AP POLITICS JANASENA CHIEF PAWAN KALYAN IS IN YCP TRAP WHAT ABOUT ALLIANCE FOR NEXT ELECTIONS NGS BK
AP Politics: వైసీపీ ట్రాప్ లో పవన్..! బాబు డైలమాకు కారణం అదేనా..? మరి జరగబోయేది ఏంటి..?
చంద్రబాబు, జగన్, పవన్ (ఫైల్ ఫోటో)
AP Politics: ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. అన్ని పార్టీల్లోనూ ఎన్నికల మూడ్ కనిపిస్తోంది. దీంతో వ్యూహ ప్రతి వ్యూహాల్లో భాగమయ్యారు. తాజాగా పవన్ కళ్యాణ్ కామెంట్లు చూస్తే.. ఆయన వైసీపీ ట్రాప్ లో పడ్డారా అనే అనుమానాలు కలుగుతున్నాయి. మరి టీడీపీ ఏం చేయబోతోంది..?
Andhra Pradesh Political News: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజకీయా (Politics) ల్లో రోజుకో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంటోంది. ముఖ్యంగా పొత్తుల విషయంలో అధినేతల కామెంట్లతో గందరగోళం నెలకొంది. పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) చేసిన కామెంట్స్ ఒకరిని ఆనందంలో ముంచితే మరోకని డైలామాలో పడేశాయి. పొత్తులకు సంబంధించి రాష్ట్రంలో కీలక పరిణామాలు జరగబోతున్నాయని భావించి అందరి ఆశలపై ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీ తెలుగు దేశం (Telugu Desam) ఆశలపై నీళ్లు చల్లారు పవన్ కళ్యాణ్. పొత్తులకు సంబంధించి పవన్ చేసిన వ్యాఖ్యాలు ఇప్పుడు రాజకీయ దూమారానికి తెర తీస్తోన్నాయి. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చకుండా ఉండడానికి ఎవరినైన కలుపుకుపోతానని చెప్పిన పవన్ ఉన్నట్టుండి తనకు భవిష్యత్ లో ఎవరితోనూ పొత్తలు ఉండవని ప్రజలతోనే పొత్తు ఉంటుందనే వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి.
పవన్ చేసిన వ్యాఖ్యలపపై వైసీపీ శ్రేణులు పూర్తి హ్యపీగా ఉండగా మరోవైపు టీడీపీ శ్రేణులు మాత్రం డైలామాలో పడ్డారు. ఒకవేళ పవన్ చెప్పినట్లు జనసేన ఒంటరిగా బరిలో దిగితే అది టీడీపీకి చాలా నష్టం చేస్తుందని.. అన్ని పార్టీలు.. రాజకీయ విశ్లేషకులు అంచనా..? 2019 లో కూడా అదే జరిగింది. ప్రస్తుతం ప్రభుత్వం పై వస్తోన్న వ్యతిరేకను కాస్త తమకు అనుకూలంగా మార్చుకోవడానికి ప్రయత్నిస్తోన్న టీడీపీ, భవిష్యత్ లో పవన్ కూడా తమతో కలిసే వస్తాడని ఎన్నికలు ఎప్పుడు వచ్చిన తమదే అధికారమనే ధీమాలో ఇప్పటి వరకు ఉంది.
తాజాగా పవన్ వ్యాఖ్యతో చంద్రబాబు అండ్ కో డైలమాలో పడినట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే పవన్ వ్యాఖ్యలపై అప్పుడే పార్టీ నేతలను స్పందించోద్దని బాబు దిశానిర్దేశం చేసినట్లు తెలుస్తోంది. మరో వైపు అధికార పార్టీ నేతలు మాత్రం పవన్ వ్యాఖ్యలపై ఫుల్ జోష్ లో ఉన్నారు. తాము అనుకున్నట్లు పవన్ తమ ట్రాప్ లో పడ్డాడని వైసీపీ నేతలు సంబరపడుతున్నారు. మొదట పొత్తుల వ్యవహారం తెరపైకి వచ్చినప్పటి నుంచి అధికాపార్టీ నేతలు పవన్ ఒంటరిగా బరిలో దిగాలనే తమ మాటలతో రెచ్చగొడుతూనే ఉన్నారు.
ఒక దశలో తాను ఎవరితో పొత్తుపెట్టుకోవాలో వద్దో చెప్పడానికి వైసీపీ నేతలు ఎవరని పవన్ వ్యాఖ్యలు కూడా చేశారు. దీంతో అందరు పవన్ పొత్తులకు సంబంధించి చాలా కూల్ గా నిర్ణయం తీసకుంటారని భావించారు అందరు. కానీ ఉన్నట్టుండి పవన్ తన స్వరం మార్చారు. దీంతో పవన్ అధికారపార్టీ నేతల ట్రాప్ లో పడ్డారని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. పవన్ ఒంటరిగా బరిలో దిగడంతో ఆయనకు ఎంత వరకు కలిసోస్తుందో తెలియదు.. కానీ టీడీపీకి మాత్రం చాలా నష్టం చేస్తోందనే అభిప్రాయన్ని వ్యక్తం చేస్తోన్నారు. పనవ్ వ్యాఖ్యలపై చంద్రబాబు ఇంకా స్పందించలేదు. ప్రస్తుతం మరిన రాజకియ పరిణామాలతో బాబు ఎలాంటి వ్యూహాంతో ముందుకొస్తారో చూడాలి అంటున్నారు రాజకీయ నిపుణులు.
Published by:Nagabushan Paina
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.