హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Pawan Kalyan: వచ్చే ఎన్నికల్లో వైసీపీ గెలిచే సీట్లు ఇవే.. బస్సుయాత్ర వాయిదా..? గెలిచే అవకాశం ఉన్నవారికే టికెట్లు

Pawan Kalyan: వచ్చే ఎన్నికల్లో వైసీపీ గెలిచే సీట్లు ఇవే.. బస్సుయాత్ర వాయిదా..? గెలిచే అవకాశం ఉన్నవారికే టికెట్లు

వచ్చే ఎన్నికల్లో ఎవరికి ఎన్ని సీట్లు క్లారిటీ ఇచ్చిన పవన్

వచ్చే ఎన్నికల్లో ఎవరికి ఎన్ని సీట్లు క్లారిటీ ఇచ్చిన పవన్

Pawan Kalyan: వచ్చే ఎన్నికల్లో అధికార వైసీపీ ఎన్ని సీట్లు వస్తాయి.. జనసేన పరిస్తితి ఏంటి అంటూ రెండు విషయాలపై పవన్ కళ్యాణ్ క్లారిటీ ఇచ్చారు. అలాగే గెలిచే అభ్యర్థులకే మాత్రమే ఈ సారి టికెట్లు వస్తాయని స్పష్టం చేశారు. మరోవైపు బస్సు యాత్నను వాయిదా వేస్తున్నామని.. అది కూడా ఎందుకో చెప్పారు.

ఇంకా చదవండి ...
 • News18 Telugu
 • Last Updated :
 • Vijayawada, India

  Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని వచ్చే ఎన్నికల్లో గెలుపు ఎవరిది..? అధికార వైసీపీ (YCP) ఎన్ని సీట్లలో నెగ్గుతుంది..? జనసేన (Janasena) పరిస్థితి ఏంటి..?  అన్ని విషయాలపైనా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan kalyan ) క్లారిటీ ఇచ్చారు. ఇంకా చాలా విషయాలపై నేరుగ వ్యాఖ్యలు చేసిన.. పవన్ కళ్యాణ్.. సీఎం జగన్ మోహన్ రెడ్డి  (CM Jagan Mohan Reddy) పై మరోసారి సంచలన కామెంట్లు చేశారు. తనకు సంబంధించిన 300 ఎకరాల కోసం కేసీఆర్ తో సమావేశమైన వేళ ఇచ్చిన కాఫీ.. పెసరట్టు కోసం ఏపీకి చెందిన ఆస్తులను తెలంగాణకు ఇచ్చేసారని సంలచన ఆరోపణలు చేశారు. 2009లో ప్రజారాజ్యం పార్టీ ఏర్పాటు సమయంలో నిర్దేశించిన లక్ష్యాలు సాధించడం సాధ్యం కాలేదని.. ఆ లక్ష్యాలను ఇప్పుడు జనసేన ద్వారా సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. 2014లో టీడీపీకి మద్దతు వెనుక ప్రముఖ వ్యక్తుల సూచనలు ఉన్నాయని చెప్పుకొచ్చారు.  తాను ఓడిపోయిన వెంటనే కుమిలిపోతానని చాలా మంది అనుకున్నారని, కానీ..రాజకీయంగా అవసరమైతే మరోసారి దెబ్బ తిన్నా ముందుకే వెళ్తానని చెప్పారు. అలాగే జగన్ - ఆయన సోదరి మధ్య ఆస్తులకు సంబంధించి వివాదాలు నడిచాయని.. మీడియా సంస్థలు ..సిమెంట్ కంపెనీలు.. ఇడుపుల పాయ - బెంగుళూరు ప్యాలెస్ కు సంబంధించిన పంపకాల్లో వచ్చిన తేడాలే వారి మధ్య విబేధాలకు కారణమన్నారు.

