హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Pawan: 20 ఏళ్ల తరువాత పవన్ ఇలా.. కారు టు కట్ డ్రాయర్ అంటూ ట్వీట్ల యుద్ధం

Pawan: 20 ఏళ్ల తరువాత పవన్ ఇలా.. కారు టు కట్ డ్రాయర్ అంటూ ట్వీట్ల యుద్ధం

20 ఏళ్ల తరువాత మళ్లీ పవన్ కళ్యాణ్ ఇలా..?

20 ఏళ్ల తరువాత మళ్లీ పవన్ కళ్యాణ్ ఇలా..?

Pawan Kalyan: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ట్విట్టర్ వేదికగా యుద్ధం కొనసాగిస్తున్నారు. విరామం లేకుండా.. అధికార వైసీపీపై ట్వీట్లతో దండయాత్ర మొదలెట్టారు. కారు నుంచి కట్ డ్రాయర్ వరకు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. మరోవైపు 20 ఏళ్ల మళ్లీ ఆటూ ఆయన షేర్ చేసిన ఫోటో ట్రెండ్ అవుతోంది.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Visakhapatnam, India

Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో ఎన్నికల హీట్ పెరుగుతోంది. ముఖ్యంగా అధికార వైసీపీ -జనసేన (YCP Janasena) మధ్య మాటల యుద్ధం పీక్ కు చేరింది. తాజాగా జనసేన (Janasena) అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ఎన్నికల ప్రచార రథం ‘వారాహి’ రంగుపై వైసీపీ నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. కౌంటర్లు.. సెటైర్లు వేస్తున్నారు. తాజాగా ఆ వాహనంపై వైసీపీ చేస్తున్న విమర్శలకు జనసేన అధినేత పవన్ కల్యాణ్ అదేస్థాయిలో గట్టి కౌంటర్ ఇస్తున్నారు. ట్విట్టర్లో వైసీపీ తీరుపై విమర్శలు చేస్తున్నారు. వరుసగా ట్వీట్ల యుద్ధం కొనసాగిస్తున్నారు. గ్రీనరీ పార్క్ ఫొటో ట్వీట్ చేసిన పవన్ కల్యాణ్.. వైసీపీకి ఆ ఫొటోలోని ఏ గ్రీన్ రంగు ఇష్టమో చెప్పాలన్నారు. రూల్స్ పవన్ కల్యాణ్‌కు మాత్రమేనా అంటూ మరో ట్వీట్ చేశారు. అక్కడితేనే ఆయన ఆగలేదు.. వరుస ట్వీట్లు చేస్తూనే ఉన్నారు. అసూయతో వైసీపీ వెన్నెముక కుళ్లి పోతుందంటూ అర్థం వచ్చేలా మరో ట్వీట్ చేశారు. తరువాత ఆంధ్రప్రదేశ్ నుంచి ఇటీవల వెళ్లిపోయిన కంపెనీల గురించి ప్రస్తావించారు.

కారు టు కట్ డ్రాయర్ అంటూ సంచలన ట్వీట్ చేశారు. వైసీపీ టిక్కట్‌ రేట్‌లు, కారు రంగులు, కూల్చడాలు లాంటి చిల్లర పనులు ఆపి ఏపీ అభివృద్ధి మీద దృష్టి పెట్టాలి. ఇప్పటికే ఏపీలో వీరి లంచాలు, వాటాలు వేధింపుల కారణంగా ‘కారు నుంచి కట్‌ డ్రాయర్‌ కంపెనీల’ దాకా పక్క రాష్ట్రానికి తరలిపోయాయ్ అంటూ పవన్ కళ్యాణ్ మండిపడ్డారు.

 రూల్స్ కేవలం పవన్ కళ్యాణ్ కేనా.. ఇంకెవరికీ ఉండవా అంటూ మరో ట్వీట్ చేశారు.  మరో ట్వీట్‌లో వైసీపీ నేతలు ఈర్ష్యతో రగిలిపోతున్నారని.. నానాటికీ వాళ్ల ఎముకలు కుళ్లిపోతున్నాయని విమర్శలు చేశారు. ఈర్ష్యతో బాధపడే విద్యార్థులు ఇతరుల వస్తువులను నాశనం చేసినప్పుడు తమ స్కూల్ ఓ టీచర్ ఒక సూక్తిని పదేపదే చెప్పేవారని.. హృదయంలో శాంతి ఉంటే ఆ దేహానికి ఆయుష్షు పెరుగుతుంది.. కానీ హృదయంలో కుళ్లు కుతంత్రాలు ఉంటే వారి ఎముకలు కుళ్లిపోతాయి అని చెప్పేవారంటూ పవన్ వెల్లండించారు. ఇదీ చదవండి : ఐదు పైసలకే బిర్యానీ.. టేస్ట్ సూపరంటూ బార్లు తీరిన జనం మరోవైపు పవన్ పోస్ట్ చేసిన ఓ ఫోటో వైరల్ అయ్యింది. ఆయన నటిస్తున్న తాజా చిత్రం ‘హరిహర వీరమల్లు’ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమాను దర్శకుడు క్రిష్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో పవన్ తన లుక్‌తో ప్రేక్షకులను థ్రిల్ చేసేందుకు రెడీ అవుతున్నారు.

ఇదీ చదవండి : రాష్ట్ర విభజన హామీల పరిస్థితి ఏంటి..? రాష్ట్ర ప్రజల ఆకాంక్ష నెరవేరేది ఎప్పుడు..?

పీరియాడికల్ ఫిక్షన్ కథతో ఈ సినిమా వస్తుండటంతో పవన్ ఈ సినిమాతో ఎలాంటి కొత్త రికార్డులు సృష్టిస్తాడా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. తాజాగా దీనికి సంబంధించి తన సోషల్ మీడియా అకౌంట్‌లో ఓ ఫోటో పోస్ట్ చేయడంతో అది ప్రస్తుతం తుఫాను క్రియేట్ చేస్తోంది. దాదాపు 2 దశాబ్దాల తరువాత పవన్ ఇలా చేయడం చూసిన అభిమానులు సంతోషంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. పవన్ తాజాగా మార్షల్ ఆర్ట్స్ ప్రాక్టీస్ చేస్తున్న ఫోటోను తన ట్విట్టర్ అకౌంట్‌లో పోస్ట్ చేశారు. గతంలో జానీ సినిమాలో మార్షల్ ఆర్ట్స్ చేస్తూ కనిపించిన పవన్, తిరిగి ఇన్నాళ్లకు ఇలా ప్రాక్టీస్ చేస్తూ కనిపించడంతో అభిమానులు ఈ ఫోటోను తెగ షేర్ చేస్తున్నారు.

First published:

Tags: Andhra Pradesh, Ap cm jagan, AP News, Janasena, Pawan kalyan

ఉత్తమ కథలు