Jagan-Pawan: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో రాజకీయం రచ్చ రచ్చ అవుతోంది. అధికార, విపక్షాల మధ్య మాటల తూటాలు పీక్ కు చేరాయి. ముఖ్యంగా అధికార వైసీపీ (YCP) వర్సెస్ జనసేన (Janasena) గా పోరు హీటెక్కింది.. రెండు పార్టీలు ఢీ అంటే ఢీ అంటూ విమర్శలు.. ప్రతి విమర్శలతో ఎన్నికల యుద్ధమే కనిపిస్తోంది. అయితే ఇప్పుడు తాజాగా పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఇచ్చిన పిలుపు.. ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే.. గత ఎన్నికల్లో వైసీపీ ఘన విజయం సాధించడానికి.. సీఎంగా జగన్ ప్రభంజనం కొనసాగడానికి ప్రధాన కారణం ఒక్కఛాన్స్ నినాదాం.. ఆ నినాదమే ఏపీ వ్యాప్తంగా జగన్ గాలి వీచేలా చేసింది. ఈ విషయాన్ని ఎవరైనా ఒప్పుకోవాల్సిందే..
అంతలా ప్రభావం చూపించింది ఒక్క ఛాన్స్ అనే పిలుపు.. వైసీపీ నేతలు, మంత్రులు సైతం.. ఒక్క ఛాన్స్ అన్న నినాదమే ఈ స్థాయి విజయాన్ని అందించింది అన్న విషయం నమ్ముతారు అనడం సందేహం లేదు. అయితే ఈ నినాదం జగన్ కు పేటెంట్ గా మారింది. అందుకు ఈ నినాదం ఎక్కడ విన్నా ముందుగా గుర్తుకు వచ్చేది జగన్ మాత్రమే.. కానీ ఇప్పుడు జనసేన సైతం అదే నినాదం అందుకోవడం సంచలనంగా మారింది.
ఇటీవల మాట్లాడిన జనసేన అధినేత పవన్ ‘ఒక్క చాన్స్’ అంటూ జగన్ నినాదాన్ని ఫాలో అయ్యారు. జనసేనకు ఒక చాన్సివ్వాలని ఆయన కోరారు. అవినీతిలేని సుపరిపాలన అందిస్తామని చెబుతున్నారు. అయితే అప్పట్లో జగన్ లా.. పవన్ భారీ హామీలు ఇవ్వడం లేదు. పారదర్శకంగా, వాస్తవానికి దగ్గరగానే మాట్లాడుతున్నారు. వ్యవస్థలో లోపాలు సరిదిద్దడం, పాడైన ఏపీ భవిష్యత్ ను గాడిలో పెట్టడం, నిరుద్యోగం నిర్మూలన, సాగు ప్రోత్సాహం, అన్నివర్గాల జీవన ప్రమాణాలు పెంచడం వంటి వాస్తవిక హామీలను ఇస్తూ.. తనకు ఒక్క ఛాన్స్ ఇవ్వాలని ప్రజలను కోరుతున్నారు.
ఇదీ చదవండి : రాష్ట్రంలో సైకిల్ గాలి వీస్తోంది.. ఏపీకి పట్టిన శని జగన్ అంటూ చంద్రబాబు ఫైర్
ఆ ఒక్క ఛాన్స్ అనే నినాదం వైసీపీని అందళం ఎక్కించింది. ఇప్పుడు జగన్ నినాదాన్ని పవన్ కాపీ కొట్టారని వైసీపీ అభిమానులు.. సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తూ.. పవన్ ను ట్రోల్ చేస్తున్నారు. అయితే కొందరు మాత్రం మనసులో మదన పడుతున్నారు. గత ఎన్నికల్లో తమ విజయానికి కారణమైన స్లోగన్.. ఇప్పుడు పవన్ కు కలిసి వస్తే పరిస్థితి ఏంటని ఆందోళన చెందుతున్నారు. పవన్ ఒక్కఛాన్స్ పేరుతో ప్రజల్లోకి వెళ్లేందుకు సిద్ధమై పోయారు.. ఇప్పటికే ఆ విషయాన్ని ఆయన స్పష్టం చేశారు.
ఇదీ చదవండి : 100 కి ఫిర్యాదు వచ్చిందని వెళ్లిన ఎస్సైకు షాకింగ్ ఘటన.. ఏం జరిగింది అంటే?
ఇటు అధికార వైసీపీ.. ఇంతకంటే సుపరిపాలన ఎక్కడా లేదని చెప్పాలని ఎమ్మెల్యేలు, మంత్రులను గడప గపడకు పంపుతున్నారు సీఎం జగన్ . తమకు సెకెండ్ ఛాన్స్ ఇవ్వాలి అది కూడా.. వై నాట్ 175 నినాదంతో ప్రజల్లోకి వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ రెండు నినాదాలను ప్రజలు ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి.. జగన్ కు కలిసి వచ్చిన ఒక్క ఛాన్స్ నినాదం.. పవన్ ఎంత వరకు హెల్ప్ చేస్తుందో చూడాలి..
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Ap cm jagan, AP News, AP Politics, Janasena party, Pawan kalyan