Home /News /andhra-pradesh /

AP POLITICS JANASENA CHIEF PAWAN KALYAN ON KONASEEMA FIRE INCIDENT HE BLAME TO AP GOVERNMENT NGS

Pawan on Amalapuram: కోనసీమలో హింసకు ప్రభుత్వామే కారణం.. ఉద్రిక్తతలపై పవన్? ఆయన ఏమన్నారంటే?

కోనసీమ హింసకు ప్రభుత్వానిదే బాధ్యత అన్న పవన్

కోనసీమ హింసకు ప్రభుత్వానిదే బాధ్యత అన్న పవన్

Pawan on Amalapuram: అమలాపురంలో హింసాత్మక ఘటనలకు కారణం ఎవరు..? సాధారణ ఆందోళనలు హింసాత్మకంగా ఎందుకు మారాయి..? జిల్లా పేరు మార్పు కోసం ఎందుకు ఇంత ఉద్రిక్త పరిస్థితులకు కారణం అయ్యింది. తాజాగా పరిస్థితులపై జనసేన అధినేత పవన్ స్పందించారు. ఆయన ఏమన్నారంటే..?

ఇంకా చదవండి ...
    Pawan on Amalapuram: ఒక్కసారిగా అమలాపురం (Amalapuram) భగ్గుమందు.. ఉదయం మొదలైన ఆందోళనలు.. సాయంత్రం హింసాత్మకంగా మారాయి. అమలాపురం జిల్లాకు కోనసీమ జిల్లా (Konaseema District) పేరుపెట్టాలంటూ గత కొన్నిరోజులుగా ప్రజల నుంచి డిమాండ్ వినిపిస్తుంది. అక్కడక్కడా కొందరు ప్రజాసంఘాల నేతలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు కూడా చేశారు. అయితే ఆందోళనలు కాస్త ఉద్రిక్తంగా మారే అవకాశం ఉందని భావించిన పోలీసులు 144 సెక్షన్ పెట్టారు. ఎప్పటికప్పుడు పరిస్థితి సమీక్షిస్తూ వచ్చారు.. కానీ పరిస్థితి చేయిదాటి పోతుందని అంచనా వేయలేకపోయారు. ఉదయం నుంచి నిరసనలు చేపట్టిన ఆందోళనలకు ర్యాలీలకు ప్రయత్నించారు. అయితే అనుమతి లేదు అంటూ పోలీసులు అడ్డుకోవడంతో.. పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పోలీసుల తీరును నిరసిస్తూ. ఒక్కసారిగా నిరసనకారులు రెచ్చిపోయారు. పోలీసులపై ఆందోళనకారులు దాడికి పాల్పడ్డారు. మంత్రి విశ్వరూప్ ఇంటికి నిప్పు పెట్టారు.

    ప్రైవేటు బస్సుకు నిప్పు పెట్టి..పోలీసు వాహనాలపై రాళ్ల దాడి చేశారు. ఈఘటనలో స్థానిక డీఎస్పీ సొమ్మసిల్లి పడిపోగా ఎస్పీకి, ఇతర పోలీసు సిబ్బందికీ గాయాలు అయ్యాయి. దీంతో పోలీసులు లాఠీ ఛార్జ్ ప్రయోగించగా అమలాపురంలో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు తలెత్తాయి. అమలాపురాన్ని చుట్టుముట్టిన 10 వేల మంది ఆందోళనకారులు..మంత్రి విశ్వరూప్ కార్యాలయంపై దాడికి పాల్పడి నిప్పంటించారు. అక్కడితోనే ఆగలేదు. అమలాపురంలో మంత్రి, ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులకు, మూడు బస్సులకు ఆందోళన కారులు నిప్పు పెట్టారు.

    ఈ హింసాత్మక ఘటనలపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. అమలాపురంలో నెలకొన్న ఉద్రిక్త వాతావరణాన్ని ప్రజాస్వామ్యవాదులు అందరూ ముక్త కంఠంతో ఖండించాలని పిలుపు ఇచ్చారు. ఆందోళనలు చేయడం తప్పుకాదని.. అయితే ప్రజలందరూ సంయమనం పాటించాలని, శాంతియుత పరిస్థితులు నెలకొనేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు.

    అలాగే బాబాసాహెబ్ అంబేడ్కర్ అంటే ప్రజాస్వామ్యంపై విశ్వాసం ఉన్న ప్రతి ఒక్కరికీ గౌరవ భావమే ఉంటుందని అభిప్రాయపడ్డారు. ఆయన పేరును ఇలా వివాదాలకు కేంద్ర బిందువుగా మార్చడం చాలా ఆవేదన కలిగిస్తోంది అన్నారు. ఆ మహనీయుని పేరుని వివాదాల్లోకి తీసుకువచ్చినందుకు రాష్ట్ర ప్రభుత్వమే బాధ్యత వహించాలని పవన్ కళ్యాన్ (Pawan Kalyan) డిమాండ్ చేశారు. అమలాపురంలో శాంతిభద్రతలను పరిరక్షించడంలో, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంలో పాలక వర్గం విఫలమైందని మండిపడ్డారు. 

    ప్రభుత్వం తన తప్పులను, పాలనపరమైన లోపాలను కప్పి పుచ్చుకోవడానికి ఇలా లేని సమస్యలను సృష్టించడం దారుణమని మండిపడ్డారు. ప్రభుత్వ వైఫల్యాన్ని పార్టీలకు ఆపాదిస్తున్నారని పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఉద్రిక్త పరిస్థితులకు బీజం వేసింది ఎవరనేది జిల్లా వాసులకే కాదు రాష్ట్ర ప్రజలందరికీ తెలుసన్నారు పవన్. బాధ్యత కలిగిన పదవిలో ఉన్న హోమ్ శాఖ మంత్రి ఘటనపై ప్రకటన చేస్తూ జనసేన  (Janasena)పేరు ప్రస్తావించడాన్ని ఆయన్ని తీవ్రంగా ఖండించారు. వైసీపీ ప్రభుత్వ లోపాలను, శాంతి భద్రతల పరిరక్షణలో అసమర్ధతను, పరిపాలనలో పార్టీ వైఫల్యాలను జనసేనపై రుద్దకండంటూ పవన్ అధికార పార్టీపై నిప్పులు చెరిగారు.
    Published by:Nagabushan Paina
    First published:

    Tags: Andhra Pradesh, AP News, East godavari, Janasena, Pawan kalyan

    తదుపరి వార్తలు