Anna Raghu, Sr.Correspondent, News18, Amaravati
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు అందరి ఫోకస్ పవన్ పైనే ఉంది. ఎందుకంటే ఆయన తీసుకున్న నిర్ణయంపై వచ్చే ఎన్నికల ఫలితాలు ఆధారపడి ఉంటాయని ప్రచారం జరుగుతోంది. ఒకవేళ పవన్.. టీడీపీతో పొత్తు పెట్టుకుంటే.. కచ్చితంగా మెరుగైన ఫలితాలు ఉంటాయని.. లేదా ఎవరికి వారు పోటీ చేస్తే.. వైసీపీకి ప్లస్ అవుతుంది అని.. రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అందుకే ఇప్పుడు పవన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అన్నది ఆసక్తి పెంచుతోంది.. బీజేపీతో కలిసి వచ్చే ఎన్నికల్లో అడుగులు వేస్తారా.. లేక టీడీపీ అధినేత చంద్రబాబుతో చేయి చేయూ కలుపుతారా అన్నది చూడాలి.. పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని స్థాపించి దశాబ్దానికి పైగా కాలం గడిచి పోయింది. కానీ రాజకీయాల్లో ఇప్పటి వరకు ఫెయిలవుతూనే ఉంది. ఆ విషయాన్ని స్వయంగా పవన్ ఒప్పుకున్నారు.
అయితే ఆ ఓటములు నేర్పిన పోరాటం ఆయనలో కసి పెంచుతోంది. అందుకే సరికొత్త వ్యూహాలతో పవన్ ముందుకు వెళ్తున్నారు. తనకు తానుగా అధికార పీఠాన్ని కైవసం చేసుకోగలిగేంత బలం లేకపోయినప్పటికి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో గెలుపోటములను ప్రభావితం చేయగల బలం ఆ పార్టీకి ఉంది.
2009లో పార్టీ ఆవిర్భావ సందర్భంలోనే తెలుగుదేశం పార్టీతో కలిసి పనిచేయాలని మంచి నిర్ణయమే తీసుకున్నప్పటికీ.. ఆ ఎన్నికలలో తన అభ్యర్ధులను నిలుపకపోవడం ఆ పార్టీ చేసిన అతిపెద్ద పొరపాటు. అప్పటి నుండి ఇప్పటి వరకు పార్టీ అధికారానికి దూరంగా ఉండటం అటు కార్యకర్తలను ఇటు పార్టీ నాయకులను కలవరపాటుకు గురిచేస్తుంది. అధికారం సంగతి పక్కన పెడితే.. అధినేత అయిన పవన్ సైతం.. పోటీ చేసిన రెండు చోట్ల ఓడిపోవడం.. రాజకీయంగా తీవ్ర ఒత్తిడిలోకి నెట్టింది. అయినా ఆ బాధ నుంచి త్చావరగానే కోలుకున్నారు పవన్.
ఇప్పుడు మరింత బలంగా పార్టీని జనాల్లోకి తీసుకెళ్తున్నారు. 2024లో గెలుపే లక్ష్యంగా పావువు కదుపుతున్నారు. అయితే మొన్నటి వరకు.. చంద్రబాబుతో పవన్ పొత్తు పెట్టుకుంటున్నట్టే పరిస్థితి కనిపించింది. ముఖ్యంగా విశాఖ పర్యటన తరువాత పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు మధ్య బంధం కాస్త బలపడిందనే ప్రచారం జనసైనీకులలో ఉత్సాహం నింపింనట్లే కనిపించింది. కానీ ప్రధాని నరేంద్ర మోదీ విశాఖ పర్యటన తర్వాత పవన్ వ్యవహార శైలి పార్టీ క్యాడర్ ఉత్సాహంపై నీళ్ళుచల్లినట్లు అయ్యింది.
మోదీ తో భేటీ తరువాత పవన్ టీడీపీతో అంటీ ముట్టనట్లు వ్యవహరిస్తున్నారు. దీంతో ఈ సారి ఎన్నికలలో జనసేన-బీజేపీల బంధం కొనసాగుతుందని.. టీడీపీ తో కలిసేందుకు బీజేపీ సిద్ధంగా లేదనే ప్రచారం ఉంది. అందకే బీజేపీ పెద్దలు టీడీపీతో పొత్తు విషయం చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారని తెలుస్తోంది.
అయితే పనవ్ తో సహా జనసేన కీలక నేతలు సైతం.. టీడీపీతో పొత్తు పెట్టుకోవడే మే మంచిది అని సలహాలు ఇస్తున్నారు. కానీ అందుకు బీజేపీ ఒప్పుకుంటుందా లేదో చూడాలి.. బీజీపీని కాదని పవన్ ఒంటరిగా బయటకు రావడం కష్టమే.. అందుకే ఎలాంటి నిర్ణయం తీసుకోవడం మంచిదని.. కాదని ఇప్పటికి ఫిక్స్ అయ్యారని తెలుస్తోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP News, AP Politics, Chandrababu Naidu, Pawan kalyan, Pm modi