హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Pawan Kalyan: పరిహారంలోనూ తేడాలా..? కోటి రూపాయలు ఇవ్వాల్సిందే.. ఏలూరు ప్రమాదంపై పవన్ కామెంట్స్..

Pawan Kalyan: పరిహారంలోనూ తేడాలా..? కోటి రూపాయలు ఇవ్వాల్సిందే.. ఏలూరు ప్రమాదంపై పవన్ కామెంట్స్..

పవన్ కల్యాణ్, వైఎస్ జగన్ (ఫైల్)

పవన్ కల్యాణ్, వైఎస్ జగన్ (ఫైల్)

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని ఏలూరు జిల్లా (Eluru District) ముసునూరు మండలం అక్కిరెడ్డిగూడెం పోరస్ కెమికల్ ఫ్యాక్టరీలోజరిగిన ప్రమాదంపై తీవ్ర కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే.

  ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని ఏలూరు జిల్లా (Eluru District) ముసునూరు మండలం అక్కిరెడ్డిగూడెం పోరస్ కెమికల్ ఫ్యాక్టరీలోజరిగిన ప్రమాదంపై తీవ్ర కలకలం సృష్టించిన సంగతి తెలిసిందే. రియాక్టర్ పేలడంతో ఐదుగురు కార్మికులు అక్కడికక్కడే సజీవ దహనమయ్యారు. ప్రమాదంపై జనసేన (Janasena) అధ్యక్షుడు పవన్ కల్యాణ్ (Pawan Kalyan) స్పందించారు. ఘటనలో కార్మికులు సజీవ దహనమైన ఘటన తనను ఎంతగానో కలచివేసిందని ఆయన అన్నారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపిన పవన్.. ప్రభుత్వం ప్రకటించిన పరిహారంపై కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వం ప్రమాదానికి ఒక్కోలా పరిహారం ఇవ్వడమేంటని ప్రశ్నించారు. పోరస్ ప్రమాదంలో మృతులకు రూ.కోటి చొప్పున పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. కార్మికుల కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకోవాలన్న ఆయన.. వారికి మెరుగైన వైద్యం అందించడంతో పాటు న్యాయబద్ధమైన సాయం చేయాలన్నారు.

  ఈ ప్రమాదాన్ని కూడా విశాఖ ఎల్జీ పాలిమర్స్ తరహాలోనే కోటి రూపాయల చొప్పున పరిహారం అదించాలని పవన్ కల్యాణ్ డిమాండ్ చేసారు. దీనిపై పూర్తిస్థాయిలో దర్యాప్తు చేసి చర్యలు తీసుకోలని అధికారులను కోరారు. ప్రమాదాల విషయంలో తేడాలు చూపకూడదన్నారు పవన్. పోరస్ కంపెనీ ప్రమాద బాధిత కుటుంబాలను ఆదుకోవాలని బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కార్మికులను పరామర్శించిన ఆయన.. బాధితులకు అత్యున్నత వైద్యం అదించాలని డాక్టర్లను కోరారు.

  ఇది చదవండి: కోతల రాయుడు, బాదుడు వీరుడు.. సుచరిత ఏ పార్టీతో మాట్లాడారో తెలుసు.. రఘురామ సంచలన కామెంట్స్..


  ఇదిలా ఉంటే పోరస్ కంపెనీ ప్రమాదంపై స్పందించిన సీఎం జగన్ మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల పరిహారం ఇస్తామని ప్రకటించారు. తీవ్రగా గాయాలైన వారికి రూ.5 లక్షలు, గాయపడ్డ వారికి రూ.2 లక్షలను ఇస్తామని తెలిపారు. అగ్నిప్రమాదం ఎలా జరిగిందన్న దానిపై పూర్తి దర్యాప్తు చేయాల్సిందిగా జిల్లా కలెక్టర్‌ను, ఎస్పీని సీఎం జగన్ ఆదేశించారు. గాయపడిన వారికి పూర్తి స్థాయిలో వైద్య సహాయం అందాలని ఆదేశాలు జారీచేశారు.

  ఇది చదవండి: భక్తులతో కిక్కిరిసిన తిరుమల.. శ్రీవారి దర్శనానికి రికార్డు సమయం.. టీటీడీ కీలక నిర్ణయం


  మరోవైపు ప్రమాదంపై స్పందించారు పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్ నాథ్. మృతుల కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకుంటామన్న మంత్రి.. పోరస్ పరిశ్రమ నుంచి కూడా రూ.25 లక్షలు పరిహారం ఇప్పిస్తామన్నారు. ప్రభుత్వం నుంచి రూ.25 లక్షలతో కలిపి మొత్తం రూ.50 లక్షల పరిహారం అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. పోరస్ ప్రమాద ఘటనపై హోం మంత్రి మేకతోట సుచరిత స్పందించారు. విజయవాడ గొల్లపూడిలోని ఆంధ్రా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించిన మంత్రి.. ప్రజలకు హాని కలిగంచే పరిశ్రమలను సీజ్ చేస్తామని స్పష్టం చేశారు.

  Published by:Purna Chandra
  First published:

  Tags: Andhra Pradesh, Ap cm ys jagan mohan reddy, Pawan kalyan

  ఉత్తమ కథలు