హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Pawan on Jagan: సీబీఐకి దత్తపుత్రుడు.. చర్లపల్లి షటిల్ టీమ్..! జగన్ కు పవన్ స్ట్రాంగ్ కౌంటర్..

Pawan on Jagan: సీబీఐకి దత్తపుత్రుడు.. చర్లపల్లి షటిల్ టీమ్..! జగన్ కు పవన్ స్ట్రాంగ్ కౌంటర్..

పవన్ కల్యాణ్, వైఎస్ జగన్ (ఫైల్)

పవన్ కల్యాణ్, వైఎస్ జగన్ (ఫైల్)

సీఎం జగన్ (CM YS Jagan) తనపై చేస్తున్న విమర్శలకు జనసేన (Janasena)అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ముఖ్యంగా తనను చంద్రబాబు (Chandrababu) దత్తపుత్రుడు అంటూ చేసిన విమర్శలపై మండిపడ్డారు.

  సీఎం జగన్ (CM YS Jagan) తనపై చేస్తున్న విమర్శలకు జనసేన (Janasena)అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ముఖ్యంగా తనను చంద్రబాబు (Chandrababu) దత్తపుత్రుడు అంటూ చేసిన విమర్శలపై మండిపడ్డారు. తనను సీబీఎన్‌ దత్తపుత్రుడంటే.. జగన్‌ను సీబీఐ దత్తపుత్రుడని అంటామని హెచ్చరించారు. వైసీపీ కీలక నేతలను సీబీఐ దత్తత తీసుకునే రోజులు చాలా దగ్గర్లోనే ఉందని పవన్ అన్నారు. అంతేకాదు జనసేనను టీడీపీ బి-టీమ్‌ అంటే.. వైసీపీని చర్లపల్లి జైలు షటిల్‌ టీమ్‌ అనాల్సి ఉంటుందని హెచ్చరించారు. వైసీపీ నేతలకంటే ఎక్కువ తిట్లు తనకూ వచ్చని.. 16 నెలలు జైల్లో కూర్చొని వచ్చిన మీరా మాకు నీతులు చెప్పేదని సెటైర్లు వేశారు. వైసీపీ నేతలు సర్దార్ వల్లభాయ్ పటేల్, నేతాజీ సుభాష్ చంద్రబోస్ మాదిరి స్వాతంత్ర్యం కోసం జైలుకెళ్లిన వారిలా మాట్లాడుతుంటారని విమర్సించారు.

  ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతుల బిడ్డల చదువుల కోసం సంక్షేమ నిధి ఏర్పాటు చేస్తామన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత కాదని.. తక్షణమే పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్నట్లు పవన్ ప్రకటించారు. అందుకోసం సగం నిధులను తానే స్వయంగా సమకూరుస్తానని.. మిగిలినవి పార్టీ నేతలు ఇస్తున్నారన్నారు. రాష్ట్రంలో కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే వైసీపీ ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. కానీ జనసేన మాత్రం రైతుల కష్టాలను.. ఆత్మహత్యల గురించి స్పందించి అండగా నిలుస్తోందన్నారు. జనసేన అధికారంలోకి వస్తే అద్భుతాలు చేస్తామని చెప్పముగానీ.., రైతుల సమస్యలు పరిష్కరిస్తామని పవన్ హామీ ఇచ్చారు. తాను సినిమాలు చేసుకుంటూ సుఖంగా ఉండొచ్చని కానీ.. సాటి మనుషుల కష్టాలు చూడలేకే రాజకీయాల్లోకి వచ్చినట్లు పవన్ కల్యాణ్ తెలిపారు. పోలీసులను కూడా వైసీపీ నేతలు సొంత అవసరాలకు ప్రయోగిస్తున్నారని ఆయన విమర్శించారు.

  ఇది చదవండి: రాసిపెట్టుకోండి.. చరిత్ర తిరగరాస్తా.. స్పీకర్ తమ్మినేని సంచలన వ్యాఖ్యలు..


  గిట్టుబాటు ధర లేక రైతులు బాధలు పడి అప్పుల పాలవుతున్నారని వారి కష్టాన్ని కళ్లారా చూశానన్నారు. మరోదారి లేకనే రైతులు ఆత్మహత్యలు తేసుకుంటున్నారని పవన్ అన్నారు. ఆత్మహత్య చేసుకున్న ప్రతి రైతు కుటుంబానికి రూ.7లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రతి రైతుకు న్యాయం జరిగేవరకు జనసేన పోరాడుతుందని పవన్ స్పష్టం చేశారు.

  ఇది చదవండి: కేబినెట్ ఏర్పాటు తర్వాత జగన్ తొలి రివ్యూ ఆమెతోనే.. విడదల రజినీ లక్కీ ఛాన్స్..


  మంగళవారం ఉమ్మడి అనంతపురం జిల్లాలో పర్యటించిన పవన్.. కొత్తచెరువు, గొట్లూరు, పూలకుంట, బత్తలపల్లి, ధర్మవరం, మన్నెలి గ్రామాల్లో ఆత్మహత్యలకు పాల్పడిన కౌలు రైతుల కుటుంబాలను పరామర్శించి.. వారికి రూ.లక్ష చొప్పున పరిహారం అందించారు. రాష్ట్రవ్యాప్తంగా ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతుల వివరాలను సమాచార హక్కు చట్టం ద్వారా సేకరించిన జనసేన పార్టీ.. అందులోని వివరాల మేరకు ఆర్ధిక సాయం అందిస్తున్నట్లు తెలిపింది.

  Published by:Purna Chandra
  First published:

  Tags: Andhra Pradesh, Ap cm ys jagan mohan reddy, Pawan kalyan

  ఉత్తమ కథలు