హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Pawan Kalyan: ఎన్టీఆర్ కు మద్దతుగా పవన్.. ఆ పని చేయొచ్చు కదా అంటూ సలహా

Pawan Kalyan: ఎన్టీఆర్ కు మద్దతుగా పవన్.. ఆ పని చేయొచ్చు కదా అంటూ సలహా

ఈ నాలుగు సీట్లు పవన్ కు సేఫ్

ఈ నాలుగు సీట్లు పవన్ కు సేఫ్

Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి ప్రభుత్వం తీరును తప్పు పట్టారు. అంతేకాదు ఎన్టీఆర్ కు ఆయన మద్దతుగా మాట్లాడారు.. ప్రభుత్వం చేసిన పని వల్ల ప్రజలకు ఒరిగేది ఏమీ లేదు.. రాజకీయ కక్ష తప్ప అంటూ మండిపడ్డారు. ఇంకా పవన్ ఏమన్నారంటే..?

ఇంకా చదవండి ...
 • News18 Telugu
 • Last Updated :
 • Guntur, India

  Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో ప్రస్తుతం ఎన్టీఆర్‌ హెల్త్ యూనివర్శిటీ పేరు (Ntr Health University name Change) మార్పు వ్యవహారంపై రాజకీయంగా రచ్చ రచ్చ అవుతోంది. ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వ విద్యాలయం పేరును డాక్టర్‌ వైఎస్సార్‌ ఆరోగ్య విశ్వ విద్యాలయంగా మారుస్తూ.. అసెంబ్లీలో బిల్లుకు ఆమోదం లభించింది. అయితే దీనిపై ఈ స్థాయిలో వివిదాం ముసురుకుంటుందని సీఎం జగన్ మోహన్ రెడ్డి (CM Jagan Mohan Reddy) ఊహించి ఉండరు. తెలుగు దేశం పార్టీ (Telugu Desam Party).. నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) మాత్రం కచ్చితంగా తప్పు పడతారని.. వారికి కౌంటర్లు ఇచ్చేందుకు కూడా సిద్ధమయ్యారు. కానీ అనూహ్యంగా ఇప్పుడు ఈ వివాదంపై అన్ని పార్టీల నేతలు మండిపడుతున్నారు. సామాన్యులు.. నెటిజన్ల నుంచి కూడా విమర్శలు ఎదురవుతున్నాయి. వైసీపీలో ఉన్న కొందరు నేతలే ఈ నిర్ణయంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ (Vallabaneni Vamsi) మాత్రమే బహిరంగంగా దీనిపై స్పదించినా.. ఏం మాట్లాడాలో తెలియక మదనపడుతున్నవారు చాలామందే ఉన్నారు. కొడాలి నాని (Kodali Nani).. లక్ష్మీ పర్వతి (Laxmi Parvati) లు ఎలా స్పందించాలో తెలియక సైలెంట్ అయ్యారు. అయితే ప్రభుత్వ నిర్ణయాన్ని మాత్రం సమర్ధించే పరిస్థితి కనిపించడం లేదు. తాజాగా దీనిపై జనసేన అధినేత పవన్ సైతం స్పందించారు. అసలు, పేరు మార్చి సాధించేది ఏమిటి? అని ప్రశ్నించారు.

  కేవలం వివాదాలు సృష్టించాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోందని పవన్ ఆరోపించారు. ఎన్టీఆర్‌ వైద్య విశ్వవిద్యాలయం పేరులో మార్పు చేయడం ద్వారా ఏమి సాధించాలని అనుకొంటున్నారో..? ఎన్టీఆర్ బదులుగా వైఎస్సార్ అని పెడితే విశ్వ విద్యాలయంలోనూ, రాష్ట్రంలోనూ వైద్య వసతులు మెరుగైపోయాతాయా? అంటూ ప్రభుత్వాన్ని ఆయన ప్రశ్నించారు.

  రాష్ట్ర ప్రభుత్వం చేయాల్సిన పనులపై ఫోకస్ చేయకుండా.. ఇలా రాజకీయ వివాదాలను తెరపైకి తెస్తోందని మండిపడ్డారు. రాష్ట్రంలో వైద్య వసతులు ప్రమాణాలకు తగ్గ విధంగా లేవని.. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఒక్క ప్రభుత్వ ఆసుపత్రిలోనూ తగినన్ని పడకలు లేవని.. అలాగే సిబ్బంది అందుబాటులో ఉండడం లేదని.. ఔషధాలు కొరత ఉండదని.. ఇలాంటి వాటిపై ప్రభుత్వం ఫోకస్ చేస్తే ప్రజలకు ఉపయోగ పడుతుంది అంటూ సలహా ఇచ్చారు.

  కోవిడ్ సమయంలో మాస్కులు అడిగినందుకే డా.సుధాకర్ వేధించారన్న సంఘటనలను మళ్లీ తెరపైకి తీసుకొచ్చారు. ఆస్పత్రుల్లో మెరుగుపరచాల్సిన మౌలిక వసతులను వదిలిపెట్టి విశ్వ విద్యాలయం పేరు మార్చడంలో ఎలాంటి అర్థం లేదని పవన్ ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం ప్రజల దృష్టిని పక్కదోవ పట్టించేందుకో.. కొత్త వివాదాలు సృష్టించేందుకో వైసీపీ ప్రభుత్వం చేసిన ప్రయత్నంలా ఉంది అని అనుమానం వ్యక్తం చేశారు. ఇలా పాలకులు మారినప్పుడల్లా పేర్లు మార్చుకుంటూ వెళ్తే ప్రజలకు ప్రభుత్వాలపై నమ్మకం పోవడం తప్పా ఒరిగేదేమీ ఉండదన్నారు.

  ఇదీ చదవండి : బాబాయ్ బాలయ్య ఫైర్.. జూనిరయర్ ఎన్టీఆర్ ఎక్కడ అంటూ చర్చ..

  నిజంగా వైఎస్ఆర్ పై ప్రేమ ఉండి.. ఆయన పేరు చిరస్థాయిగా నిలిచిపోవాలని భావిస్తే.. విశాఖలోని కింగ్ జార్జ్ ఆసుపత్రి పేరు మార్చవచ్చు కదా.. ఆ పేరు ఇంకా బ్రిటిష్ వాసనలతో ఉంది. స్వాతంత్ర్య అమృతోత్సవాలు చేసుకున్నాం కాబట్టి విశాఖ కేజీహెచ్ పేరు మార్చి.. మీ తండ్రి పేరు లేద.. వైద్య ప్రముఖులలో ఒకరి పేరు పెట్టండి అని పవన్ సలహా ఇచ్చారు‌. ప్రపంచ ప్రఖ్యాత వైద్య శాస్త్రజ్ఞుల్లో ఒకరైన దివంగత యల్లాప్రగడ సుబ్బారావు పేరయినా ఈ పాలకులకు తెలుసా? అంటూ తన ప్రకటనలో నిలదీశారు. వైద్య విశ్వ విద్యాలయానికి ఆ రంగంలోని ప్రముఖుల పేరు పెట్టాలనే చిత్తశుద్ధితో కూడిన ఆలోచన ఉండి ఉంటే యల్లాప్రగడ సుబ్బారావు పేరును పరిగణించేవారన్నారు.

  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Andhra Pradesh, Andhra pradesh assembly session, Ap cm jagan, Janasena, Pawan kalyan, Ycp

  ఉత్తమ కథలు