Union
Budget 2023

Highlights

హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Pawan on Rayalaseema : రాయలసీమలో సీఎం క్యాంప్ ఆఫీస్.. పవన్ సంచలన వ్యాఖ్యలు..,

Pawan on Rayalaseema : రాయలసీమలో సీఎం క్యాంప్ ఆఫీస్.. పవన్ సంచలన వ్యాఖ్యలు..,

జూన్ నుంచి హరీష్ శంకర్ భవదీయుడు భగత్‌సింగ్ మొదలయ్యే అవకాశాలున్నాయి. ఈ చిత్రంలో పోలీస్ ఆఫీసర్‌గానే నటించబోతున్నాడు పవన్. పైగా ద్విపాత్రాభినయం చేయబోతున్నాడనే టాక్ కూడా వినిపిస్తుంది. 2022లోనే హరీష్ సినిమాను కూడా పూర్తి చేసి.. 2023 సంక్రాంతికి విడుదల చేయాలనే ప్లాన్‌లో ఉన్నారు నిర్మాతలు. సురేందర్ రెడ్డి సినిమాను 2023లో మొదలుపెట్టనున్నాడు. ఏదేమైనా ఈ సారి షూటింగ్‌కు వస్తే.. ముందు ఒప్పుకున్న సినిమాలు పూర్తి చేయాలనేది పవన్ ప్లాన్. మరి అది ఎంతవరకు వర్కవుట్ అవుతుందో చూడాలి.

జూన్ నుంచి హరీష్ శంకర్ భవదీయుడు భగత్‌సింగ్ మొదలయ్యే అవకాశాలున్నాయి. ఈ చిత్రంలో పోలీస్ ఆఫీసర్‌గానే నటించబోతున్నాడు పవన్. పైగా ద్విపాత్రాభినయం చేయబోతున్నాడనే టాక్ కూడా వినిపిస్తుంది. 2022లోనే హరీష్ సినిమాను కూడా పూర్తి చేసి.. 2023 సంక్రాంతికి విడుదల చేయాలనే ప్లాన్‌లో ఉన్నారు నిర్మాతలు. సురేందర్ రెడ్డి సినిమాను 2023లో మొదలుపెట్టనున్నాడు. ఏదేమైనా ఈ సారి షూటింగ్‌కు వస్తే.. ముందు ఒప్పుకున్న సినిమాలు పూర్తి చేయాలనేది పవన్ ప్లాన్. మరి అది ఎంతవరకు వర్కవుట్ అవుతుందో చూడాలి.

2024లో జనసేన (Janasena) అధికారంలోకి వచ్చితీరుతుందన్నారు. జనసేన ప్రభుత్వం ఏర్పాటు చేస్తే రాయలసీమలో (Rayalaseema) సీఎం క్యాంప్ కార్యాలయం నిర్మిస్తామని సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో రోడ్ల దుస్థితిపై నిరసనలో భాగంగా జనసేన పార్టీ (Janasena Party) అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) అనంతపురం జిల్లా (Anantapuram District)లో పర్యటించారు. జిల్లాలోలని నాగులకనుమ వద్ద శ్రమదానంలో పాల్గొన్నారు. అనంతరం కొత్తచెరువు వద్ద జరిగిన బహిరంగ సభలో ప్రసంగించిన పవన్ కల్యాణ్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వైఎస్ఆర్సీపీ (YSRCP) ప్రభుత్వాన్ని టార్గెట్ చేసి విమర్శలు చేసిన పవన్ కల్యాణ్.., రాయలసీమ నుంచి ఎంతమంది ముఖ్యమంత్రులు వచ్చినా అభివృద్ధి చెందలేదన్నారు. 2024లో జనసేన అధికారంలోకి వచ్చితీరుతుందన్నారు. జనసేన ప్రభుత్వం ఏర్పాటు చేస్తే రాయలసీమలో సీఎం క్యాంప్ కార్యాలయం నిర్మిస్తామని సంచలన వ్యాఖ్యలు చేశారు. రాయలసీమ అభివృద్ధికి తాము కట్టుబడి ఉంటామని పవన్ కల్యాణ్ ప్రకటించారు. వైసీపీని ధీటుగా ఎదుర్కొగలిగే పార్టీ జనసేన మాత్రమేనని ఆయన స్పష్టం చేశారు.

