హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Pawan Speech: 2024లో అదే మన టార్గెట్..! వైసీపీది వింత ప్రతిజ్ఞ.. పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు..

Pawan Speech: 2024లో అదే మన టార్గెట్..! వైసీపీది వింత ప్రతిజ్ఞ.. పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు..

జనసేన ఆవిర్భావ సభలో పవన్ కల్యాణ్

జనసేన ఆవిర్భావ సభలో పవన్ కల్యాణ్

విధ్వంసమనే ప్రతిజ్ఞ చేసిన తర్వాతే వైసీపీ నేతలు రాజకీయం చేస్తున్నారని జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Janasena Chief Pawan Kalyan) అన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరి సమీపంలోని ఇప్పటం గ్రామంలో జరిగిన జనసేన 9వ ఆవిర్భావ సభ (Janasena Formation Day) లో ఆయన ప్రసంగించారు.

ఇంకా చదవండి ...

  విధ్వంసమనే ప్రతిజ్ఞ చేసిన తర్వాతే వైసీపీ నేతలు రాజకీయం చేస్తున్నారని జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Janasena Chief Pawan Kalyan) అన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరి సమీపంలోని ఇప్పటం గ్రామంలో జరిగిన జనసేన 9వ ఆవిర్భావ సభ (Janasena Formation Day) లో ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని అన్ని పార్టీల నేతలకు, కార్యకర్తలకు పవన్ నమస్కరించారు. తన సంస్కారం వైసీపీ వారికి కూడా నమస్కారం పెట్టమంటోందంటూ వైసీపీ నేతలకు కూడా పవన్ నమస్కరించారు. ఈ రోజున రాజకీయాలపై పట్టుసాధించానంటే.. పాలసీలపై మాట్లాడగలుగుతున్నానంటే దానికి కారణం తన అన్న నాగబాబు అని పవన్ గుర్తుచేశారు. గతంలో నాగబాబు ఇచ్చిన పుస్తకం నాకు బైబిల్ లాంటిదన్నారు. గెలిచినా ఓడినా నా ప్రయాణం జనసేనతోనే అని చెప్పిన నాదెండ్ల మనోహర్ కు కృతజ్ఞతలు తెలిపారు.

  మనం ప్రేమించే వ్యక్తిపై అభిమానం, ప్రేమ ఇతరులకు ఇబ్బంది కలిగించకూడదు. తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులను ఇబ్బంది పెట్టకూడదని.., ఆ ప్రేమ దేశం వైపు, సమాజం వైపు మళ్లించాలంటూ అభిమానులు, కార్యకర్తలకు పవన్ పిలుపునిచ్చారు. రాష్ట్రం బాగుండాలి.. చీకట్లోకి వెళ్లకూడదంటే ఆ బాధ్యత జనసేన క్రియాశీలక కార్యకర్తల చేతుల్లో ఉందన్నారు. నేను నడిచి చూపిస్తా.. మీరు నడవండి అని పవన్ పిలుపునిచ్చారు.

  ఇది చదవండి: గౌతమ్ రెడ్డి శాఖలు ఆ మంత్రికి అప్పగింత.. సీఎం జగన్ కీలక నిర్ణయం..


  పార్టీని నడపాలంటే వేలకోట్లు అవసరం లేదన్న పవన్.. సైద్దాంతిక బలం ఉంటే చాలని చెప్పారు. ఆరుగురు ప్రధాన కార్యదర్శులు, 150 మంది కార్యకర్తలతో 2014లో పార్టీని ప్రారంభించామని.., ఈ రోజున 3లక్షల 26వేల క్రియాశీలక కార్యకర్తలున్నారని పవన్ అన్నారు. 2019 ఎన్నికల్లో 7.24 శాతం ఓటింగ్ వస్తే.. గత ఏడాది జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో 27 శాతానికి పైగా ఓటింగ్ సాధించామన్నారు. ఈ రోజు పార్టీ సభ్యత్వం 46 లక్షలకు చేరిందన్నారు.

  ఇది చదవండి: కల్తీమద్యంపై సీఎం కీలక ప్రకటన.. జంగారెడ్డిగూడెం ఇష్యూలో క్లారిటీ


  ప్రశ్నించడం అంటే సరికొత్త రాజ్యస్థాపన చేసి సుపరిపాలన అందించడమేనని ఆయన అన్నారు. వ్యక్తిగత ప్రయోజనాలకు కార్యకర్తలను అడ్డుగా పెట్టనన్నారు. 2014లో ప్రశ్నించి ప్రభుత్వాన్ని ఎదుర్కొన్నానం.. 2019 గట్టిగా నిలబడ్డాం.. 2024లో ప్రజాప్రభుత్వాన్ని స్థాపిస్తామని పవన్ కల్యాణ్ ధీమా వ్యక్తం చేశారు.

