష్ట్రంలో మారుతున్న లెక్కలు

  ఎందుకంటే ఆ ఎన్నికలకు ముందు నుంచీ భీమవరంలో జనసేన ప్రత్యేకంగా వర్కవుట్ చేసినా.. కలిసిరాలేదు. వచ్చే ఎన్నికల్లో పవన్‌ కల్యాణ్ పోటీ చేసే అసెంబ్లీ స్థానాలపై రకరకాలుగా ప్రచారం జరుగుతోంది. చాలా నియోజకవర్గాలు చర్చల్లో ఉన్నాయి. అయితే పోయినచోటే వెతుక్కోవాలనే లెక్కలో ఏమో.. భీమవరం నుంచి మరోసారి జనసేనాని బరిలో దిగుతారనే ఆశలు పార్టీ శ్రేణుల్లో ఉన్నాయట. అందుకు కారణం కూడా లేకపోలేదు.. తాజాగా పవన్ తీసుకున్న నిర్ణయంతో ఆ చర్చ జరుగుతోంది. జనవాణి-జనసేన భరోసా పేరుతో ప్రజల సమస్యలు తెలుసుకుంటున్న పవన్‌ కల్యాణ్‌.. త్వరలో భీమవరంలోనూ ఆ ప్రొగ్రామ్‌ నిర్వహించబోతున్నారు. చాలారోజుల తర్వాత పవన్‌ భీమవరం వస్తుండటంతో.. అక్కడ పార్టీ శ్రేణులు ఆయన కోసం ఎదురు చూస్తున్నాయి.

  ఇదీ చదవండి : భారీ వానలు.. వరదలతో బీ అలర్ట్.. తప్పక ఈ జాగ్రత్తలు పాటించాల్సిందే..

  ఇక భీమవరం వైసీపీలో లుకలుకలు ఉన్నాయని.. అవి అధికారపార్టీకి ఇబ్బందిగా మారతాయని అంచనా వేస్తున్నారట స్థానిక జనసేన నేతలు. పవన్‌ కల్యాణ్‌పై గెలిచిన గ్రంధి శ్రీనివాస్‌ మంత్రి పదవి ఆశించి భంగపడ్డారని.. అప్పటి నుంచి ఆయనతోపాటు.. అనుచరులు అసంతృప్తితో ఉన్నట్టు లెక్కలేస్తున్నారట. ఇటీవల అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణకు ప్రధాని మోడీ రావడంతో.. పవన్‌ కల్యాణ్‌ కూడా వస్తారని అనుకున్నారు. కానీ ఆయన రాలేదు. అదే కార్యక్రమంలో లోకల్ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్‌కు సైతం సరైన ప్రాధాన్యం దక్కలేదనే చర్చ జరుగుతోంది. అందుకే ఈ సమయంలో పవన్‌ కల్యాణ్‌ భీమవరం పర్యటన రాజకీయంగా వేడి రగిలిస్తుందని జనసైనికులు అభిప్రాయపడుతున్నారు.
  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Andhra Pradesh, AP News, Janasena, Powe star pawan kalyan

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు