Home /News /andhra-pradesh /

AP POLITICS JANASENA CHIEF PAWAN KALYAN HUMANITY HE WILL READY TO HELP EDUCATION FOR FARMERS CHILDRENS NGS GNT

Pawan Kalyan: కౌలురైతుల పిల్లల బాధ్యత తీసుకున్న పవన్.. ఏం హామీ ఇచ్చారు అంటే..?

పెద్ద మనసు చాటుకున్న పవన్

పెద్ద మనసు చాటుకున్న పవన్

Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి తన పెద్ద మనసు చాటారు.. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కౌలు రైతులకు సాయం చేస్తున్న ఆయన.. కౌలు రైతు బిడ్డల చదువు బాధ్యతను కూడా తీసుకున్నారు. ఈ సందర్భంగా వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు.

ఇంకా చదవండి ...
    awan Kalyan: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో కౌలు రైతులకు సహాయ కార్యక్రమాన్ని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కొనసాగిస్తున్నారు. తాజాగా ఉమ్మడి ప్రకాశం జిల్లా (Prakasam District) లో జనసేనాని పవన్ కళ్యాణ్ పర్యటన కొనసాగింది. వివిధ కారణాలతో ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతులను పరామర్శించడమే కాకుండా.. వారి కుటుంబాలకు ఆర్ధిక సాయం కూడా అందిస్తున్నారు. ఎన్ని విమర్శలు వచ్చినా.. పవన్ తన సాయాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు. ఇటీవల మెగా ఫ్యామిలీ (Mega Family) అంతా కలిసి.. పవన్ కు అండగా నిలుస్తూ భారీగా విరాళాలు ఇచ్చారు. దీంతో మరికొంతమంది సాయం చేసే అవకాశం పవన్ కు దక్కింది. తాజాగా బాపట్ల జిల్లా (Bapatla District) యద్దనపూడి మండలంలోని యనమదల గ్రామంలో ఆత్మహత్య చేసుకున్న కౌలురైతు పోలవరపు వెంకటేశ్వర్లు కుటుంబానికి లక్ష రూపాయల చెక్కును పవన్ అందజేశారు. అంతే కాకుండా జాగర్లమూడి వారి పాలెంలో ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతు నీలం రవి కుమార్ కుటుంబానికి లక్ష రూపాయల చెక్కు అందించారు జనసేనాని.

    ఈ సందర్భంగా రవి కుమార్ బలవన్మరణానికి గల కారణాలు, ఆర్థిక పరిస్థితి గురించి కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. ఆ తరువాత జనసేన తరుపున లక్ష రూపాయల ఆర్థిక సాయాన్ని రవికుమార్ భార్య అశోకరాణికి అందజేశారు. అయితే ఆ ఇంటిలో ఇద్దరు చిన్నారులను చూశారు. వారితో మాట్లాడిన పవన్.. తీవ్రంగా చలించిపోయారు. వెంటనే ఇద్దరు బిడ్డలైన మహేశ్వరి, కార్తీక్.. చదువుల బాధ్యతను పార్టీ చూసుకుంటుందని ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ ఆ కుటుంబానికి భరోసా ఇచ్చారు.



    ఇక్కడితోనే జనసేన ఆగిపోదని.. ఈ సాయం నిరంతంగా కొనసాగుతుందని జనసేన వర్గాలు చెబుతున్నాయి. కౌలు రైతుల భ‌రోసా యాత్ర పేరుతో ఆత్మ‌హ‌త్య చేసుకున్న కౌలు రైతుల కుటుంబ స‌భ్యుల‌ను స్వయంగా వెళ్లి పవన్ కలుస్తున్నారు.. వారిని పరామర్శిస్తూ.. వారి కష్ట సుఖాలను పంచుకుంటున్నారు.



    కేవలం మాటలతో ఓదర్పు ఇవ్వడమే కాకుండా.. ఇతర రాజకీయ పార్టీల్లా అధికారంలోకి వస్తే ఏదో చేస్తామని హామీలు ఇవ్వడం కాదు.. నేరుగా జ‌న‌సేన త‌ర‌ఫున ల‌క్ష రూపాయ‌ల‌ను ప‌రిహారంగా ఇస్తున్నారు. ఇటీవ‌లే మెగాస్టార్ చిరంజీవి, నాగ‌బాబు, చిరంజీవి సోద‌రి.. ఇలా వారి కుటుంబ స‌భ్య‌లుంతా క‌లిసి 35 ల‌క్ష‌ల‌ను జ‌న‌సేన‌కు విరాళంగా ఇచ్చారు కూడా. ఆత్మ‌హ‌త్య చేసుకున్న కౌలు రైతుల కుటుంబ స‌భ్యుల‌కు ఇవ్వాల‌ని కోరారు. చెక్కును కూడా చిరంజీవి సోద‌రి మ‌నోహ‌ర్‌కు అంద‌జేశారు.
    Published by:Nagabushan Paina
    First published:

    Tags: Andhra Pradesh, AP News, Janasena, Pawan kalyan

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు