Home /News /andhra-pradesh /

AP POLITICS JANASENA CHIEF PAWAN KALYAN HAS FULL CLARITY ON ALLIANCE WITH TDP IN 2024 ELECTIONS FULL DETAILS HERE PRN

Janasena-TDP: టీడీపీ విషయంలో పవన్ మెట్టుదిగనిది అందుకే..! తగ్గితే జరిగే నష్టాన్ని ముందే ఊహించారా..?

పవన్ కళ్యాణ్, చంద్రబాబు (ఫైల్ ఫోటో)

పవన్ కళ్యాణ్, చంద్రబాబు (ఫైల్ ఫోటో)

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజకీయాల్లో జనసేన (Janasena) –టీడీపీ (TDP) పొత్తుపై చాలా రోజులుగా చర్చ జరగుతోంది. అధికార వైసీపీ (YSRCP) అయితే ఆ రెండు పార్టీలో ఆల్రెడీ పొత్తులోనే ఉన్నాయని.. చంద్రబాబు (Chandrababu) డైరెక్షన్ లో పవన్ కల్యాణ్ (Pawan Kalyan) నడుస్తున్నారని ఆరోపిస్తోంది.

ఇంకా చదవండి ...
    ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజకీయాల్లో జనసేన (Janasena) –టీడీపీ (TDP) పొత్తుపై చాలా రోజులుగా చర్చ జరగుతోంది. అధికార వైసీపీ (YSRCP) అయితే ఆ రెండు పార్టీలో ఆల్రెడీ పొత్తులోనే ఉన్నాయని.. చంద్రబాబు (Chandrababu) డైరెక్షన్ లో పవన్ కల్యాణ్ (Pawan Kalyan) నడుస్తున్నారని ఆరోపిస్తోంది. అటు టీడీపీ కూడా పవన్ కలిసి వస్తే చంద్రబాబు ముఖ్యమంత్రి అవుతారని లెక్కలువేస్తోంది. ఐతే ఈ విషయంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ మాత్రం పక్కా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. పొత్తు వ్యవహారంలో పొలిటికల్ మైండ్ గేమ్ ఆడుతున్న పవన్.. పరిస్థితులను తనకు అనుగుణంగా మార్చుకుంటున్నారన్న భావన వ్యక్తమవుతోంది. ఇప్పటికే పొత్తుల విషయంలో మూడు ఆప్షన్లు ఉన్నాయని పవన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఒకటి జనసేన ఒంటరిగా బరిలో దిగడం, రెండు జనసేన-బీజేపీ పోటీ చేయడం, మూడు జనసేన-బీజేపీ-టీడీపీ పొత్తుపెట్టుకోవడం.

    ఐతే ఆ ప్రకటన తర్వాత టీడీపీ, బీజేపీ నుంచి వచ్చిన రియాక్షన్స్ చూసి పవన్ తన రాజకీయ వ్యూహంపై ఓ క్లారిటీకి వచ్చారన్న చర్చ జరుగుతోంది. ఇటీవల ప్రకాశం జిల్లాలో కౌలు రైతు భరోసా యాత్ర నిర్వహించిన పవన్ కల్యాణ్ తనకు ఎవరితోనూ పొత్తులండవనే.. ప్రజలతోనే పొత్తుంటూ టీడీపీకి షాకిచ్చారు. అంతేకాదు బీజేపీకి కూడా మెత్తగా చురకంటించారు.

    ఇది చదవండి: చంద్రబాబుకు పోటీగా విశాల్..? కుప్పంలో గెలుపునకు జగన్ స్కెచ్..?


    ఇన్నాళ్లూ తగ్గామని.. ఇకపై తగ్గేది లేదని పవన్ కల్యాణ్ చెబుతూ వస్తున్నారు. 2014 ఎన్నికల్లో పోటీ చేయకుండా తప్పుచేశానని.. ఇకపై అలాంటి తప్పులు చేయనన్న పవన్.. జనసేనను అధికారంలోకి తీసుకురావాలన్న పట్టుదలతో కనిపిస్తున్నారు. అలాగే జనసైనికులు కూడా పవన్ వేరే వ్యక్తిని ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోబెడతానంటే అంగీకరించే పరిస్థితి లేదు. అదే జరిగితే జనసేన పార్టీతో పాటు పవన్ రాజకీయ భవిష్యత్తు ప్రశ్నార్ధకంలో పడటం ఖాయం. ఒంటరిగా పోటీ చేసి ఓడినా ఫర్వాలేదుగానీ.. 2014 సీన్ రిపీట్ కానివ్వొద్దని జనసేన కార్యకర్తలు చెబుతున్నారు.

    ఇది చదవండి: సీఎం జగన్ గోల్డెన్ ఛాన్స్ మిస్సయ్యారా..? ఆ విషయంలో ఆశలు వదులుకోవాల్సిందేనా..?


    ఇదిలా ఉంటే చంద్రబాబు నాయుడు లాంటి సీనియర్ నేతను సీఎం పదవి త్యాగం చేయాలనడం సరికాదనేది టీడీపీ నేతల వాదన. రాష్ట్రానికి చంద్రబాబు లాంటి వ్యక్తి అవసరముందని.. కాబట్టి జనసేన తగ్గాలని సూచిస్తున్నారు. ఇదే అంశాన్ని అవకాశం వచ్చినప్పుడల్లా టీడీపీ నేతలు చెబుతున్నారు.



    ఇందుకు జనసేన పార్టీ మాత్రం ససేమిర అంటోంది. సీఎం అభ్యర్థిగా తానుంటే తప్ప టీడీపీతో పొత్తు ప్రసక్తే లేదని పవన్ స్పష్టం చేస్తున్నారు. 2024లో కుదిరితో బీజేపీతో కలిసి బరిలో దిగడం లేకుంటే సింగిల్ గా ఫైట్ చేయడమే బెటరని జనసేన ఓ నిర్ణయానికి వచ్చింది. బీజేపీతో కూడా పొత్తు అంత సవ్యంగా సాగడం లేదన్న ఇటీవల పరిణామాలతో తెలుస్తోంది. ఇటీవల జరిగిన ఆత్మకూరు ఉపఎన్నికలో కూడా బీజేపీకి మద్దతుగా జనసేన ప్రచారం చేయలేదు. మరి రాబోయే ఎన్నికల నాటికి పరిస్థితుల ఏవిధంగా మారతాయో చూడాలి.
    Published by:Purna Chandra
    First published:

    Tags: Andhra Pradesh, Janasena party, Pawan kalyan, TDP

    తదుపరి వార్తలు