రాయలసీమలో ఉపాధి అవకాశాలు లేకపోవడంతో దరో యువత వలస వెళ్లిపోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయని పవన్ అభిప్రాయపడ్డారు. సీమ ప్రాంతం నుంచి ఎందరో సీఎంలు వచ్చినా ఈ ప్రాంతం అభివృద్ధి కాలేదని.., భయపెడితే పరిశ్రమలు ఎక్కణ్నుంచి వస్తాయని పవన్ ప్రశ్నించారు. కియా పరిశ్రమ యాజమాన్యాన్ని కూడా బెదిరించే పరిస్థితి రాష్ట్రంలో ఉందన్నారు. రాయలసీమకు పరిశ్రమలు రప్పిస్తా.. అభివృద్ధి చేస్తానని పవన్ హామీ ఇచ్చారు. తాను నెల్లూరు జిల్లాలో చదువుకున్నానని.. రెడ్డి సామాజికవర్గంతో కలిసి పెరిగానని జనసేనాని గుర్తు చేశారు. రాయలసీమ చదువుల సీమ అని.. అలాంటి రాయలసీమ .. కరువు సీమగా, వెనుకబడిన ప్రాంతంగా ఎందుకుంది..? అని ప్రశ్నించారు.


ఇది చదవండి: కాపులకు పవన్ కల్యాణ్ హితబోధ.. ఆ ముగ్గురిపై ఆసక్తికర వ్యాఖ్యలు


వచ్చే ఎన్నికల్లో జనసేనదే అధికారమని పవన్ ధీమా వ్యక్తం చేశారు. వైసీపీ పాలన బాగుంటే తాము రోడ్లమీదకు వచ్చే అవసరం ఉండేది కాదన్నారు.  రాయలసీమ పోరాటాల, పౌరుషాల గడ్డ. ప్రజా స్వామ్యం అనే ఆయుధాన్ని ప్రజలు వాడుకోవాలని., ప్రజాస్వామ్యంలో భయానికి చోటు లేదని.. ప్రతి ఒక్కరు ధైర్యంగా నిలబడాలని పిలుపునిచ్చారు. ప్రజల తరపున ప్రభుత్వంతో పోరాడేందుకు తెలుగుదేశం పార్టీ కూడా వెకంజవేస్తోందని విమర్శించారు. రాయలసీమ ప్రాంతంలో పుట్టపర్తి సాయిబాబా ఒక్కరే అంత అభివృద్ధి పనులు చేస్తే... ప్రభుత్వం ఎంత చేయాలి..? అని ప్రశ్నించిన పవన్.. నాయకుడు నిజాయతీగా ఉంటే అందరికీ అభివృద్ధి ఫలాలు అందుతాయన్నారు.

ఇది చదవండి: రాజమండ్రిలో పవన్ కల్యాణ్ పవర్ ఫుల్ స్పీచ్... వారికి స్ట్రాంగ్ వార్నింగ్..


అంతకుముందు తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో శ్రమదానంలో పాల్గొన్న పవన్ కల్యాణ్ వైసీపీ ప్రభుత్వంపై తీవ్రవిమర్శలు చేశారు. వైసీపీతో యుద్ధం డిక్లేర్ చేస్తున్నామని.. ఏస్థాయిలో కావాలంటే ఆ స్థాయిలో పోరాడతామని హెచ్చరించారు. తనపై వ్యక్తిగత విమర్శలకు దిగితే తొక్కిపాడేస్తామని హెచ్చరించారు. ప్రభుత్వం దగ్గర డబ్బులున్నాయని.. కానీ భయమే లేదన్నారు.. వైసీపీకి భయమంటే ఏంటో చూపిస్తానని వార్నింగ్ ఇచ్చారు. రాష్ట్రంలో కొన్ని కులాలని.. మరికొన్ని కులాలకు శత్రువులుగా చిత్రీకరించి రాజకీయ లబ్ధిపొందుతున్నారని పవన్ కల్యాణ్ అన్నారు. పవన్ పర్యటనలో పార్టీ పీఏసీ కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్, ఇతర ముఖ్యనేతలు పాల్గొన్నారు.

First published:

Tags: Andhra Pradesh, Janasena party, Pawan kalyan, Rayalaseema

ఉత్తమ కథలు