Home /News /andhra-pradesh /

AP POLITICS JANASENA CHIEF PAWAN KALYAN MADE KEY ANNOUNCEMENT ON TENANT FARMERS IN ANDHRA PRADESH FULL DETAILS HERE PRN

Pawan Kalyan: ఉగాది రోజు పవన్ సంచలన ప్రకటన.. కౌలు రైతుల కోసం రంగంలోకి జనసేనాని

పవన్ కళ్యాణ్ (ఫైల్ ఫోటో)

పవన్ కళ్యాణ్ (ఫైల్ ఫోటో)

జనసేన (Janasena) అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కీలక ప్రకటన చేశారు. ఉగాది (Ugadi) పండుగనాడు ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన ఆయన.. రైతు కుటుంబాలకు అండగా ఉంటామని ప్రకటించారు. అంతేకాదు రైతుల కోసం త్వరలోనే యాత్ర చేపట్టనున్నారు.

    జనసేన (Janasena) అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) కీలక ప్రకటన చేశారు. ఉగాది (Ugadi) పండుగనాడు ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన ఆయన.. రైతు కుటుంబాలకు అండగా ఉంటామని ప్రకటించారు. అంతేకాదు రైతుల కోసం త్వరలోనే యాత్ర చేపట్టనున్నారు. ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతు కుటుంబాలకు పార్టీ తరపున ఆర్ధికసాయాన్ని ప్రకటించారు. ఆ సాయాన్ని తానే స్వయంగా వెళ్లి బాధితులకు అందజేస్తానని ప్రకటించారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియాలో వీడియో రిలీజ్ చేశారు. తొలుత గోదావరి జిల్లాలు, ఆ తర్వాత రాయలసీమ జిల్లాల్లో పవన్ పర్యటిస్తారు. గత ఎన్నికల మేనిఫెస్టోలో రైతులకు ఆకర్షణీయ హామీలిచ్చిన పవన్.. ఇప్పుడు నేరుగా కౌలు రైతుల ఇళ్లకు వెళ్లి ఆర్ధికసాయం అందిస్తామని ప్రకటించడం సంచలనంగా మారింది.

    కౌలు రైతుల ఆత్మహత్యల గురించి వింటుటంటే బాధ కలిగిందని పవన్ కల్యాణ్ అన్నారు. రైతులు రక్తం ధారపోస్తేనే ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణగా పేరుగాంచిందన్నారు. అలాంటి అన్నదాతలకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన బహుమతి ఆత్మహత్యలేనన్నారు. అప్పులు చేసి కష్టపడి పంట పండించిన కౌలు రైతులకు కనీసం గిట్టుబాటు ధర కూడా వచ్చేపరిస్థితి లేదని పవన్ అన్నారు. గిట్టుబాటు ధరను అమలు చేయకపోవడంతో దళారులు, రైస్ మిల్లర్లు లాభపడుతున్నారన్నారు. ఆశించన ధర రాక, ప్రభుత్వం ఆదుకోకపోవడంతో దిక్కుతోచని స్థితిలో రాష్ట్రంలో 3వేల మంది బలవన్మరణాలకు పాల్పడ్డారని పవన్ అన్నారు.

    ఇది చదవండి: ఉగాది వేడుకల్లో సీఎం జగన్.. ఈ ఏడాది ఎలా ఉండబోతోందంటే..!


    రాష్ట్రంలో అధికారికంగా 16 లక్షల మంది కౌలు రైతులున్నారని.. ఆ సంఖ్య దాదాపు 45 లక్షలుండే అవకాశముందన్నారు పవన్ కల్యాణ్. కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే ఎవరూ పట్టించుకోవడం లేదన్నారు. గోదావరి జిల్లాల్లో 80 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని పవన్ కల్యాణ్ తెలిపారు. వారి కుటుంబాలను ఎవరూ పట్టించుకున్న పాపాన పోలేదని ఆయన విమర్శించారు. ఆత్మహత్య చేసుకున్న రైతులకు ఆర్ధిక సాయం చేస్తామన్న వైసీపీ ప్రభుత్వం వారిని మోసం చేసిందన్నారు. అందుకే ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు అండగా ఉండేందుకు తమవంతుగా ఒక్కో కుటుంబానికి రూ.లక్ష ఆర్ధిక సాయం అందిస్తామన్నారు.

    ఇది చదవండి: అమరావతికి 2024 వరకు టైమ్.. హైకోర్టులో ఏపీ ప్రభుత్వం అఫిడవిట్..


    తొలుత గోదావరి జిల్లాల్లో 80 కుటుంబాలకు, ఆ తర్వాత కర్నూలు, అనంతపురం జిల్లాల్లో ఆత్మహత్య చేసుకున్న 150 మంది రైతుల కుటుంబాలకు ఆర్ధిక సాయం చేస్తామని పవన్ తెలిపారు. తానే స్వయంగా రైతు కుటుంబాలను కలిసి ఆర్ధిక సాయం అందిస్తామని ప్రకటించారు. ప్రతి రైతు కుటుంబానికి తాము అండగా ఉంటామని, ప్రభుత్వంపై పోరాటం చేస్తామని హామీ ఇచ్చారు. వైసీపీ ప్రభుత్వం చట్టసవరణ చేసి కౌలు రైతులకు మేలు చేయాలని పవన్ కల్యాణ్ డిమాండ్ చేశారు.
    Published by:Purna Chandra
    First published:

    Tags: Andhra Pradesh, AP Politics, Janasena party, Pawan kalyan

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు