Home /News /andhra-pradesh /

AP POLITICS JANASENA CHIEF PAWAN KALYAN GIVES CLARITY ON STAYING AWAY FROM PM NARENDRA MODI BHEEMAVARAM TOUR FULL DETAILS HERE PRN

Pawa Kalyan: మోదీ పర్యటనపై పవన్ కల్యాణ్ క్లారిటీ.. అందుకే దూరంగా ఉన్నానన్న జనసేనాని

భీమవరంలో మాట్లాడుతున్న పవన్ కల్యాణ్

భీమవరంలో మాట్లాడుతున్న పవన్ కల్యాణ్

ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) లో జనసేన పార్టీ (Janasena Party), బీజేపీ (BJP) పొత్తులో ఉన్నాయి. రెండు పార్టీలు పొత్తులో ఉన్నా ఇంతవరకు ఉమ్మడిగా ఒక్క కార్యక్రమాన్ని కూడా నిర్వహించలేదు. సరికదా క్షేత్రస్థాయిలో కలిసి పనిచేయడం లేదు. పేరుకే పొత్తున్నా అంటీముట్టనట్లుగానే వ్యవహరిస్తున్నాయి.

ఇంకా చదవండి ...
    ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) లో జనసేన పార్టీ (Janasena Party), బీజేపీ (BJP) పొత్తులో ఉన్నాయి. రెండు పార్టీలు పొత్తులో ఉన్నా ఇంతవరకు ఉమ్మడిగా ఒక్క కార్యక్రమాన్ని కూడా నిర్వహించలేదు. సరికదా క్షేత్రస్థాయిలో కలిసి పనిచేయడం లేదు. పేరుకే పొత్తున్నా అంటీముట్టనట్లుగానే వ్యవహరిస్తున్నాయి. అటు కేంద్ర పెద్దలు కూడా ఏపీ విషయంలో జనసేన కంటే వైసీపీకే ప్రాధాన్యత ఇస్తున్నారన్న ప్రచారం కూడా లేకపోలేదు. ఈ నేరథ్యంలో ఈనెల 4న భీమవరంలో జరిగిన మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకలకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ విచ్చేశారు. ఈ కార్యక్రమానికి మోదీ హాజరవడంతో జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా వెళ్తారని.. ఇలా అయినా కేంద్ర పెద్దలతో జనసేన సాన్నిహిత్యం మరింత పెరుగుతుందని అంతా అనుకున్నారు. కానీ ఆ కార్యక్రమానికి పవన్ కల్యాణ్ దూరంగా ఉన్నారు.

    మోదీ పర్యటనకు పవన్ కల్యాణ్ దూరంగా ఉండటంపై పెద్ద చర్చే జరిగింది. ఈ నేపథ్యంలో మోదీ సభకు వెళ్లకపోవడంపై పవన్ స్పందించారు. ఆదివారం భీమవరంలో జనసేన-జనవాణి కార్యక్రమాన్ని నిర్వహించిన పవన్ కల్యాణ్.. మోదీ సభపై మాట్లాడారు. ప్రధాని కార్యక్రమానికి తనకు ఆహ్వానం అందిందని.. కానీ స్థానిక ఎంపీకి అందలేదన్నారు. స్థానిక ఎంపీ రఘురామ కృష్ణంరాజుకి ఆహ్వానం లెనప్పుడు తాను వెళ్లడం సరికాదని అందుకే వెళ్లలేదని వెల్లడించారు.

    ఇది చదవండి: గోదావరిలో మొదలెట్టి పులివెందులలో ముగిస్తాం.. కోనసీమలో పవన్ హాట్ కామెంట్స్..


    మోదీ టూర్ కు పవన్ దూరంగా ఉండటంతో ఇక రెండు పార్టీల మధ్య పొత్తుకు ఎండ్ కార్డ్ పడిందన్న చర్చ జరిగింది. కొంతకాలంగా క్షేత్రస్థాయిలో జనసేన-బీజేపీ మధ్య గ్యాప్ వచ్చింది. సీఎం అభ్యర్థిగా పవన్ ను ప్రకటించాలంటూ జనసేన డిమాండ్ చేస్తుండగా.. బీజేపీ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. దీంతో వచ్చే ఎన్నికల్లో రెండు పార్టీలు కలిసి పనిచేసేది అనుమానంగానే కనిపిస్తోంది. రెండు పార్టీలు ఉమ్మడి కార్యాచరణను రూపొందించకపోవడం, బీజేపీ అధిష్టానం నుంచి రూట్ మ్యాప్ రాకపోవడంపై జనసేన అసంతృప్తిగా ఉంది. ఏపీలో సొంతగా పోటీచేసే సత్తా లేకపోయినా తమ ఆధిపత్యం అన్నట్లు కమలనాథులు వ్యవహరిస్తుండటంపై జనసేన నేతల అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.



    జనసేన చేపట్టిన కౌలు రైతు భరోసా యాత్రలో గానీ, జనవాణి కార్యక్రమంలోగానీ బీజేపీ నేతలు కనిపించడం లేదు. ఇటు జనసేన కూడా ఆత్మకూరు ఉపఎన్నికల్లో బీజేపీకి మద్దతుగా నిలవలేదు. పైగా ఇటీవల బీజేపీ చేపట్టిన కార్యక్రమాలకు జనసేన దూరంగా ఉంది. దీంతో ఇద్దరి మధ్య పొత్తుబంధం తెగిపోయిందన్న చర్చ జరిగింది. మోదీ టూర్ కు పవన్ దూరంగా ఉండటంతో పెద్దదుమారమే రేగింది. దీంతో పవన్ క్లారిటీ ఇచ్చారు.
    Published by:Purna Chandra
    First published:

    Tags: Andhra Pradesh, Bjp-janasena, Pawan kalyan

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు