Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో మళ్లీ పొత్తులపై చర్చలు జోరందుకున్నాయి. మొన్నటి వరకు ఇటు తెలుగు దేశం (Telugu Desam) అధినేత చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu).. అటు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan kalyan) సైతం.. ఒకే అభిప్రాయం చెబుతూ వచ్చారు.. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా ఉండాలంటే త్యాగాలు తప్పవు అంటూ చెబుతూ వచ్చారు.. ఇద్దరు అదే అర్థం వచ్చేలా మాట్లాడారు. దీంతో ఆ రెండు పార్టీలు పొత్తులు ఫిక్స్ అయ్యాయి అంటూ ప్రచారం జరిగింది. అయితే మహానాడు (Mahanadu) తరువాత తెలుగు దేశం పార్టీ స్టాండ్ మార్చినట్టు కనిపించింది. అప్పటి వరకు వన్ సైడ్ లవ్ అంటూ వచ్చిన చంద్రబాబు.. ఇప్పుడు వార్ వన్ సైడ్ అంటున్నారు. పొత్తుల సంగతి తరువాత చూద్దాం అంటూ.. ముందే అభ్యర్థులను ప్రకటించేస్తున్నారు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ పొత్తులపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.. ఇకపై తాను తగ్గేదే లే అన్నారు. ఇప్పటికే మూడు సార్లు తగ్గానని.. మళ్లీ తననే తగ్గమనడం కరెక్టు కాదని.. ఈ విషయంలో తెలుగుదేశం నేతలే ఆలోచించుకోవాలి అన్నారు.
సీఎం అభ్యర్థిపైనా పవన్ క్లారిటీ ఇచ్చారు. జనసేన, బిజెపి మధ్య బందం గట్టిగా ఉంది అన్నారు. అయితే కరోనా కారణంగా తమ మధ్య సోషల్ డిస్టెన్స్ వచ్చిందన్నారు. ఇటీవల తనకు ఏపీ నేతలతో సంబంధం లేదని.. జాతీయ బీజేపీ నేతలతోనే బంధం ఉంది అంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన ఆయన.. తాజాగా నడ్డా (JP Nadda) ఏపీకి వస్తున్న సందర్భంగా అభినందనలు తెలిపారు. తనకు ముందుగా ఉన్న కార్యక్రమాల కారణంగా ఆయన్ను కలువలేకపోతున్నాను అన్నారు. బీజేపీ జాతీయ నాయకులతో కూడా మాట్లాడాను అన్నారు. రైతుల సమస్యలు, రాష్ట్రంలో పరిస్థితులు కూడా వివరించాను అన్నారు.
ప్రస్తుతం అందరూ తనను పొత్తుల పై అడుగు తున్నారని.. ఒకప్పుడు వార్ వన్ సైడ్ అయ్యింది.. ఇప్పుడు వన్ సైడ్ లవ్ అయ్యింది అంటూ సెటైర్ వేశారు. పొత్తులపై తెలుగు దేశం పార్టీ నేతలు పూర్తి క్లారిటీ వస్తే.. అప్పుడు ఆలోచిస్తాను అన్నారు. అసలు మనందరిలో ఐక్యత ఉందా లేదా అన్నది ఆలోచించుకోవాలి అన్నారు.
2014లో తాను తగ్గి... రాష్ట్రాన్ని గెలిపించా నని.. అలాగే తనను తాను తగ్గించుకున్నను అన్నారు. తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడతాడని బైబిల్ సూక్తి నమ్ముతాను అన్నారు. వైసీపీ అధినేత
జగన్ మాత్రం అందరినీ తగ్గించి ఆయన మాత్రమే ఎదుగుతున్నాడు అన్నారు.
2014, 2019 లో తగ్గాం.. 2024లో తగ్గేదే లేదన్నారు. సీఎం అభ్యర్థి అని బీజేపీ నేతలు ఎవరూ చెప్పలేదన్నారు. అన్నిసార్లు తగ్గాం.. ఈసారి మిగతా వాళ్లు తగ్గితే బాగుంటుందని భావిస్తున్నా ను అన్నారు. ఈ నిర్ణయాలను మనతో పాటు వాళ్లు కుడా ఆలోచించుకోవాలని తెలుగు దేశానికి సూచనలు చేశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP News, Janasena, Pawan kalyan