Home /News /andhra-pradesh /

AP POLITICS JANASENA CHIEF PAWAN KALYAN MADE INTERESTING COMMENTS ON NEW DISTRICTS ISSUE AS HE SLAMS AP GOVERNMENT FULL DETAILS HERE PRN GNT

Pawan Kalyan: ‘ఆ బాధ్యత జనసేనదే..’ కొత్త జిల్లాలపై పవన్ కీలక వ్యాఖ్యలు..

జనసేన అధినేత పవన్ కల్యాణ్ (ఫైల్)

జనసేన అధినేత పవన్ కల్యాణ్ (ఫైల్)

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో కొత్త జిల్లాలు (AP New Districts) అమల్లోకి వచ్చినా ప్రతిపక్షాలు మాత్రం కొన్ని విషయాల్లో ఇంకా అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికే జిల్లాల పేర్లు, పరిధులు, మండలాలు, గ్రామాల విలీనం వంటి అంశాలపై విమర్శలు వస్తున్నాయి. తాజాగా జనసేన (Janasena Party) అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) తొలిసారి జిల్లాల అంశంపై స్పందించారు.

ఇంకా చదవండి ...
    ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో కొత్త జిల్లాలు (AP New Districts) అమల్లోకి వచ్చినా ప్రతిపక్షాలు మాత్రం కొన్ని విషయాల్లో ఇంకా అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికే జిల్లాల పేర్లు, పరిధులు, మండలాలు, గ్రామాల విలీనం వంటి అంశాలపై విమర్శలు వస్తున్నాయి. తాజాగా జనసేన (Janasena Party) అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) తొలిసారి జిల్లాల అంశంపై స్పందించారు. జిల్లాల ఏర్పాటులో ప్రభుత్వం తీరును ఆయన తప్పుబట్టారు. రాష్ట్రంలో జిల్లాల పునర్వ్యవస్థీకరణ ప్రక్రియలో ప్రజాభిప్రాయానికి ఏ మాత్రం విలువ ఇవ్వకుండా పాలకుల చిత్తానికి తోచిన విధంగా ముందుకు వెళ్లారని పవన్ కల్యాణ్ విమర్శించారు. ఆద్యంతం లోపభూయిష్టంగా ఈ విభజన సాగింది. కొన్ని చోట్ల దూరభారాలను పట్టించుకోలేదని.. మరికొన్ని చోట్ల సెంటిమెంట్లను పక్కనబెట్టేశారన్నారు.

    పార్లమెంట్ నియోజకవర్గమే ప్రామాణికం... అదే హేతుబద్ధత అని చెప్పుకొంటున్న ప్రభుత్వం ప్రజల మనోగతాన్ని, కొత్త జిల్లాల మూలంగా వారు ఎదుర్కొనే దూరాభారాలు, ఇబ్బందులను ఎందుకు పరిగణించలేదని పవన్ కల్యాణ్ ప్రశ్నించనారు. అలాగే ఎప్పటి నుంచో జిల్లా కోసం డిమాండ్ ఉన్న ప్రాంతాలపై అధ్యయనం కూడా చేయలేదని., పాడేరు కేంద్రంగా ఏర్పాటు చేసిన జిల్లాలో ముంపు మండలాల గిరిజనులకు అనేక ఇబ్బందులు ఎదురవుతాయని పవన్ అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా ఎటపాక, కుక్కునూరు లాంటి మండలాల్లోని గ్రామాల నుంచి జిల్లా కేంద్రానికి వెళ్లాలంటే కనీసం 300 కి.మీ. ప్రయాణం చేయాల్సి ఉంటుందని జనసేనాని గుర్తుచేశారు. అంటే సామాన్య, పేద గిరిజనుడు జిల్లా కేంద్రంలో అధికారిని కలవాలంటే కనీసం రెండు రోజులు సమయం పడుతుందన్నారు.

    ఇది చదవండి: కుప్పం ఎమ్మెల్యే కోరిక మేరకు ఆ పనిచేశాం.. సీఎం జగన్ ఆసక్తికర వ్యాఖ్యలు..


    ఈ తరహా విభజన వల్ల ప్రజలకు పాలనను ఏ విధంగా చేరువ చేస్తున్నారో వివరణ ఇవ్వాలని పవన్ కల్యాణ్ డిమాండ్ చేశారు. ఇక కాకినాడ కేంద్రంగా ఉన్నప్పుడూ ముంపు మండలాల వారికి ఇదే తరహా ఇబ్బందులు వచ్చాయన్న పవన్.. కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాత కూడా ఆ ఇబ్బందులు తప్పడం లేదని చెప్పారు. రంపచోడవరం కేంద్రంగా జిల్లా ఉండాలనే అక్కడి గిరిజనుల అభిప్రాయాన్ని పట్టించుకోలేదని.. అటు రాయలసీమలోనూ ప్రజల అభిప్రాయాన్ని పట్టించుకోలేదని మండిపడ్డారు. మదనపల్లె, హిందూపురం, మార్కాపురం కేంద్రాలుగా జిల్లాలు ఉండాలనే డిమాండ్లు ఉన్నాయన్నారు.

    ఇది చదవండి: ‘మూడో అడుగు అటువైపే..’ కొత్త జిల్లాలపై ప్రభుత్వం కీలక ప్రకటన.. తెరపైకి మూడు రాజధానులు..!


    కొత్త జిల్లాల ఏర్పాటు అంశంలో ప్రజలు, పార్టీలు, ప్రజా సంఘాలలో ఏ ఒక్కరి నుంచి కూడా అభిప్రాయాలు తీసుకోలేదని పవన్ కల్యాణ్ విమర్శించారు. డ్రాఫ్ట్ ఇచ్చే ముందు చర్చలు లేవని.., అనంతరం ప్రజలు ఇచ్చిన వినతులను కనీసం పరిగణించలేదని మండిపడ్డారు. ఈ అంశంలో ప్రజాభిప్రాయం, వారు చేస్తున్న నిరసనల సమాచారం ఎప్పటికప్పుడు క్షేత్ర స్థాయి నుంచి జనసేన పార్టీ కార్యాలయానికి చేరుతున్నాయన్నారు. జిల్లాల పునర్వ్యవస్థీకరణలో లోపాలు, అసౌకర్యంగా ఉన్న విషయాలపై ప్రజలు చేసే నిరసనలకు జనసేన అండగా ఉంటుందన్న ఆయన.. తదుపరి వీటిని చక్కదిద్ది.. ప్రజా సౌకర్యమే ప్రధానంగా జిల్లాలను పునర్వ్యవస్థీకరించే బాధ్యతను జనసేన తీసుకొంటుందని స్పష్టం చేశారు.
    Published by:Purna Chandra
    First published:

    Tags: Andhra Pradesh, AP new districts, AP Politics, Pawan kalyan

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు