AP 10th Result: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో పదవ తరగతి పరీక్షల ఫలితాలు (10th Exam Result) అందరికీ షాకిచ్చాయి. లక్షలాదిమంది ఫెయిలయ్యారు. దీనికి ఏపీ ప్రభుత్వం (AP Government) అసమర్థతే కారణమని విపక్షాలన్నీ మండిపడుతున్నాయి. వైసీపీ ప్రభుత్వం విద్యావ్యవస్థని సర్వనాశనం చేసిందని, పదవ తరగతి ఫలితాల విషయంలో దశాబ్ద కాలంలో ఇంతటి వైఫల్యం ఎప్పుడూ చూడలేదు అంటున్నాయి విపక్షాలు. దీనికి విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ (Education Minster Botsa Satyanarayana) నైతిక బాధ్యత వహించకుండా తల్లితండ్రులపై తప్పు నెట్టడం దారుణమంటున్నారు. కేవలం విద్యామంత్రి లేకపోవడంతో ఫలితాలను ఆలస్యం చేయడం ఏంటని తెలుగు దేశం పార్టీ (Telugu Desam Party) ప్రశ్నిస్తోంది. ఇతర రాష్ట్రాలు కరోనా వైరస్ (Corona Virus) విస్తరించి.. స్కూళ్లకు సెలవులు ఇచ్చినప్పుడు.. విద్యా ప్రమాణాలు పెంచాలని ప్రయత్నించాయి. ఏపీ ప్రభుత్వం ఉపాధ్యాయులను వైన్ షాపుల దగ్గర ఉంచిందని టీడీపీ నేతలు (TDP Leaders) ఆవేదన వ్యక్తం చేశారు. పాస్ అవుతామని భావించి ఫెయిలైన పదవ తరగతి విద్యార్థుల ఆత్మహత్యలను ప్రభుత్వ హత్యలుగా భావించాలని డిమాండ్ చేస్తున్నారు. తాజాగా జనసేన (Janasena) అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) సైతం పది ఫలితాలపై స్పందించారు.
పది పరీక్షా ఫలితాల విడుదల్లో ప్రభుత్వ వైఫల్యం స్పష్టంగా కనిపించింది అన్నారు పవన్.. అందుకే 10 గ్రేస్ మార్కులిచ్చి విద్యార్థుల భవిష్యత్తు కాపాడాలని ఆయన డిమాండ్ చేశారు. ఉచితంగా రీ కౌంటింగ్ నిర్వహించాలి.. అలాగే ఎలాంటి ఫీజు వసూలు చేయకూడదన్నారు. సప్లిమెంటరీ పరీక్షలకీ ఫీజులు తీసుకోకూడదని కోరారు. పట్టుమని పది పరిశ్రమలు ఏర్పాటు చేసి నిరుద్యోగులకు ఉపాధి కల్పించలేరు. గిట్టుబాటు ధర కల్పించి రైతులకు అండగాను ఉండలేరు. ధరలను అదుపులో ఉంచి ప్రజలను సంతోషపెట్టలేరు. ఇవన్నీ ప్రభుత్వానికి చేతకావడం లేదు.. కనీసం విద్యార్థులకైనా ఉపశమనం కలిగించాలని పవన్ కోరారు.
కనీసం పిల్లలకు సరైన చదువు చెప్పించి వారిని ప్రయోజకులుగా తీర్చిదిద్దలేరా.. అని నిలదీశారు. పదో తరగతి పరీక్షా ఫలితాలు చూస్తే ఆ పని కూడా చేయలేని చేతకాని ప్రభుత్వమని మరోసారి స్పష్టం అయిందన్నారు. తెలుగువారందరికీ వైసీపీ ప్రభుత్వంపై రోత కలుగుతోందన్నారు. విద్యా వ్యవస్థలో జగన్ సర్కార్ లోపభూయిష్ట విధానాలను చరిత్ర దాచి పెట్టుకోదన్నారు పవన్.
విద్యార్థులను ఇంగ్లీష్ మీడియంలో చేరాలని బలవంతపెట్టడం దారుణం అని మండిపడ్డారు.
ఇదీచదవండి : పిట్ట కొంచెం.. కూత చాలా ఘనం.. రికార్డులు క్రియేట్ చేస్తున్న చిచ్చర పిడుగు..
ఇక టీడీపీ నేతలైదే ప్రభుత్వం అసమర్థత మరోసారి బయటపడిందని విమర్శిస్తున్నారు. ఐటీ రంగంలో తెలుగువారు ముందుండడం చంద్రబాబు ఘనతే అని గుర్తు చేస్తున్నారు. ప్రభుత్వం పీజీ విద్యార్థులకు ఫీజు రీయంబర్స్ మెంట్ ఎత్తేయడం బాధాకరని ఆవేనద వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబులాంటి విజనరీ ముఖ్యమంత్రికి , జగన్ లాంటి ప్రిజనరీ ముఖ్యమంత్రికి తేడా ప్రజలకు తెలిసి వస్తోంది అన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: 10th class results, Andhra Pradesh, AP News, AP ssc results, Pawan kalyan