హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Pawan Kalyan: వంద రూపాయల నోటుపై నేతాజీ బొమ్మ.. అస్థికలను వెనక్కు తీసుకురావాలని పవన్ డిమాండ్

Pawan Kalyan: వంద రూపాయల నోటుపై నేతాజీ బొమ్మ.. అస్థికలను వెనక్కు తీసుకురావాలని పవన్ డిమాండ్

పవన్ కళ్యాణ్ (ఫైల్ ఫోటో)

పవన్ కళ్యాణ్ (ఫైల్ ఫోటో)

Pawan Kalyan: ప్రస్తుతం వంద రూపాయల నోటుపై గాంధీజీ బొమ్మ ఉంటుంది. ఇప్పుడు వంద నోటుపై నేతాజి బొమ్మ వేయాలని డిమాండ్ పెరుగుతోంది. గతంలోనూ చాలామంది ఈ డిమాండ్ చేశారు. తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సైతం అదే అభిప్రాయం వ్యక్తం చేశారు.

ఇంకా చదవండి ...

  Pawan kalyan: మన దేశంలో వంద రూపాయిల నోటుపై స్వాతంత్ర్య సమరయోధులు నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ బొమ్మ వేయాలని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ (PawanKalyan) డిమాండ్ చేశారు. భారత దేశం కోసం ప్రాణాలను త్యజించిన నేతాజీ (Netaji) లాంటి నేతను గౌరవించుకోకపోతే మనం భారతీయులమే కాదని పవన్ అభిప్రాయపడ్డారు. ఆయన అస్థికలను తీసుకురావాలని పవన్ ఆకాంక్షించారు. పవన్‌ కల్యాణ్‌ లెర్నింగ్‌ సెంటర్‌ ఫర్‌ హ్యూమన్‌ ఎక్స్‌లెన్స్‌ ఆధ్వర్యంలో హైదరాబాద్‌ శిల్పకళావేదికలో నిర్వహించిన కార్యక్రమంలో పవన్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జనసేనత అధినేతతో పాటు డాక్టర్‌ పద్మజారెడ్డి, ఎం.వి.ఆర్‌.శాస్త్రి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎం.వి.ఆర్‌.శాస్త్రి రచించిన ‘నేతాజీ’ గ్రంథాన్ని ప్రారంభించారు. ఈ పుస్తక సమీక్షలో మాట్లాడిన పవన్‌ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను ‘ఎంవీఆర్‌ శాస్త్రిని ఇప్పటివరకు మూడు సార్లు మాత్రమే కలిశానని.. అయితే ఆయన దాదాపు 20 పుస్తకాలు రచించారన్నారు. తాను సినిమా ఉచితంగా చూస్తానేమో కానీ పుస్తకాలను మాత్రం ఇవ్వను అని పవన్ పేర్కొన్నారు. అలాగే అనంత పద్మనాభ స్వామి నేలమాళిగల్లో ఉన్న సంపద కంటే గ్రంథాలయంలో ఉన్న పుస్తకాలే ఎక్కువ విలువైనవి.

  ఈ సందర్భంగా పవన్ ఓ ఆసక్తికరమైన విషయం చెప్పారు. తన దగ్గరకు త్రివిక్రమ్‌ వస్తున్నాడంటే పుస్తకాలను దాచేస్తాను అని పవన్ అభిప్రాయపడ్డారు. కాగా నేతాజీ గురించి ప్రసంగించిన ఆయన.. జైహింద్‌ అనే నినాదాన్నిఇచ్చిన వ్యక్తి సుభాష్‌ చంద్రబోస్ అని అభిప్రాయపడ్డారు. వంద రూపాయల నోటుపై ఆయన బొమ్మ వేయాలి అని పవన్ డిమాండ్ చేశారు. నేతాజి లాంటి నేతను మనం గౌరవించకపోతే.. అసలు మనం భారతీయులం కాదని పవన్ ఫీలయ్యారు. ఈ దేశం నాది.. దీని కోసం ప్రాణాలు కూడా పోయినా పర్వాలేదు అనుకునే గొప్ప నేత ఆయన అని పవన్ గుర్తు చేశారు.

  ఎంతో మంది గొప్ప గొప్ప నేతల బలిదానాల వల్లే ఈరోజు దేశంలో స్వేచ్ఛగా జీవిస్తున్నారని పవన్ కళ్యాణ్ గుర్తించారు. దేశం కోసం త్యాగం చేసిన వ్యక్తుల జీవితాలను చదవడం కారణంగానే తనకు జీవితమేంటో తెలిసింది అన్నారు. నేతాజీకి అనుకున్న స్థాయిలో గుర్తింపు రావడం లేదని.. అందుకోసం కొత్త తరం కదలాల్సిన అవసరం ఉందన్నారు. అలాగే నేతాజీ అస్థికలు రెంకోజి ఆలయంలో దిక్కులేకుండా ఉన్నాయని గుర్తు చేశారు. అసలు ఆ అస్థికలు నేతాజీవేనా? కాదా? అని పరీక్షలు చేసి తేల్చలేమా? ఇప్పటివరకు మూడు సార్లు ప్రయత్నించినా కుదరలేదన్నారు. ఇక నేతాజీ అస్థికలు దేశానికి తీసుకురావాలని ప్రజలందరూ కోరుకోవాలని అప్పుడే అది సాధ్యమవుతుంది అన్నారు.

  ఈ సందర్భంగా #RenkojitoRedfort, #BringbackNetajiAshes అనే హ్యాష్ ట్యాగ్‌లను పవన్ షేర్‌ చేశారు. నేతాజి హస్తికలను దేశానికి రప్పించాలని.. ఆయన్న బొమ్మను నోట్లపై ముద్రించాలి అనే డిమాండ్ ఎప్పటి నుంచో ఉన్నా.. కార్యరూపం దాల్చడం లేదు. మరి పవన్ డిమాండ్ పై మిత్రపక్షమైన కేంద్రం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి..

  Published by:Nagabushan Paina
  First published:

  Tags: Andhra Pradesh, AP News, Bjp-janasena, Janasena, Powe star pawan kalyan

  ఉత్తమ కథలు