  ఇది చదవండి: వందేళ్ల రికార్డులు తిరగరాస్తున్న జగన్ సర్కార్.. ఆ కార్యక్రమంలో దేశంలోనే టాప్..


  నేను రెండుచోట్ల ఓడిపోయి కూర్చున్నప్పుడు.. వైసీపీ 151 సీట్లు వచ్చి తొడలు కొడుతున్నా తనకు నవ్వొస్తుందే తప్ప బాధపడలేదన్నారు. వైసీపీ నాయకత్వంపైనగానీ, వైసీపీ మంత్రులపైగానీ వ్యక్తిగత ద్వేషం లేదని.. పాలసీపైనే ప్రశ్నిస్తామని పవన్ కల్యాణ్ అన్నారు. మీ నాయకత్వంలో రాష్ట్రం సుభిక్షంగా ఉంటే మేమేం మాట్లాడమన్నారు. వైసీపీ ప్రభుత్వం అశుభంతో మొదలుపెట్టిందని ఎద్దేవా చేశారు.

  ఇది చదవండి: వైఎస్ జగన్ తో రాజమౌళి భేటీ.. ఆర్ఆర్ఆర్ కి సీఎం వరాలిస్తారా..?


  వైసీపీ ప్రతిజ్ఞ ఇదే

  “ఆంధ్రప్రదేశ్ మా సొంత భూమి.. ప్రజలందరూ మా బానిసలు.. రాజ్యాంగ వ్యవస్థను తుంగలో తొక్కుతాం.. పోలీసులను సొంత మనుషుల్లా వాడతాం.. ఉద్యోగులను నానా తిప్పలు పెడతాం.. రోడ్లను గుంతలు చేస్తాం.. ప్రజల వెన్నువిరిచే వరకూ విశ్రమించం.. పెట్టుబడుల్లో 50శాతం లాక్కుంటాం.. అందరి ఆర్ధిక మూలాలు దెబ్బతీస్తాం.. అన్నదాతలను అప్పుల ఊహిబిలో నెట్టేస్తా.. ఇసుకను అప్పడంలా నమిలేస్తాం.. సహజ నరులను ఆసాంతం వాడేస్తాం.. దేవతా విగ్రహాలను అవమానిస్తే గుండెల్లో పెట్టుకుంటాం.. ప్రభుత్వ స్థలాలను తాకట్టుపెట్టేస్తాం.. సంపూర్ణ మద్యపాన నిషేధం ద్వారా ప్రజలను చిత్తుగా తాగిస్తాం.. సొంత ఆదాయా వనరులను పెంచుకుంటాం.. ఎవరైనా గొంతెత్తితే తాట తీస్తాం.. తేడా వస్తే సొంత ఎంపీనైనా లాఠీలతో కొట్టిస్తాం.. ఒక్క ఛాన్సిస్తే.. ఆంధ్రాని పాతికేళ్ల వెనక్కి తీసుకెళ్తాం.. ఇంకొక్క ఛాన్సిస్తే.. పిల్లల చేతిల్లో చాక్లెట్లు కూడా లాగేసుకుంటాం..” అంటూ వైసీపీ ప్రతిజ్ఞ చేసిందని ఎద్దేవా చేశారు.

  వైసీపీ వచ్చిరావడంతోనే పీపీఏలను వ్యతిరేకించడం, రాజధానిగా అమరావతిని వద్దని మూడు రాజధానుల మాట ఎత్తారన్నారు. ప్రతిపక్షంలో ఉండగా అమరావతిని సపోర్ట్ చేసి ఆ తర్వాత మాట మార్చామన్నారు. అమరావతిని రాజధానిగా చేస్తామన్నప్పుడు గాడిదలు కాశారా అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. రూ.3వేల కోట్లు ఖర్చిన తర్వాత రాజధాని మారుస్తామంటే కుదరదని పవన్ స్పష్టం చేశారు. వైసీపీ నాయకులు న్యాయవ్యవస్థను కూడా దూషించే స్థాయికి దిగజారారన్నారు. వైసీపీలో కొందరు నేతలు మంత్రులవడం మన ఖర్మ అని పవన్ అన్నారు.

  Published by:Purna Chandra
  First published:

  Tags: Andhra Pradesh, Janasena party, Pawan kalyan

  ఉత్తమ కథలు