Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో ఎన్నికల సందడి కనిపిస్తోంది. ఏ క్షణంలోనైనా ఎన్నికలు రావొచ్చు.. ఈ మాట స్వయంగా మంత్రే చెప్పడంతో.. సీఎం జగన్ మోహన్ రెడ్డి (CM Jagan Mohan Reddy) ముందస్తు వ్యూహంలో ఉన్నట్టు అర్థం చేసుకోవచ్చు.. ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు సైతం.. జగన్ ఎన్నికలకు సిద్ధమయ్యారు అనే సంకేతాలు ఇస్తున్నాయి. ఏదీ ఏమైనా.. ఏడాదిన్నరలోనే ఎన్నికలు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్నా..? ఏపీలో పొత్తులపై మాత్రం కన్ఫ్యూజన్ వీడడం లేదు.. మరింత పెరుగుతోంది. టీడీపీ (TDP), జనసేన (Janasena), బీజేపీ (BJP) కలిసి పోటీ చేస్తాయా..? లేక జనసేన టీడీపీ కలిసి పోటీ చేస్తాయా..? లేక బీజేపీ-జనసేన కలిసి పోటీ చేస్తే.. టీడీపీ ఒంటరిగా వెళ్తుందా.. ఇందులో ఏం జరుగుతుంది అన్నదానిపై ఉత్కంఠ వీడడం లేదు. అందుకు పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఇటీవల చేస్తున్న కామెంట్లే కారణం.
పవన్ కళ్యాణ్ వ్యాఖ్యల గురించి చెప్పాలి అంటే.. మోదీతో సమావేశానికి ముందు.. తరువాత అని చెప్పాల్సి వస్తోంది. ఎందుకంటే మోదీతో సమావేశానికి ముందు.. వైసీపీ ఓట్లు చీలనివ్వకుండా చూడడమే తన ప్రధాన లక్ష్యమని.. అన్ని పార్టీలు కలిసి పోరాడాలే చేస్తామని చెబుతూ వచ్చారు. అంతేకాదు అవసరమైతే బీజేపీని ఒప్పించి.. టీడీపీతో కలిసి నడిచేలా చేస్తానని చెబుతూ వచ్చారు. కానీ మోదీ సమావేశం తరువాత పూర్తిగా ఆయన స్టేట్ మెంట్ మారిపోయింది.
ప్రధాని మోదీ-పవన్ మధ్య ఎలాంటి చర్చలు జరిగాయో తెలియదు.. కానీ ఆయతో సమావేశం తరువాత.. టీడీపీతో జనసేన పొత్తు ఉండదనే చర్చ మొదలైంది. ఎందుకంటే ఆ వెంటనే కొన్ని సమావేశాల్లో మాట్లాడిన పవన్.. ఒక్క ఛాన్స్ ఇవ్వాలని ఓటర్లను కోరారు. అంతేకాదు 175 నియోజకవర్గాల్లో జనసేన బరిలో దిగుతుంది అన్నారు.. దీంతో ఇక పొత్తులేదని అంతా ఫిక్స్ అయ్యారు.
ఇదీ చదవండి : శ్రీవారి భక్తులకు అలర్ట్.. రేపటి నుంచి తిరుమలలో ప్రయోగాత్మకంగా మార్పులు
కానీ ఆ వెంటనే ఆ పార్టీ కీలక నేత అయితే నాదెండ్ మనోహర్ మాట్లాడుతూ.. వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ తమ లక్ష్యం అన్నారు. వైసీపీ వ్యతిరేకత ఓట్లు చీలని వ్యూహంతో ముందుకు వెళ్తాం.. అన్ని పార్టీలను కలుపుకొని వెళ్తామంటూ.. మరో కన్ఫ్యూజన్ కు తెరతీశారు. దీంతో వైసీపీ వ్యతిరేక ఓట్లు చీలన వ్యూహం ఏంటి అనే ప్రశ్న మొదలైంది.
ఇదీ చదవండి : ఏపీ కొత్త సీఎస్ జవహర్ రెడ్డి.. సమీర్ శర్మకు కొత్త పోస్టు.. కీలక అధికారులు బదిలీ
ఆ కన్ఫ్యూజన్ ను కొనసాగిస్తూ.. ఇటీవల ఇప్పటంలో మాట్లాడిన పవన్.. వైసీపీని ఓడించడమే తన అజెండా అన్నారు.. వైసీపీని దెబ్బ కొట్టాడానికి మోదీ అనుమతి తనకు అవసరం లేదన్నారు. తాను ఆంధ్రాలో పుట్టాను అని.. ఆంధ్రావాడిని అని.. ఢిల్లీలో చాడీలు చెబుతూ.. వాళ్ల అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదన్నారు.. కచ్చితంగా 2024లో వైసీపీ ఎలా అధికారంలోకి వస్తుందో చూస్తాను అంటూ ఛాలెంజ్ కూడా చేశారు. అంటే పవన్ పొత్తులకు సిద్ధమయ్యారా అనే మళ్లీ అనుమానాలు మొదలయ్యాయి. ముఖ్యంగా జనసైనికుల్లో తీవ్ర గందరగోళం నెలకొంది.
ఇదీ చదవండి : వైసీపీ ఎన్నికల నినాదం అదే.. కలిసి వస్తున్న మూడు రాజధానుల నిర్ణయం.. ఎంతశాత ప్రభావం
ఈ నేపథ్యంలో మంగళగిరిలో నేతలతో ప్రత్యేకంగా సమావేశమైన పవన్ కళ్యాణ్ దీనిపై క్లారిటీ ఇచ్చినట్టు తెలుస్తోంది. పొత్తులపై ఏ నిర్ణయం అయినా మార్చ్ లేదా ఏప్రిల్ తరువాతే ఉంటుందని.. అప్పటి వరకు కేవలం పార్టీ పటిష్టతపైనే అంతా ఫోకస్ చేయాలని.. పొత్తుల గురించి ఆలోచించవద్దరి చెప్పినట్టు సమాచారం. ఏప్రిల్ తరువాత మరోసారి బీజేపీతో మాట్లాడిన తరువాత.. పొత్తులపై ప్రకటన చేద్దామని పవన్ చెప్పినట్టు తెలుస్తోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP News, Janasena party, Pawan kalyan