  సొంత ఆస్తుల కోసం మాత్రం సీఎం జగన్ తోడ బుట్టిన చెల్లితోనే గొడవపడుతున్నారు.. కానీ రాష్ట్ర ప్రజలకు సంబంధించిన సొమ్ము మాత్ర ఇష్టానుసారం మళ్లించినా ఎవరూ ప్రశ్నించటం లేదన్నారు. 2019 ఎన్నికల్లో ప్రజలు ఏ ఆలోచనలోనే వైసీపీకి ఓట్లు వేశారని వ్యాఖ్యానించారు. 151 సీట్లు వచ్చినంత మాత్రాన మహానుభావులు కాలేరని పవన్ చెప్పుకొచ్చారు. ప్రతి దానికి ఒక ఎక్స్ పైర్ డట్ ఉంటుందని.. అలాగే వైసీపీకి ఎక్స్ ఫైర్ డేట్ అయిపోయింది అన్నారు. వైసీపీకి దక్కేది 67 సీట్లు మాత్రమే అని జోస్యం చెప్పారు.

  Pawan Kalyan|| వచ్చే ఎన్నికల్లో వైసీపీకి వచ్చే సీట్లు ఇవే ||గెలిచే వారిక... https://t.co/BcGgYQKY20 via @YouTube #pawanakalyanbdaycdp #Pawanakalyan #JanaSenaParty #janavaanijanasenabharosa #YSRCP #TDPTwitter #YSJaganDarkGovernance #YSJaganFailedCM

  ప్రస్తుత అసెంబ్లీలో కనీసం 10 మంది ఎమ్మెల్యేలు జనసేనకు ఉంటే..ఇప్పుడు స్పీకర్ వెళ్లిపోమనగానే వెళ్లిపోతున్న వారి లాగా ఉండేది కాదన్నారు. అలాగే తన బస్సు యాత్రను అక్టోబర్ లో దసరా నుంచి ప్రారంభించాలని భావించిన.. ప్రస్తుతం పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్త బస్సు యాత్రను వాయిదా వేస్తున్నట్లు పవన్ ప్రకటించారు.

  ఎందుకంటే రాష్ట్రంలో సమస్యలపైన మరింత అధ్యయనం చేయాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. ఆ తరువాతనే యాత్ర చేయాలని నిర్ణయించామన్నారు. ప్రతీ నియోజకవర్గం పైన తానే స్వయంగా సమీక్ష చేస్తాన్నారు. అది కూడా విజయవాడ సెంట్రల్ నుంచే ప్రారంభం అవుతుంది అన్నారు. తనకు అందుతున్న సర్వేల ప్రకారం వైసీపీకి అత్యధికంగా 45- 67 సీట్లు వరకు దక్కే అవకాశం ఉందని చెప్పారు. 2014 ఎన్నికల్లో వైసీపీ సాధించిన సీట్లు కూడా ఇవే అన్నారు.

  ఇదీ చదవండి : నారా లోకేష్ పాదయాత్ర ఫిక్స్.. మూహర్తం ఎప్పుడంటే..? కుప్పం నుంచి ఇచ్చాపురం వరకు షెడ్యూల్ ఇదే

  అలాగే జనసేనకు ప్రజల్లో ఆదరణ పెరిగినట్లు సర్వేల్లో వెల్లడైందన్నారు. బస్సు యాత్ర వాయిదా ఎన్నికల్లో జనసేన అభ్యర్ధులను పోటీ చేయనీయకుండా అడ్డుకుంటున్న వైసీపీ పైన న్యాయ పోరాటానికి జనసేన లీగల్ సెల్ సిద్దంగా ఉండాలని సూచించారు. ఎంత చెప్పినా వైసీపీ నేతల్లో మార్పు రావటం లేదన్నారు. ప్రశ్నిస్తే కేసులు..బూతులతో టార్గెట్ చేయటం అలవాటుగా మారిందని ఫైర్ అయ్యారు. ఇక తప్పని పరిస్థితుల్లో రోడ్లపైకి వస్తామని హెచ్చరించారు. అలాగ వచ్చే ఎన్నికల్లో గెలిచే అవకాశం ఉన్నవారికే ఈ సారి టికెట్లు ఇస్తామని పవన్ స్పస్టం చేసారు. ఒక్క సారి ప్రజలు తమ వైపు చూడాలని పవన్ కోరారు.

  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Andhra Pradesh, Ap cm jagan, AP News, AP Politics, Janasena party, Pawan kalyan

  ఉత్తమ కథలు